తల్లితో సహా ముగ్గురు కుమార్తెలు ఆత్మహత్యాయత్నం
అద్దంకి (ప్రకాశం జిల్లా): భర్త వేధింపులు తట్టుకోలేక ముగ్గురు కుమార్తెలతో తనువు చాలించాలని నిర్ణయించుకొని విషగుళికలను మంచి నీటిలో కలిపి కుమార్తెలకు తాపి తాను త్రాగింది. ఈ సంఘటన మంగళవారం రాత్రి పట్టణంలోని ఎన్టీఆర్ నగర్లో చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన సమాచారం మేరకు ... పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ మూడవలైన్లో నివాసం ఉంటున్న పేర్లబాజి జాతకాలు, ప్రశ్నలు చెబుతుంటాడు. ఇతనికి భార్య బుచ్చమ్మ, కుమార్తెలు కోటేశ్వరీ, శృతి, చిన్నారి ఉన్నారు. భార్యపై అనుమానంతో తరచూ వేధిస్తుండేవాడు . దీంతో తనువు చాలించాలని నిర్ణయించుకొని విషగుళికలను మంచి నీటిలో కలుపుకోని కుమార్తెలకు తాపి తాను త్రాగింది. తాగిన కుమార్తెలు బయటివచ్చి కేకలు వేయటంతో స్తానికులు విషయం కనుక్కోని వెంటనే ఆటోలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రధమ చికిత్స అనంతరం పరిస్థితి విషమించటంతో మెరుగైన వైద్యంకోసం ఒంగోలు తరలించారు.