లిన్ డాన్ ‘సిక్సర్’
ఆరోసారి ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్ సొంతం
బర్మింగ్హమ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో చైనా సూపర్‌స్టార్ లిన్ డాన్ మరోసారి సత్తా చాటుకున్నాడు.
ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో లిన్ డాన్ 21-9, 21-10తో తియాన్ హువీ (చైనా)పై గెలుపొందాడు. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గడం లిన్ డాన్కిది ఆరోసారి కావడం విశేషం. గతంలో లిన్ డాన్ 2004, 2006, 2007, 2009, 2012లలో టైటిల్ సాధించాడు.