టామ్ బూన్‌కు అత్యధిక ధర
న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్ ఆటగాళ్ల క్లోజ్డ్ బిడ్‌లో బెల్జియం స్టార్ ఫార్వర్డ్ టామ్ బూన్‌కు అత్యధిక ధర పలికింది. వ చ్చే ఏడాది జరిగే మూడో సీజన్ కోసం శనివారం ఈ బిడ్డింగ్ జరిగింది. లీగ్ లో కొత్తగా ప్రవేశిస్తున్న దబాంగ్ ముంబై ఫ్రాంచైజీ బూన్‌ను లక్షా మూడు వేల డాలర్ల (రూ. 63 లక్షలు)కు కొనుగోలు చేసింది. లీగ్ చరిత్రలోనే ఇది అత్యధిక ధర. గత రెండు సీజన్లలో ముంబై మెజీషియన్స్గా బరిలోకి దిగిన ఈ జట్టు యాజమాన్యం లీగ్ నుంచి వైదొలగగా... డుఇట్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కొనుగోలు చేసింది.
దీంతో వచ్చే సీజన్‌కు సరికొత్తగా తయారయ్యేందుకు మొత్తం 7లక్షల 50 వేల డాలర్ల (రూ.4 కోట్ల 62 లక్షలు)ను ఖర్చు చేసింది. బూన్‌తో పాటు రెండో అత్యధిక ధరతో మాథ్యూ స్వాన్ (ఆసీస్, రూ.48 లక్షలు)ను తీసుకుంది. అలాగే గ్లెన్ టర్నర్, డేవిడ్ హార్ట్, ఫ్లోరిస్ ఎవెర్స్, అర్జున్ హలప్ప, భరత్ చికారా తదితరులను జట్టులో చేర్చుకుంది.దేశీయ ఆటగాళ్లలో గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ 69 వేల డాలర్ల (దా దాపు రూ.43 లక్షలు)తో టాప్‌లో నిలిచాడు. తనను ఉత్తర ప్రదేశ్ విజార్డ్ కొనుగోలు చేసుకుంది.
ఇక భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోనికి చెందిన రాంచీ రైనోస్... ఆసీస్ స్ట్రయికర్ ట్రెంట్ మిట్టన్‌ను 67 వేల డాలర్ల (రూ.41 లక్షలు)కు దక్కించుకుంది. ఓవరాల్‌గా ఈ బిడ్‌లో 149 మంది ఆటగాళ్లు (95 మంది స్వదేశీ, 54 విదేశీ) పాల్గొన్నారు.