'పులులు, సింహాలనూ పెంచుకోనివ్వండి'
క్రూర జంతువుల సంతతిని పెంచేందుకు వాటిని పెంపుడు జంతువులుగా పెంచుకునేందుకు చట్టాలు ప్రజలకు ఇవ్వాలని మధ్య ప్రదేశ్కు చెందిన ఓ మంత్రి వింత ప్రతిపాదన చేశారు. దేశంలో పులులు, సింహాల సంఖ్య రోజురోజుకూ తగ్గుతున్నందున వాటిని సంరక్షించుకుంటూ వాటి సంతతిని వృద్ధి చేసేందుకు పెట్స్గా పెంచుకునే అవకాశం ఇవ్వాలని సూచించారు.
మధ్యప్రదేశ్ లో యానిమల్ హస్బెండరీ, హార్టికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా కుసుమ్ మెదాలే పనిచేస్తున్నారు. ఆఫ్రికా, దక్షిణాసియాలోని థాయిలాండ్ వంటి దేశాల్లో క్రూర మృగాలను పెట్స్గా పెంచుకునేలా చట్టాలు ఉన్నాయని ఆమె చెప్పారు. ఈ మేరకు మన చట్టంలో కూడా మార్పులు తీసుకురావాలని కుసుమ్ మెదాలే అటవీశాఖకు లేఖలు రాయటం విశేషం.