
హైదరాబాద్ విలీనం చారిత్రాత్మక ఘట్టం
హైదరాబాద్ విలీనం చారిత్రాత్మక ఘట్టమని టి.జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం అభివర్ణించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 29న జరపతలపెట్టిన సకలజనుల భేరీ సభకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని ఆయన తెలిపారు.
అందుకోసం ఈ నెల 20న పోలీసు అధికారులను కలుస్తామన్నారు. సకలజనుల భేరీ సభకు అనుమతి ఇప్పించాల్సిన బాధ్యత టి.మంత్రులపై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం గణేష్ నిమజ్జనం సందర్భంగా జై గణేశా... జై తెలంగాణ... అంటూ నినాదాలు చేయాలని కోదండరాం తెలంగాణవాదులకు పిలుపునిచ్చారు.