పల్లెటూళ్లో ప్రణయం
‘‘పల్లెటూరి ప్రేమకథలు వచ్చి చాలా ఏళ్లయ్యింది. ఆ లోటుని తీర్చే సినిమా ఇది’’ అని దర్శకుడు డి.మోహన్ దీక్షిత్ చెప్పారు. కౌషిక్‌బాబు, హరీష్, అశ్విని హీరో హీరోయిన్లుగా శ్రీ జాగృతి ఫిలింస్ పతాకంపై వైఎల్ భాస్కరరాజు నిర్మిస్తున్న చిత్రం ‘తొలి సంధ్య వేళలో’. తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో 90 శాతం చిత్రీకరణ జరిపారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ చిత్రానికి కథే బలం. కౌషిక్‌బాబు లవర్‌బోయ్‌గా కనిపించబోతున్న ఈ చిత్రం ఫీల్‌గుడ్ మూవీ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ నెలాఖరుకి అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసి మే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మీనాక్షి భుజింగ్, కెమెరా: పి.ఆర్.పి. రాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: డి. దిలీప్‌కుమార్.