కారు ఢీకొని టిప్పుఖాన్ బ్రిడ్జి ధ్వంసం
హైదరాబాద్: అదుపు తప్పి వేగంగా దూసుకెళ్లి కారు బీభత్సం సృష్టించింది. లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు రోజుల్లో ఇది మూడో ప్రమాదం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మాదాపూర్‌లో నివాసముండే నరేష్ మంగళవారం మధ్యాహ్నం ఆరె మైసమ్మ దేవాలయానికి వెళ్లారు. బోలేరో కారులో సాయంత్రం తిరుగు ప్రయాణంలో వేగంగా వస్తున్న కారు టిప్పుఖాన్ పూల్ కొత్త బ్రిడ్జి వద్దకు రాగానే అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది.
ఆ సమయంలో కారు ముందు టైరు పగిలింది. అంతటితో కారు అదుపులోకి రాలేదు. అంతే వేగంతో ముందుకు దూసుకెళ్లడంతో కారు ముందు భాగం విరిగింది, ఆ తరువాత కారు బ్రిడ్జిని ఢీ కొట్టింది. దీంతో బ్రిడ్జి భాగం ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రభుత్వ ఆస్తి ధ్వసం కేసు నమోదు చేశారు.