TKM
-
‘ఇన్నోవా క్రిస్టా’ లిమిటెడ్
న్యూఢిల్లీ: వాహన తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) తన పాపులర్ మల్టీ–పర్పస్ వెహికల్ (ఎంపీవీ) ‘ఇన్నోవా క్రిస్టా’లో లిమిటెడ్ ఎడిషన్ను మంగళవారం మార్కెట్లోకి విడుదలచేసింది. భారత్ స్టేజ్ (బీఎస్)–6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఈ వాహనం ధర రూ. 21.21 లక్షలుగా ప్రకటించింది. 2.4 లీటర్ల డీజిల్, 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వంటి ఫీచర్లతో లీడర్షిప్ ఎడిషన్ పేరిట దీనిని ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా టీకేఎం సేల్స్ అండ్ సర్వీస్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ సోని మాట్లాడుతూ.. ‘ఎంపీవీ సెగ్మెంట్లో ఈ వాహనం 50 శాతం వాటాను కలిగిఉంది. ఇందుకు సంకేతంగా లీడర్షిప్ ఎడిషన్ను విడుదలచేశాం’ అని వ్యాఖ్యానించారు. -
టయోటా ఫార్చునర్, ఇన్నోవా ధరలు పెరిగాయ్
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టయోటా కిర్లోస్కర్ మోటార్’ (టీకేఎం) తాజాగా తన బెస్ట్ సెల్లింగ్ మోడళ్ల ధరలను 2 శాతం వరకు పెంచింది. ‘ఇన్నోవా క్రిస్టా’ ధరను 1 శాతం, ‘ఫార్చునర్’ ధరను 2 శాతం పెంచినట్లు కంపెనీ తెలిపింది. తాజా పెంపు నిర్ణయం మే 1 నుంచి అమల్లోకి వచ్చిందని పేర్కొంది. కమోడిటీ ధరల పెరుగుదలతో వాహన ధరలను పెంచాల్సి వచ్చిందని టీకేఎం డైరెక్టర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్.రాజా తెలిపారు.