మనుషులేనా? దారుణం.. గొడ్డును బాదినట్లే.. | Nigerian Tied To Post, Thrashed By Mob In Delhi | Sakshi
Sakshi News home page

మనుషులేనా? దారుణం.. గొడ్డును బాదినట్లే..

Published Mon, Oct 9 2017 5:08 PM | Last Updated on Wed, Oct 17 2018 5:27 PM

 Nigerian Tied To Post, Thrashed By Mob In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని మాలవ్యనగర్‌లో దారుణం జరిగింది. దొంగతనం చేశాడన్న కారణంతో ఓ నైజీరియన్‌ను స్థానికులు గొడ్డును బాదినట్టు బాదారు. కర్రలతో విచక్షణ రహితంగా కొట్టారు. కొట్టొద్దని ఎంత బ్రతిమిలాడిన కనికరం చూపకుండా స్తంభానికి కట్టేసి చావబాదారు. ఈ దారుణం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితుడిని మాత్రం అరెస్టు చేశారుగానీ, అతడిని కొట్టినవారిపై మాత్రం ఎలాంటి కేసులు నమోదు చేయలేదు.

మాలవీయ నగర్‌లోని కృష్ణ కుమార్‌ అనే వ్యక్తి ఇంట్లో గత నెల (సెప్టెంబర్‌) 24న ఉదయం దొంగతనం జరిగింది. అయితే, అది చేసింది ఆ నైజీరియనేనని, అతడు దొంగతనం చేసి వస్తుంటే మెట్లు జారి కింద కూడా పడ్డాడని పోలీసులకు చెప్పారు. సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్న వీడియో ప్రకారం అతడిని ఓ స్తంభానికి కట్టేశారు. ఓ వ్యక్తి అతడి కాళ్లకు కూడా తాడు కట్టి పశువును పట్టుకున్నట్లు పట్టుకోగా మిగితా వారంతా పెద్ద పెద్ద కర్రలు తీసుకొని ఇష్టం వచ్చినట్లు కొట్టారు. అక్కడే ఉన్న ఇంకొందరైతే కత్తితీసుకొని వాడి చేయి నరికేయండి అంటూ కూడా కేకలు పెట్టారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

స్థానికులు నైజీరియన్‌ను బాదుతున్న వీడియో  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement