విద్యుధ్ఘాతంతో వ్యక్తి మృతి
చిన్నశంకరంపేట: ఇంట్లో కరెంట్ వైర్లు సరిచేస్తున్న వ్యక్తి విద్యుధ్ఘాతానికి గురై మృతి చెందగా.. అతన్ని రక్షించడానికి యత్నించిన మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం శేరిపల్లి గ్రామంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తిరుమలయ్య(45) ఇంట్లో విద్యుత్ తీగలు సరి చేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుధ్ఘాతానికి గురయ్యాడు. అతన్ని రక్షించడానికి వచ్చిన మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు.