పురుగుమందు తాగిన మూడేళ్ల చిన్నారి
కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలింపు
టేకులపల్లి : ఇంట్లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మూడేళ్ల చిన్నారి పురుగు మందు తాగిన సంఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని వాగొడ్డుతండాకు చెందిన నాగేశ్, స్వరూప దంపతుల మూడేళ్ల చిన్నారి సంజన ఇంట్లో ఆడుకుంటూ ఇంటి బయట ఉన్న పురుగుమందు డబ్బా తీసుకుని అందులోని మందును ప్రమాదవశాత్తు తాగింది. ఇది గమనించిన తల్లిదండ్రులు 108లో కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు.