Tirupati plant
-
త్వరలో తిరుపతి ప్లాంట్ నిర్మాణం: లావా
తిరుపతి: దేశీ హ్యాండ్సెట్ల తయారీ సంస్థ లావా మొబైల్స్ త్వరలోనే తిరుపతి ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి లే అవుట్ సిద్ధమయిందని, నిర్మాణ పనులను ప్రారంభిస్తామని లావా ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ హెడ్ గౌరవ్ నిగమ్ చెప్పారు. మంగళవారం మార్కెట్లోకి లావా జెడ్61 స్మార్ట్‌ఫోన్ విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం కంపెనీకి 1,100 మంది పంపిణీదారులున్నారు. ఇప్పటివరకు పట్టణ, సబ్–అర్బన్, గ్రామీణ ప్రాంతాలలో ఉనికిని చాటుకున్న లావా ఇక నుంచి 10,000 జనాభా కంటే తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాలకు చేరుకునే ప్రయత్నం చేస్తోంది. వచ్చే 12–18 నెలల్లో 40 శాతం మార్కెట్ వాటాను సొంత చేసుకోవాలనేది సంస్థ లక్ష్యం. ఇందులో భాగంగా నోయిడా ప్లాంటులో ఉత్పత్తిని పెంచడం, తిరుపతి ప్లాంట్ నిర్మాణం వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తున్నాం’’ అని గౌరవ్ నిగమ్ వివరించారు. ఆఫ్రికాకు ఎగుమతయ్యే హ్యాండ్సెట్ల తయారీ పూర్తిగా భారత్‌లోనే కొనసాగుతోందని చెప్పారు. లావా జెడ్61 స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. 18:9 ఫుల్‌వ్యూ హెచ్డీ డిస్ప్లే, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. 1జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ.5,750 కాగా.. 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ.6,750గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. -
సెల్కాన్ తిరుపతి ప్లాంటు నేడు ప్రారంభం
♦ తొలి దశలో రూ.150 కోట్ల పెట్టుబడి ♦ సెల్కాన్ వ్యవస్థాపకుడు వై.గురు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ తయారీలో ఉన్న సెల్కాన్ సంస్థ తిరుపతి సమీపంలో నెలకొల్పిన తయారీ కేంద్రాన్ని గురువారం ప్రారంభించనుంది. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారు. రేణిగుంట విమానాశ్రయం వద్ద శ్రీ వెంకటేశ్వర మొబైల్, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌లో ఏర్పాటైన తొలి ప్లాంటు ఇదే. రోజుకు 72,000 మొబైల్స్ ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని తీర్చిదిద్దారు. ప్రస్తుతం బేసిక్ మొబైళ్లు, స్మార్ట్ఫోన్లతోపాటు ట్యాబ్లెట్ పీసీలను తయారు చేస్తారు. రానున్న రోజుల్లో ఎల్ఈడీ టీవీలు, సీసీటీవీ కెమెరాలను సైతం రూపొందిస్తామని సెల్కాన్ వ్యవస్థాపకుడు వై.గురు బుధవారం ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. తొలి దశలో రూ.150 కోట్లు వెచ్చిస్తున్నట్టు చెప్పారు. ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 4,000 మందికి ఉపాధి లభించనుందని వెల్లడించారు. శ్రీ వెంకటేశ్వర మొబైల్, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌లో ప్లాంటు ఏర్పాటుకై 2015 సెప్టెంబరు 15న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సెల్కాన్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కంపెనీ ఇప్పటికే హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్ వద్ద తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. ఫ్యాబ్‌సిటీ వద్ద మరో ప్లాంటును సైతం ఏర్పాటు చేస్తోంది. -
తిరుపతి ప్లాంటుకు రూ.500 కోట్లు: లావా
నెలకు 50 లక్షల ఫోన్ల ఉత్పత్తి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హ్యాండ్సెట్ల తయారీ రంగంలో ఉన్న లావా మొబైల్స్ తిరుపతి మొబైల్స్ హబ్‌లో ఏర్పాటు చేస్తున్న ప్లాంటుకు రూ.500 కోట్లు పెట్టుబడి చేయనుంది. 2017 నాటికి ప్లాం టులో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. 20 ఎకరాల్లో రానున్న ఈ ప్లాంటు పూర్తిగా సిద్ధమైతే నెలకు 50 లక్షల ఫోన్లను ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యమని లావా ఇంటర్నేషనల్ చీఫ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫీసర్ సంజీవ్ అగర్వాల్ వెల్లడించారు. తమ ప్లాంటు ద్వారా 12,000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. రానున్న రోజుల్లో భారత్‌లో పూర్తి తయారీ వ్యవస్థను అభివృద్ధి చేస్తామని, స్థానికంగా విడిభాగాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తామన్నారు. తిరుపతి సమీపంలో రేణిగుంట విమానాశ్రయం వద్ద ఏర్పాటవుతున్న శ్రీవెంకటేశ్వర మొబైల్, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ దసరా రోజున శంకుస్థాపన చేశారు. 2022కి రూ.2,615 కోట్లు.. ఆరు నెలల క్రితం కార్యకలాపాలు ప్రారంభమైన లావాకు చెందిన నోయిడా ప్లాంటు సామర్థ్యం నెలకు 10 లక్షల యూనిట్లు ఉంది. ఈ ప్లాంటులో తయారీ వ్యయం చైనా స్థాయిలోనే ఉందని సంజీవ్ వెల్లడించారు. భారత్‌లో రెండు తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు 2022 నాటికి రూ.2,615 కోట్లు ఖర్చు చేస్తామని జూలైలో లావా సీఎండీ హరి ఓం రాయ్ ప్రకటించారు. కొంత మొత్తం ఆర్‌అండ్‌డీకి వెచ్చిస్తామన్నారు. ఈ ప్లాంట్లు పూర్తి అయితే సంస్థ తయారీ సామర్థ్యం మొత్తం నెలకు 1.8 కోట్ల యూనిట్లకు చేరుతుంది.