breaking news
T.Ministers
-
అసెంబ్లీ ప్రోరోగ్పై గవర్నర్ను కలిసిన టి.మంత్రులు
హైదరాబాద్: అసెంబ్లీ ప్రోరోగ్ అంశంపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను సోమవారం తెలంగాణ మంత్రులు కలిశారు. రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి రానున్న నేపథ్యంలో అసెంబ్లీని ప్రోరోగ్ చేయొద్దంటూ వారు గవర్నర్కు విన్నవించారు. కొన్ని రోజుల క్రితం అసెంబ్లీని ప్రోరోగ్ చేయాలంటూ సీఎంఓ కార్యాలయం అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీఅసెంబ్లీ ప్రోరోగ్ అయితేనే ఆర్డినెన్సుల జారీకి వీలుంటుందని ముఖ్యమంత్రి కార్యాలయం ఆ ప్రకటనలో తెలిపింది. ప్రోరోగ్ అనేది పాలనాపరమైన అంశమని, అంతేతప్ప ఇందులో రాజకీయాలు, దురుద్దేశాలు ఏమీ లేవని వివరించింది. కాగా తెలంగాణ మంత్రులు మాత్రం అసెంబ్లీ ప్రోరోగ్ వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగానే టీ.మంత్రులు గవర్నర్ ను కలిశారు. -
హైదరాబాద్ విలీనం చారిత్రాత్మక ఘట్టం
హైదరాబాద్ విలీనం చారిత్రాత్మక ఘట్టమని టి.జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం అభివర్ణించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 29న జరపతలపెట్టిన సకలజనుల భేరీ సభకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని ఆయన తెలిపారు. అందుకోసం ఈ నెల 20న పోలీసు అధికారులను కలుస్తామన్నారు. సకలజనుల భేరీ సభకు అనుమతి ఇప్పించాల్సిన బాధ్యత టి.మంత్రులపై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం గణేష్ నిమజ్జనం సందర్భంగా జై గణేశా... జై తెలంగాణ... అంటూ నినాదాలు చేయాలని కోదండరాం తెలంగాణవాదులకు పిలుపునిచ్చారు.