Tigor XM sedan
-
పెట్రోల్, డీజిల్ కష్టాలకు చెక్.. అదిరిపోయిన టాటా మోటార్స్ సీఎన్జీ కార్స్!
Tata Motors Company: ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ సీఎన్జీ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. టియాగో, టిగోర్ మోడల్స్‌లో ఐసీఎన్జీ వేరియంట్స్‌ను మార్కెట్లోకి పరిచయం చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.6.09 లక్షల నుంచి రూ.8.29 లక్షల వరకు ఉంది. టాటా టిగోర్ సీఎన్జీ ధర రూ.7.69 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టియాగో, టిగోర్ అమ్మకాల్లో 30-35 శాతం సీఎన్జీ విభాగం కైవసం చేసుకోవాలన్నది కంపెనీ లక్ష్యం. భారత్‌లో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) కార్ల అమ్మకాల్లో 2019-20లో 60 శాతం, గత ఆర్థిక సంవత్సరంలో 97 శాతం వృద్ధి నమోదైంది. సీఎన్జీ వాహనాలకు కస్టమర్ల నుంచి ఆసక్తి పెరుగుతుండగా, బీఎస్-6 ప్రమాణాల రాకతో డీజిల్ హ్యాచ్బ్యాక్స్, కాంపాక్ట్ సెడాన్స్‌కు డిమాండ్ పూర్తిగా కనుమరుగైందని కంపెనీ తెలిపింది. ఇప్పటికే మారుతి సుజుకి, హ్యుందాయ్ ఈ విభాగంలో కార్లను విక్రయిస్తున్నాయి. టియాగో సీఎన్జీ, టిగోర్ సీఎన్జీ రెండూ పూర్తి ట్యాంక్ చేస్తే 300 కిలోమీటర్లు వరకు వెళ్లనున్నాయి. టాటా టియాగో సీఎన్జీ 1.2-లీటర్ రెవోట్రాన్ ఇంజిన్‌తో పాటు పనిచేసే హ్యాచ్ బ్యాక్ కు అమర్చిన సీఎన్జీ కిట్‌తో వస్తుంది. ఇంజిన్ 73 పీఎస్ పవర్ అవుట్ పుట్ ఉత్పత్తి చేస్తుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 165 మి.మీగా ఉంది. టియాగో సీఎన్జీ మాదిరిగానే టిగోర్ సీఎన్జీ కూడా 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. దీని ఇంజిన్ కూడా 73 పీఎస్ పవర్ అవుట్ పుట్ ఉత్పత్తి చేస్తుంది. (చదవండి: SEBI Saa₹thi App: ఇన్వెస్టర్లకు అండగా సెబీ ‘సారథి’ యాప్..!) -
కొత్త టిగోర్ ఈవీని టీజ్ చేసిన టాటా మోటార్స్
టాటా మోటార్స్ తన కొత్త టిగోర్ ఈవీని లాంచ్ చేయడానికి ఒక రోజు(ఆగస్టు 18) ముందు దానికి సంబందించిన ఒక వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. మైక్రోబ్లాగింగ్ సైట్ లో పోస్ట్ చేసిన వీడియోలో కొండ పైకి ఎక్కుతున్న నెక్సన్ ఈవీ కారుతో పాటు మరో ఎలక్ట్రిక్ కారు వెళుతునట్లు చూపించారు. అందులో చూపించిన మరో కారు కొత్త టిగోర్ ఈవీ జిప్ట్రాన్. ఈ జిప్ట్రాన్ టెక్నాలజీ టాటా నెక్సన్ ఈవితో ప్రారంభం అయ్యింది. టాటా మోటార్స్ కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వ అధికారులు, ఫ్లీట్ ఆపరేటర్ల కోసం టిగోర్ ఈవీ సెడాన్ ను ప్రవేశపెట్టింది. జిప్ట్రాన్ టెక్నాలజీతో కొత్త టిగోర్ ఈవీ రికార్డు సృష్టించే అవకాశం ఉన్నట్లు ఆటోమేకర్ నమ్ముతోంది. జిప్ ట్రాన్ టెక్నాలజీ అధిక ఓల్టేజి 300+ ఓల్ట్ గల ఎలక్ట్రిక్ మోటార్ తో వస్తుంది. ప్రస్తుత టిగోర్ ఈవిలో ఉండే 72వీ ఎసీ ఇండక్షన్ టైప్ మోటార్ కంటే ఈ మోటార్ మరింత శక్తివంతమైనదని పేర్కొన్నారు. రాబోయే ఎలక్ట్రిక్ సెడాన్ మెరుగైన పనితీరును కనబరుస్తుందని భావిస్తున్నారు. జిప్ట్రాన్ ఈవీలు ఒకే ఛార్జ్ తో 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు అని టాటా మోటార్స్ గతంలో పేర్కొంది. డిజైన్ విషయానికి వస్తే, ఎలక్ట్రిక్ కారు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, బంపర్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ లైట్లు ఉన్నాయి. ఈ ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో రావచ్చు. రాబోయే టిగోర్ ఈవి వైవిధ్యమైన రంగులలో లభించవచ్చు. క్యాబిన్ లోపల కూడా అవుట్ గోయింగ్ ఫ్లీట్-స్పెక్ టిగోర్ ఈవితో పోలిస్తే ఇది మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. Fasten your seatbelts. The all-new EV from Tata Motors is here! #Ziptron #ZiptronElectricAscent #TataMotors #ElectricVehicle #TataMotorsEV pic.twitter.com/OKMuKrK4BD — Tata Motors Electric Mobility (@TatamotorsEV) August 11, 2021 -
ఎయిర్టెల్ గూటికి ‘టిగో రువాండా’
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ కంపెనీ రువాండాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెలికం కంపెనీలో పూర్తి వాటాను కొనుగోలు చేయనున్నది. టిగో రువాండా బ్రాండ్ కింద టెలికం కార్యకలాపాలు నిర్వహిస్తున్న మిల్లికామ్ ఇంటర్నేషనల్ సెల్యులర్ ఎస్ఏలో వంద శాతం వాటా కొనుగోలు కోసం ఒప్పందం కుదుర్చుకున్నామని భారతీ ఎయిర్టెల్ తెలిపింది. ఈ వాటాను తమ అనుబంధ కంపెనీ ఎయిర్టెల్ రువాండా లిమిటెడ్ కొనుగోలు చేయనున్నదని పేర్కొంది. దీంతో టిగోకు చెందిన 3.7 కోట్ల మంది వినియోగదారులు ఎయిర్‌టెల్‌కు లభిస్తారని, 8 కోట్ల డాలర్ల ఆదాయంతో రువాండాలో రెండో అతి పెద్ద టెలికం కంపెనీగా ఎయిర్టెల్ రువాండా నిలుస్తుందని వివరించింది. 40 శాతం మార్కెట్ వాటా ఎయిర్టెల్ రువాండాకు దక్కుతుందని పేర్కొంది. ఈ ఒప్పందానికి నియంత్రణ, చట్టబద్ధ ఆమోదాలు పొందాల్సి ఉందని వివరించింది. భారత్, దక్షిణాఫ్రికాలతో పాటు ఎయిర్టెల్ కంపెనీ మరో 15 ఆఫ్రికా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఆఫ్రికా దేశాల టెలికం కార్యకలాపాల నుంచి మార్జిన్లు సాధించడం మొదలవుతుందని సునీల్ మిట్టల్ పేర్కొన్నారు. -
టాటా టిగోర్ కొత్త వేరియంట్
ధర రూ.4.99 లక్షలు సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ మార్చిలో తీసుకొచ్చిన తన సెడాన్ కారు 'టిగోర్' లో కొత్త వేరియంట్‌ను శనివారం లాంచ్ చేసింది. రూ.4.99 లక్షలకు 'టిగోర్ ఎక్స్ఎం' పెట్రోల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రతి సెగ్మెంట్లో ఉన్న ఖాళీలను పూరించడానికి తాము ఎల్లవేళలా కృషిచేస్తామని టాటా మోటార్స్ పీవీబీయూ హెడ్, మార్కెటింగ్ వివేక్ శ్రీవత్స చెప్పారు. తమ అన్ని డీలర్‌షిప్‌ల వద్ద టీగోర్ కొత్త వేరియంట్ 2017 సెప్టెంబర్ 15 నుంచి అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ కారు 1.2 లీటరు పెట్రోల్, 1.0 లీటరు డీజిల్ ఇంజిన్ ఆప్షన్లను కలిగి ఉంది. దీని తోబుట్టు కార్ల వలే ఐదు-స్పీడు మాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఇది రూపొందింది. ఆల్ ఫోర్ పవర్ విండోస్, స్పీడు-సెన్సిటివ్ ఆటో డోర్ లాక్స్, హోమ్ ల్యాంప్స్, ఎల్ఈడీ ఫ్యూయల్ గేజ్, ఫుల్ ఫ్యాబ్రిక్ సీట్లు, ఇంటీరియర్ ల్యాంప్ విత్ డిమ్మింగ్ ఫంక్షన్, ఫుల్ వీల్ కవర్స్‌తో ఇది తయారైంది. టాటా టీగోర్ ఇప్పటికే హ్యుందాయ్ ఎక్స్‌సెంట్, మారుతీ డిజైర్, ఫోర్డ్ ఆస్పైర్, ఫోక్స్ వాగన్ అమియోలకు గట్టిపోటీగా ఉంది.