రద్దయిన విశాఖ వన్డే టిక్కెట్ల డబ్బు వాపస్
హైదరాబాద్: హుదూద్ తుపాను కారణంగా గత నెలలో విశాఖపట్నంలో రద్దయిన భారత్-వెస్టిండీస్ వన్డే మ్యాచ్ టిక్కెట్ల డబ్బును వెనక్కి ఇవ్వనున్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విశాఖ స్టేడియం వద్ద టిక్కెట్ల డబ్బును వాపస్ ఇస్తారు.
గత నెల 14న విశాఖలో భారత్, వెస్టిండీస్‌ల మధ్య మూడో వన్డే జరగాల్సివుంది. ఈ మ్యాచ్‌కు టిక్కెట్లను కూడా విక్రయించారు. అయితే హుదూద్ తుఫాన్ కారణంగా విశాఖ అతలాకుతలమవడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. దీంతో బీసీసీఐ మూడే వన్డేను రద్దు చేసింది. ఈ మ్యాచ్‌ను మరో తేదీ లేదా వేదికకు మార్చాల్సిన అవసరం కూడా లేదని బోర్డు నిర్ణయించింది.