భూమి ధర చెల్లిస్తాం
తోకపల్లె(పెద్దారవీడు) : పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల కోసం పునరావాస స్థలాల సేకరణ అంశంపై వై.పాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్రాజు, జాయింట్ కలెక్టర్ యాకూబ్నాయక్లు గురువారం పరిశీలించారు. తోకపల్లె గ్రామస్తులు మాట్లాడుతూ పునరావాసానికి ఎంపిక చేసిన స్థలాలను, పొలాలను వదిలివేయూలని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం 12 ఎకరాలు తీసుకోగా.. వారు కోర్టుకు వెళ్లారని వివరించారు.
జేసీ మాట్లాడుతూ
రెవెన్యూ రికార్డుల్లో అసైన్మెంట్ భూములుగా గుర్తిస్తే మరో చోట పొలాలు ఇస్తామని..సెటిల్మెంట్ భూమి అయితే ప్రస్తుత ధర ప్రకారం నగదు చెల్లిస్తామన్నారు. సుంకేసుల గ్రామ ఎస్సీలకు, గుండంచర్ల గ్రామానికి చెందిన నిర్వాసితులకు గృహాలు నిర్మించేందుకు ప్లాన్ను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, బీసీ జనరల్, ముస్లింలకు వేర్వేరుగా గృహాలను నిర్మించాలని.. మసీదు, చర్చి, దేవాలయాలు వారి ఇళ్ల వద్దే ఉండేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈ నెలాఖరు లోపు పట్టాలను మంజూరు చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే డేవిడ్రాజు మాట్లాడుతూ ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. ముఖ్యంగా పాఠశాలలుండాలన్నారు.