న్యూడ్‌గా వేల మంది ఫొటోలకు ఫోజులు!
లండన్: ప్రఖ్యాత కళాకారుడు స్పెన్సర్ ట్యునిక్ యూకేలోని హల్ నగరంలో వినూత్న ప్రదర్శనకు శ్రీకారం చుట్టాడు. న్యూయార్క్ కు చెందిన ఆ పెయింటర్, ఫొటోగ్రాఫర్ ప్రదర్శన కోసం దాదాపు 20 దేశాలకు చెందిన ప్రజలు ఇక్కడకు తరలివచ్చారు. హల్ నగర మండలి సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. 3200 మంది నగ్నంగా ఫొటోలకు ఫోజులిచ్చారు. ట్యునిక్ పై అభిమానంతో 80 ఏళ్ల స్టెఫానే జాన్సీన్ అమెరికా నుంచి హల్ సిటీకి వచ్చారు.
నగరంలోని వారసత్వ కట్టడాల వద్ద, ముఖ్యమైన ప్రాంతాల్లో ఇలా నగ్నంగా ఫొటోలకు ఫోజులివ్వాలని ట్యునిక్ ఇచ్చిన పిలుపు మేరకు ఆసక్తి ఉన్నవారు ఇక్కడికి తరలివచ్చారు. మొత్తం నీలం రంగులలో నాలుగు షేడింగ్స్ పెయింట్ ను ఆడా, మగా అందరి శరీరంపై పూర్తిగా పెయింట్ చేశారు. వారసత్వ కట్టడాలు, ప్రకృతిసిద్ధమైన ఆస్తులను కాపాడుకోవాలని చెప్పడంలో భాగంగా ఇలా చేశామని ఆర్టిస్ట్ ట్యునిక్ చెప్పారు.
సముంద్రం, నదులలో నీళ్లు తనకెప్పుడూ ఇష్టమేనని, వాటితో అనుబంధం ఈ విధంగా నీలి రంగు పెయింట్ వాడేలా చేసిందని ఆమెరికన్ ఆర్టిస్ట్ స్పెన్సర్ ట్యునిక్ అన్నాడు. తాను చేపట్టిన ప్రాజెక్టులలో ఇది చాలా భిన్నమైనదన్నారు. 2017లో తాను ఇప్పటివరకూ చేసిన ప్రాజెక్టులను ప్రజల ముందుకు తీసుకొస్తానని తెలిపారు. ఇక్కడికి తరలివచ్చిన వారికి ఫొటోలను పంపిస్తామని, ఎప్పటికీ ఇలాంటి ఘటనలు వారికి గుర్తులుగా మిగిలిపోతాయని ఆర్టిస్ట్ ట్యునిక్ అభిప్రాయపడ్డారు.