Thrash by Mob
-
దారుణం.. కాళ్లు చేతులు కట్టేసి
జైపూర్ : మైనర్ దళిత యువకుడిని కాళ్లు చేతుల కట్టేసి.. దారుణంగా చితకబాదుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతోంది. ఈ సంఘటన ఈ నెల 1న రాజస్తాన్‌లోని పాలీ జిల్లా ధనేరియా గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సదరు దళిత యువకుడు ఓ చిన్నారిని లైంగిక వేధింపులకు గురి చేశాడు. దాంతో గ్రామానికి చెందిన కొందరు యువకులు ఆ దళిత యువకునిపై దాడికి దిగారు. అతని కాళ్లు చేతులు కట్టేసి.. కర్రలతో చితక బాదారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. సదరు దళిత యువకుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి.. జువైనల్ హోమ్‌కు తరలించారు. దాంతో పాటు సదరు యువకుడి మీద దాడి చేసిన వ్యక్తుల మీద కూడా కేసు నమోదు చేశారు. అయితే ఈ వీడియోపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కొందరు సదరు యువకుడు చిన్నారిని ఏడిపించినందకు తన్నలు తిన్నాడని చెప్తుండగా.. మరి కొందరు ఆ దళిత యువకుడు హిందూ ఆలయంలోకి ప్రవేశించాడు. దాంతో ఆగ్రహించిన అగ్ర కులాల యువకులు అతని మీద దాడి చేసి దారుణంగా చితకబాదారని ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. చిన్నారిని ఏడిపించినందుకే సదరు యువకుడిపై దాడి చేశారని తెలిపారు. #BREAKING राजस्थान के जिला पाली गाॅव धनेरिया मे दलित नाबालिग लङके को इतनी बेरहमी से पीटा की मन विचलित हो उठा। इस लङके की गलती सिर्फ इतनी है कि यह गाँव के मन्दिर पर चढ़ गया था ! भगवा गमछा ङाले युवक नजर आ रहा है बताया जा रहा है कि वह भाजपा का कार्यकर्ता हैpic.twitter.com/4kT4olJA1y — The Dalit Voice (@ambedkariteIND) June 3, 2019 -
మనుషులేనా? దారుణం.. గొడ్డును బాదినట్లే..
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని మాలవ్యనగర్‌లో దారుణం జరిగింది. దొంగతనం చేశాడన్న కారణంతో ఓ నైజీరియన్‌ను స్థానికులు గొడ్డును బాదినట్టు బాదారు. కర్రలతో విచక్షణ రహితంగా కొట్టారు. కొట్టొద్దని ఎంత బ్రతిమిలాడిన కనికరం చూపకుండా స్తంభానికి కట్టేసి చావబాదారు. ఈ దారుణం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితుడిని మాత్రం అరెస్టు చేశారుగానీ, అతడిని కొట్టినవారిపై మాత్రం ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. మాలవీయ నగర్‌లోని కృష్ణ కుమార్ అనే వ్యక్తి ఇంట్లో గత నెల (సెప్టెంబర్) 24న ఉదయం దొంగతనం జరిగింది. అయితే, అది చేసింది ఆ నైజీరియనేనని, అతడు దొంగతనం చేసి వస్తుంటే మెట్లు జారి కింద కూడా పడ్డాడని పోలీసులకు చెప్పారు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో ప్రకారం అతడిని ఓ స్తంభానికి కట్టేశారు. ఓ వ్యక్తి అతడి కాళ్లకు కూడా తాడు కట్టి పశువును పట్టుకున్నట్లు పట్టుకోగా మిగితా వారంతా పెద్ద పెద్ద కర్రలు తీసుకొని ఇష్టం వచ్చినట్లు కొట్టారు. అక్కడే ఉన్న ఇంకొందరైతే కత్తితీసుకొని వాడి చేయి నరికేయండి అంటూ కూడా కేకలు పెట్టారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికులు నైజీరియన్‌ను బాదుతున్న వీడియో -
ఇంగ్లీషులో మాట్లాడినందుకు పిచ్చి కొట్టుడు..
సాక్షి, న్యూఢిల్లీ : ఆంగ్లంలో మాట్లాడినందుకు ఓ 22 ఏళ్ల యువకుడిపై ఐదుగురు వ్యక్తులు దారుణంగా దాడి చేశారు. పిడిగుద్దులు, తన్నులతో రెచ్చిపోయారు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ముగ్గురని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నోయిడాకు చెందిన వరుణ్ గులాతీ అనే 22 ఏళ్ల యువకుడు కనౌట్ ప్రాంతంలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో తన స్నేహితుడు అమన్‌ను డ్రాప్ చేసేందుకు వచ్చాడు. ఆ సందర్భంలో వారిద్దరు ఆంగ్లంలో మాట్లాడుకున్నారు. వరుణ్ స్పష్టమైన ఆంగ్లంలో మాట్లాడాడు. తన స్నేహితుడిని డ్రాప్ చేసిన తర్వాత తిరిగి వెళ్లే క్రమంలో ఓ ఐదుగురు వ్యక్తుల దగ్గరకు వచ్చి ఎందుకు ఆంగ్లంలో మాట్లాడావని ప్రశ్నిస్తూనే దాడికి పాల్పడ్డారు. బాగా కొట్టి అనంతరం ఓ వాహనంలో పారిపోయారు. అయితే, వారు పారిపోయిన వాహనం నెంబర్‌ను బాధితుడు నమోదుచేసుకోవడంతో వారు దొరికిపోయారు.