ఆర్‌కామ్‌లో టీఐఎఫ్‌పీఎల్ వాటాల పెంపు
న్యూఢిల్లీ: టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ కమ్యూనికేషన్స్‌లో (ఆర్‌కామ్) ప్రమోటర్ గ్రూప్ సంస్థ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ (టీఐఎఫ్‌పీఎల్) వాటాలను 59.70 శాతానికి పెంచుకుంది. ఇందుకోసం రూ. 650 కోట్లు చెల్లించింది. ఇందులో భాగంగా టీఐఎఫ్పీఎల్కి జారీ చేసిన వారంట్లను 8,66,66,667 షేర్ల కింద బదలాయించినట్లు ఆర్‌కామ్ వెల్లడించింది. ప్రస్తుతం ఆర్‌కామ్‌లో టీఐఎఫ్‌పీఎల్ 58.25 శాతం వాటాలు ఉన్నాయి.
గతేడాది జులైలో టీఐఎఫ్ఎల్కు ఆర్‌కామ్ వారంట్లను జారీ చేసింది. ఇందుకు గాను అప్పట్లో రూ. 650 కోట్లు, తాజాగా షేర్ల కింద బదలాయించుకుని మరో రూ. 650 కోట్లు టీఐఎఫ్ఎల్ చెల్లించింది. ఈ నిధులను రుణ భారం తగ్గించుకునేందుకు ఆర్‌కామ్ వినియోగించుకోనుంది. సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసికంలో కంపెనీ రుణ భారం రూ. 36,334 కోట్ల మేర ఉంది.