రేపటి పరీక్షలు వాయిదా
అనంతపురం ఎడ్యుకేషన్ : భారత్ బంద్ నేపథ్యంలో ఈ నెల 28న నిర్వహించాల్సిన పరీక్షలన్నింటినీ రద్దు చేసినట్లు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. రంగస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. మిగతా రోజుల్లో జరగాల్సిన పరీక్షలు యథావిధిగా జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.