తిరుచానూరులో దొంగల బీభత్సం
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో గురువారం అర్దరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. జిల్లాలోని తిరుచానూర్‌లో తొమ్మిదిళ్లల్లో దొంగలు పడి దొరికినంత దోచుకెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం..స్థానికంగా నివాసం ఉండే ఎన్ వీ సుబ్బారావు ఇంట్లోకి దొంగలు ప్రవేశించి బీరువాలో ఉన్న రూ.10 వేల నగదు, 12 తులాల బంగారాన్ని తీసుకెళ్లారు.
అదే కాలనీలో ఉన్న ఎనిమిదిఇళ్లలో చోరిలకు పాల్పడి మరో 50 వేల నగదు తో పాటు, 5 తులాల బంగారం అపహరించుకుపోయారు. బాధితులు శుక్రవారం ఉదయం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
(తిరుచానూరు)