శ్రీవారి అదనపు లడ్డూ ధరల పెంపు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి లడ్డూలు అదనం గా కావాలనే భక్తులకు టీటీడీ చేదువార్త అందించిం ది. ఉచిత, సర్వదర్శనం భక్తులకు అందజేసే లడ్డూల ధరల్లో మార్పు చేయని టీటీడీ అదనంగా లడ్డూలు కావాలనే వారికి మాత్రం రెట్టింపు ధరలు చెల్లించి కోరినన్ని లడ్డూలు పొందే సౌకర్యాన్ని కల్పించింది.
రూ.25 ధరతో విక్రయించే చిన్న లడ్డూ (175 గ్రాము లు)రూ.50కి, కల్యాణోత్సవం లడ్డూ రూ.100 నుంచి రూ.200, వడప్రసాదం రూ.25 నుంచి రూ.100కి పెంచారు. ఈ ధరలు గురువారం నుంచి అమలు చేశారు. తిరుమల ఆలయం వెలుపల జరిగే కల్యాణో త్సవాల్లో అదనపు లడ్డూలు, వడలు కావాలనే వారికి మాత్రమే ధరలు పెంచుతామని గతంలో టీటీడీ అధి కారులు చెప్పారు. అయితే, శ్రీవారి ఆలయంలో అద నపు లడ్డూలు, వడలు కావాలనే వారికి కూడా అదే నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురావటం గమనార్హం.