threading
-
2 రోజులే గడువుందంటూ.. టీడీపీ నేతల బరితెగింపు
సాక్షి, తిరుపతి: టీడీపీ నేతలు అడ్డూ అదుపులేకుండా పోతోంది. తిరుపతి నియోజకవర్గంలో సభ్యత్వ నమోదుకు డ్వాక్రా మహిళలకు టీడీపీ నేతలు వాయిస్ మెసేజ్‌లు చేస్తూ బరితెగించేశారు. రూ.100తో టీడీపీ సభ్యత్వ నమోదు, సీఎంఆర్ఎఫ్, రూ.5 లక్షల ఉచిత ప్రమాద బీమా వర్తిస్తుందంటూ ప్రచారం మొదలుపెట్టారు. స్వయం ఉపాధి డ్వాక్రా మహిళలను టీడీపీ నేతల ఒత్తిళ్లకు గురిచేస్తున్నారు.టీడీపీ నేతల సభ్యత్వ నమోదు వైరల్‌గా మారింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఇదే వైఖరి టీడీపీ అవలంభిస్తోంది. 2 రోజులే గడువు ఉందంటూ డ్వాక్రా గ్రూప్‌లో ప్రచారం చేస్తున్నారు. టీడీపీ సభ్యత్వం తీసుకుంటేనే సంక్షేమ పథకాలంటూ డ్వాక్రా సంఘాలను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు.అధికారుల సాక్షిగా.. తమ్ముళ్ల దాష్టీకం!భాకరాపేట: అధికారం ఉంది కదా అని ప్రభుత్వ అధికారులు.. పోలీసుల సాక్షిగా తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. రైతులతోపాటు పంట పొలాలపై దాడికి తెగబడ్డారు. అన్నదాతలపై ప్రతాపం చూపారు. పట్టా భూమిలో కాలువ, కాలినడక బాట ఉందంటూ అర్ధరాత్రి పచ్చని చెట్లను నరికివేశారు. పంట పొలాల చుట్టూ ఏర్పాటు ఏర్పాటుచేసిన కంచెను జేసీబీలతో పెకలించేశారు. పట్టా భూమిలో దౌర్జన్యం చేస్తున్న వారికి కోర్టు ఉత్తర్వులు చూపించేందుకు వచ్చిన రైతులపై దాడిచేశారు. సాక్షాత్తు ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఓ రైతుకు చెందిన పట్టా భూమిలో టీడీపీ నేతలు దౌర్జన్యంగా రోడ్డు ఏర్పాటు చేశారు.కళ్లముందు రైతులపై టీడీపీ నేతలు దాడి చేస్తున్నా పోలీసులు చూస్తుండిపోయారు. ఇదంతా ఎక్కడో కాదు ముఖ్యమంత్రి స్వగ్రామం ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో చోటుచేసుకుంది. చిన్నగొట్టిగల్లు మండలం దిగవూరు రెవెన్యూ గ్రామం మట్లువారిపల్లెలో శుక్రవారం రాత్రి జరిగింది. బాధితులు, స్థానికుల వివరాల మేరకు.. దిగవూరు రెవెన్యూ లెక్క దాఖలు 182, 183 సర్వే నంబర్లులో విశ్రాంత అధ్యాపకుడు దొడ్డిపల్లి రాజారెడ్డికి దాదాపు 12.5 ఎకరాల వారసత్వ ఆస్తి ఉంది. ఈ భూమికి ఆనుకుని ఉన్న కాలినడక వదలివేసి కంచె వేసుకున్నానని రాజారెడ్డి చెబుతున్నారు.తమకు చెందిన భూమిలో ఎక్కడ కూడా ప్రభుత్వ భూమి లేదని, పొలంలో వర్షపు నీరు వెళ్లడానికి చిన్న కాలువ తీసుకుంటే అదే కాలువను బండిబాటగా వేయాలని టీడీపీ నాయకులు వచ్చి తనను, తన సోదరుడు సుధాకర్‌రెడ్డిని చితకబాదినట్లు రాజారెడ్డి తెలిపారు. సుధాకర్‌రెడ్డి సెల్‌ఫోన్ ధ్వంసం చేశారని తెలిపారు. ఇదంతా భాకరాపేట ఎస్ఐ, పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నా.. వారు ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన పొలానికి వేసుకున్న రెండు గేట్లు తొలగించి, వారికి ఇష్టం వచ్చినట్లు ఎక్కడబడితే అక్కడ కంచెను తొలగించి దారి ఏర్పాటు చేసుకున్నారన్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులకు మొరపెట్టుకున్నా తమ గోడు కూడా వినలేదని దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. తన పొలం తనకు అప్పగించి న్యాయం చేయాలని విన్నవించారు. -
భర్తలేని సమయంలో మహిళా సీఐ ఇంట్లో మరో సీఐ.. అసలేం జరిగింది?
వరంగల్ క్రైం: వరంగల్ సీఐడీ విభాగంలో పనిచేస్తున్న ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్పై సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ విషయం కమిషనరేట్‌లో సంచలనం కలిగించింది. సుబేదారి సీఐ షుకుర్ తెలిపిన వివరాల ప్రకారం.. సీఐడీలో పనిచేస్తున్న ఓ మహిళా సర్కిల్ ఇన్స్పెక్టర్ హనుమకొండ రాంనగర్లో ఉంటోంది. ఆమె భర్త రవికుమార్ మహబూబాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. చదవండి: కానిస్టేబుల్‌తో ఎస్సై ప్రేమాయణం.. పెళ్లి చేసుకొని.. సోమవారం మధ్యాహ్నం వరంగల్ సీఐడీ ఇన్స్పెక్టర్ బాల రవి.. రాంనగర్‌లోని మహిళా ఇన్స్పెక్టర్ ఇంటికి ఒంటరిగా ఉన్న సమయంలో వెళ్లాడు. ఆమె భర్త రవికుమార్ తన ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉన్న బాల రవిని చూసి ఎందుకు వచ్చావని ప్రశ్నించాడు. బాల రవి తిరిగి రవికుమార్‌ను బెదిరించాడు. దీంతో తాను లేని సమయంలో, భార్య ఒంటరిగా ఉన్నప్పుడు ఇంటికి వచ్చిన సీఐడీ ఇన్స్పెక్టర్ బాల రవిపై కేసు నమోదు చేయాలని సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బాల రవిపై ఐపీసీ 448, 506 సెక్షన్ల కింది కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ విషయం పోలీస్‌శాఖలో పెద్దఎత్తున చర్చనీయాంశమైంది. -
ఫోన్లో పరిచయం.. యువతిని ప్రేమించా.. పెళ్లి చేయకుంటే చంపుతా
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): యువతిని ప్రేమించానని, తనకు ఇచ్చి పెళ్లి చేయకుంటే చంపుతానని బెదిరింపులకు పాల్పడుతున్న యువకుడిపై కొత్తపేట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పి.నైనవరం గ్రామానికి చెందిన జమ్మాని వెంకటలక్ష్మి, రాము దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె భవ్య(19)కు ఏడాది కిందట పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తరుణ్ తేజ్‌తో ఫోన్లో పరిచయం ఏర్పడింది. చదవండి: ‘నా పరిస్థితి ఎవరికీ రావొద్దు’.. యువతి సెల్ఫీ వీడియో కలకలం అప్పటి నుంచి తరుణ్‌తేజ్ భవ్యను ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఇటీవల వెంకటలక్ష్మి బంధువులు తరుణ్‌తేజ్ గురించి ఆరా తీశారు. అయితే తరుణ్ తేజ్ నడవడిక మంచిది కాదని తెలియడంతో పెళ్లికి ఇష్టం లేదని చెప్పారు. అయితే అప్పటి నుంచి తరుణ్‌తేజ్ భవ్యను వేధింపులకు గురి చేయడమే కాకుండా వారి గ్రామానికి వచ్చి పెళ్లి చేయకుంటే చంపుతానని బెదిరింపులకు దిగాడు. దీంతో ఆందోళన చెందిన వెంకటలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. -
థ్రెడ్డింగ్ థియరీ..
బ్యూటిప్స్ ముఖానికి కనుబొమ్మలు ఎంత అందమో..వాటికి షేపింగ్ మరింత అందాన్ని ఇస్తుందనడానికి ఎలాంటి సందేహం లేదంటున్నారు మగువలు. ఐబ్రోస్‌ను షేపింగ్ చేసే పద్ధతుల్లో థ్రెడ్డింగ్ ఒకటి. ఈ పద్ధతికి బదులుగా ఒకప్పుడు కేవలం ఐబ్రో పెన్సిల్‌ను మాత్రమే ఉపయోగించేవారు. తర్వాతి రోజుల్లో ఈ థ్రెడ్డింగ్ పద్ధతి నగరాలను దాటి గ్రామాల్లోకీ వెళ్లింది. దాంతో ఇప్పుడు గృహిణుల్లో 60శాతం, విద్యార్థుల్లో 90శాతం మంది షేపింగ్ చేయించుకోకుండా ఉండటం లేదంటున్నారు నిపుణులు. థ్రెడ్డింగ్కు వెళ్లినప్పుడు ఈ కింది జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఎలాంటి