టయోటా ఫార్చునర్, ఇన్నోవా ధరలు పెరిగాయ్
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టయోటా కిర్లోస్కర్ మోటార్’ (టీకేఎం) తాజాగా తన బెస్ట్ సెల్లింగ్ మోడళ్ల ధరలను 2 శాతం వరకు పెంచింది. ‘ఇన్నోవా క్రిస్టా’ ధరను 1 శాతం, ‘ఫార్చునర్’ ధరను 2 శాతం పెంచినట్లు కంపెనీ తెలిపింది. తాజా పెంపు నిర్ణయం మే 1 నుంచి అమల్లోకి వచ్చిందని పేర్కొంది. కమోడిటీ ధరల పెరుగుదలతో వాహన ధరలను పెంచాల్సి వచ్చిందని టీకేఎం డైరెక్టర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్.రాజా తెలిపారు.