ఎగ్‌స్ట్రార్డిన రీ!
నేడు వరల్డ్ ఎగ్ డే
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 1.2 ట్రిలియన్ గుడ్లను తింటున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే గుడ్లలో 40 శాతం గుడ్లను చైనాలో వినియోగిస్తున్నారు.
ముప్పై నిమిషాల్లో 427 ఆమ్లెట్లు వేయడం ద్వారా హోవర్డ్ హెల్మేర్ అనే వ్యక్తి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లోకి ఎక్కాడు.
జార్జ్ కెన్నడి నటించిన ‘కూల్ హ్యాండ్ లూక్’ (1967) చిత్రంలోని ‘నోబడీ కెన్ ఈట్ 50 ఎగ్స్’ డైలాగ్ అప్పట్లో బాగా పేలింది.
కామన్వెల్త్ ఆఫ్ కెంటకీలో ‘వరల్డ్ హార్డ్-బాయిల్డ్ ఎగ్ ఈటింగ్ ఛాంపియన్షిప్’ పోటీలు జరుగుతుంటాయి.
ప్రసిద్ధ చిత్రకారుడు సాల్వడర్ డాలీకి గుడ్లు అంటే ప్రత్యేక అభిమానం. ఆయన పెయింటింగ్‌లో అవి కనిపిస్తాయి. స్పెయిన్‌లోని ‘డాలీ మ్యూజియం’లో రకరకాల గుడ్లు ఉన్నాయి.
పాప్యులర్ గేమ్స్‌లో ఎన్నో ఎగ్ ఫీచర్స్ ఉన్నాయి. ఎగ్ హంట్, ఎగ్ టాస్, ఎగ్ రోలింగ్, ఎగ్ ట్యాపింగ్...మొదలైనవి.
ప్రాచీన రోమన్లు తొలిసారిగా ఆమ్లెట్ వేశారు. తేనెతో కలిపి తినేవారు. దీన్ని ఒవెమెల్(గుడ్లు మరియు తేనె) అని పిలిచేవారు.
సన్‌షైన్ విటమిన్‌గా ‘విటమిన్ డి’ లభించేది గుడ్డులోనే!