ఎటు కూడినా 2014!
సామర్లకోట: తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన గణితావధాని బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్ హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ నూతన సంవత్సరం సందర్భంగా రంగురంగుల 16 గడులతో ఓ చదరం తయారు చేశారు.
ఇక్కడిగడుల్లో ఉన్న సంఖ్యలను అడ్డంగా, నిలువుగా, మూలగా ఎటుకూడినా.. 2014 వస్తుంది. ఒకే రంగు కలిగిన గడుల్లోని సంఖ్యలను కూడినా 2014 వస్తుంది. తాను ఇలాంటి మ్యాజిక్ చదరాలను వెయ్యికి పైగా రూపొందించినట్టు ఆయన సోమవారం తెలిపారు.