షేప్ కావాలని కోరుకుంటున్నారో థ్రెడ్డింగ్ చేసేవారికి ముందే వివరించండి. లేదంటే మీరు అనుకున్న షేప్ రాకపోతే మళ్లీ దాన్ని మారుస్తూ ఉంటే చర్మం స్టెయిన్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకు ఇదివరకు చేయించుకున్న తాలుకు ఫొటోలు ఏమైనా ఫోన్లో ఉంటే వారికి చూపించండి. ఈ విషయంలో శుభ్రత కూడా ముఖ్యం. థ్రెడ్డింగ్ చేసేటప్పుడు ఎక్కువమంది దారాన్ని నోట్లో పంటి కింద పెట్టుకొంటుంటారు. అమెరికాలోని కాలిఫోర్నియాలాంటి నగరాల్లో దారాన్ని నోట్లో కాకుండా మెడ చుట్టూ చుట్టుకుంటారట. అక్కడ దారాన్ని నోట్లో పెట్టుకొని థ్రెడ్డింగ్ చేయడం నేరం. కుదిరితే మీరు కూడా రెండో పద్ధతిలోనే చేయించుకోండి. వాళ్ల చేతికి గ్లౌజులు ఉండేలా చూసుకోండి. బ్యుటీషియన్లు ఉపయోగించేది కాటన్ థ్రెడ్డేనా కాదా అన్న విషయం కనుక్కొండి. అవి కాకుండా వేరే దారాలు వాడటం మంచిది కాదు. ఎందుకంటే వెంట్రుకలకు బదులు చర్మం ఊడితే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ప్రతి కట్టింగ్‌లో తక్కువ వెంట్రుకలు మాత్రమే రావాలని వారికి వివరించండి. తక్కువ ధరే కదా అని ఎవరితో పడితే వారితో థ్రెడ్డింగ్ చేయించుకోవడం హానికరం. వాళ్లు ఎక్కడ ట్రెయిన్ అయ్యారో కనుక్కొని మరీ వెళ్లండి. మరో ముఖ్య విషయం ఏంటంటే వారు ఒక మనిషికి థ్రెడ్డింగ్ చేయడానికి ఎంత సమయం తీసుకుంటున్నారో గమనించాలి. గబగబా కాకుండా నిదానంగా చేయాల్సిందిగా బ్యుటీషియన్లకు ముందే చెప్పండి. {థెడ్డింగ్ అయ్యాక రెండు గంటల పాటు ఎలాంటి మేకప్ వేసుకోకూడదు. థ్రెడ్డింగ్ అయిపోయాక తప్పకుండా లోషన్ రాసుకోవాలి. అలా చేస్తే ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షనులు రావు. అవి కూడా నాణ్యమైన లోషన్లనే ఎంచుకోవాలి. థ్రెడ్డింగ్ సమయంలో ఐబ్రోస్ పౌడర్ తప్పనిసరిగా వేయించుకోండి. -
అక్కరలేని వాటి అడ్డు తొలగేదిలా...
నలుగు పిండి యవ్వనంలోకి అడుగుపెట్టాక చాలామంది అమ్మాయిలను విసిగించే సమస్య అవాంఛిత రోమాలు. వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్ వంటి పద్ధతులను అవలంభించినా.. ఇంట్లోనే లభించే పదార్థా లతో అవాంఛిత రోమాలు రాకుండానూ జాగ్రత్తలు తీసుకోవచ్చు. నలుగు పిండి ఎలా చేయాలంటే..! పసుపు, ఆవపిండి, ఉలవల పిండి, కరక్కాయ చూర్ణం, మంచి గంధం పొడి, మారేడు పత్రాల పొడి... వీటన్నింటిని కలిపి కొద్దిగా బరకగా ఉండేలా మర పట్టించుకోవాలి. లేదంటే బరకగా ఉండేలా బియ్యప్పిండి, సెనగపిండిని కూడా కలుపుకోవచ్చు. ఇలా తయారుచేసుకున్న పిండిలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఒంటికి పట్టించి, వ్యతిరేక దిశలో కాస్త ఒత్తిడి కలిగిస్తూ రాస్తూ ఉండాలి. దీన్నే నలుగు పెట్టడం అంటారు. ఇలా చేయడం వల్ల వెంట్రుక సులువుగా ఊడి వచ్చేస్తుంది. ఇలా కుదరకపోతే ఆవుపాల మీగడ కలుపుకోవచ్చు. ఈ మిశ్రమం మరీ జారుగా ఉండకూడదు. వెంట్రుకలు ఎక్కడ ఉన్నాయో, ఆ భాగంలో ఈ పొడిని రాసి, రివర్స్ డెరైక్షన్‌లో మర్దన చేయాలి. అమ్మాయిల్లో పిసిఓడీ వంటి సమస్యల వల్ల ఆండ్రోస్ హార్మోన్లు రిలీజ్ అవుతాయి. దీంతో గడ్డాలు, మీసాలు వస్తుంటాయి. ఏ కారణం వల్ల అవాంఛిత రోమాలు వస్తున్నాయో తెలుసుకొని మందులు వాడితే సమస్య తగ్గుముఖం పడుతుంది.