ధర రూ.4.99 లక్షలు
టాటా టిగోర్ కొత్త వేరియంట్
Published Sat, Sep 9 2017 6:19 PM | Last Updated on Tue, Sep 19 2017 1:36 PM
ధర రూ.4.99 లక్షలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ మార్చిలో తీసుకొచ్చిన తన సెడాన్ కారు 'టిగోర్' లో కొత్త వేరియంట్‌ను శనివారం లాంచ్ చేసింది. రూ.4.99 లక్షలకు 'టిగోర్ ఎక్స్‌ఎం' పెట్రోల్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ప్రతి సెగ్మెంట్‌లో ఉన్న ఖాళీలను పూరించడానికి తాము ఎల్లవేళలా కృషిచేస్తామని టాటా మోటార్స్ పీవీబీయూ హెడ్, మార్కెటింగ్ వివేక్ శ్రీవత్స చెప్పారు. తమ అన్ని డీలర్‌షిప్‌ల వద్ద టీగోర్ కొత్త వేరియంట్ 2017 సెప్టెంబర్ 15 నుంచి అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ కారు 1.2 లీటరు పెట్రోల్, 1.0 లీటరు డీజిల్ ఇంజిన్ ఆప్షన్లను కలిగి ఉంది.
దీని తోబుట్టు కార్ల వలే ఐదు-స్పీడు మాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఇది రూపొందింది. ఆల్ ఫోర్ పవర్ విండోస్, స్పీడు-సెన్సిటివ్ ఆటో డోర్ లాక్స్, హోమ్ ల్యాంప్స్, ఎల్‌ఈడీ ఫ్యూయల్ గేజ్, ఫుల్ ఫ్యాబ్రిక్ సీట్లు, ఇంటీరియర్ ల్యాంప్ విత్ డిమ్మింగ్ ఫంక్షన్, ఫుల్ వీల్ కవర్స్‌తో ఇది తయారైంది. టాటా టీగోర్ ఇప్పటికే హ్యుందాయ్ ఎక్స్‌సెంట్, మారుతీ డిజైర్, ఫోర్డ్ ఆస్పైర్, ఫోక్స్ వాగన్ అమియోలకు గట్టిపోటీగా ఉంది.
Advertisement
Advertisement