ఇంగ్లీషులో మాట్లాడినందుకు పిచ్చి కొట్టుడు.. | Man Thrashed in Lutyens' Delhi For Speaking in Fluent English | Sakshi
Sakshi News home page

ఇంగ్లీషులో మాట్లాడినందుకు పిచ్చి కొట్టుడు..

Published Tue, Sep 12 2017 12:00 PM | Last Updated on Tue, Sep 19 2017 4:26 PM

ఇంగ్లీషులో మాట్లాడినందుకు పిచ్చి కొట్టుడు..

ఇంగ్లీషులో మాట్లాడినందుకు పిచ్చి కొట్టుడు..

సాక్షి, న్యూఢిల్లీ : ఆంగ్లంలో మాట్లాడినందుకు ఓ 22 ఏళ్ల యువకుడిపై ఐదుగురు వ్యక్తులు దారుణంగా దాడి చేశారు. పిడిగుద్దులు, తన్నులతో రెచ్చిపోయారు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ముగ్గురని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నోయిడాకు చెందిన వరుణ్‌ గులాతీ అనే 22 ఏళ్ల యువకుడు కనౌట్‌ ప్రాంతంలోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో తన స్నేహితుడు అమన్‌ను డ్రాప్‌ చేసేందుకు వచ్చాడు.

ఆ సందర్భంలో వారిద్దరు ఆంగ్లంలో మాట్లాడుకున్నారు. వరుణ్‌ స్పష్టమైన ఆంగ్లంలో మాట్లాడాడు. తన స్నేహితుడిని డ్రాప్‌ చేసిన తర్వాత తిరిగి వెళ్లే క్రమంలో ఓ ఐదుగురు వ్యక్తుల దగ్గరకు వచ్చి ఎందుకు ఆంగ్లంలో మాట్లాడావని ప్రశ్నిస్తూనే దాడికి పాల్పడ్డారు. బాగా కొట్టి అనంతరం ఓ వాహనంలో పారిపోయారు. అయితే, వారు పారిపోయిన వాహనం నెంబర్‌ను బాధితుడు నమోదుచేసుకోవడంతో వారు దొరికిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement