‘ఇన్నోవా క్రిస్టా’ లిమిటెడ్‌ | Innova Crysta Ltd launch New Edition | Sakshi
Sakshi News home page

‘ఇన్నోవా క్రిస్టా’ లిమిటెడ్‌

Published Wed, Mar 18 2020 10:50 AM | Last Updated on Wed, Mar 18 2020 10:50 AM

Innova Crysta Ltd launch New Edition - Sakshi

న్యూఢిల్లీ: వాహన తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం) తన పాపులర్‌ మల్టీ–పర్పస్‌ వెహికల్‌ (ఎంపీవీ) ‘ఇన్నోవా క్రిస్టా’లో లిమిటెడ్‌ ఎడిషన్‌ను మంగళవారం మార్కెట్లోకి విడుదలచేసింది. భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)–6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఈ వాహనం ధర రూ. 21.21 లక్షలుగా ప్రకటించింది. 2.4 లీటర్ల డీజిల్, 5 స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ వంటి ఫీచర్లతో లీడర్‌షిప్‌ ఎడిషన్‌ పేరిట దీనిని ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా టీకేఎం సేల్స్‌ అండ్‌ సర్వీస్‌ విభాగం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నవీన్‌ సోని మాట్లాడుతూ.. ‘ఎంపీవీ సెగ్మెంట్‌లో ఈ వాహనం 50 శాతం వాటాను కలిగిఉంది. ఇందుకు సంకేతంగా లీడర్‌షిప్‌ ఎడిషన్‌ను విడుదలచేశాం’ అని వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement