ton
-
ఫీడ్ ధరలకు ముకుతాడు
సాక్షి, అమరావతి: రొయ్య రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలుస్తోంది. తాజాగా రొయ్యల మేత (ఫీడ్) ధరలు పెంచేందుకు కంపెనీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) రంగంలోకి దిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఫీడ్ ధర టన్నుకు రూ.103 నుంచి రూ.256 వరకు పెంచుతూ సీపీఎఫ్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలను తక్షణమే అమలు చేయాలంటూ డిస్ట్రిబ్యూటర్లకు ఆదేశాలు సైతం జారీ చేసింది. సీపీఎఫ్ బాటలోనే మిగిలిన కంపెనీలు కూడా ధరల పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఈ విషయాన్ని రొయ్య రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అప్సడా సీపీఎఫ్ కంపెనీ ప్రతినిధులతో చర్చించింది. పెంచిన ధరలను ఉపసంహరించుకునేలా చర్యలు చేపట్టింది. ప్రభుత్వంతో చర్చించకుండా ధరలు పెంచొద్దని ఫీడ్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మిగిలిన అన్ని కంపెనీలు ధరల పెంపుదల నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాయి. తాజాగా ధరల పెంపు ఉపసంహరణ ఫలితంగా కిలో రొయ్యల ఉత్పత్తిపై రూ.4.50 చొప్పున భారం తగ్గింది. గతంలోనూ ధరల పెంపును అడ్డుకున్న ప్రభుత్వం ప్రస్తుతం మేత కోసం ప్రతి రైతు కిలో రొయ్యల ఉత్పత్తికి రూ.90 వరకు ఖర్చు చేస్తున్నారు. ఏటా ఫీడ్ అమ్మకాల ద్వారా రూ.12,600 కోట్ల టర్నోవర్ జరుగుతోంది. గతంలో ఏటా కనీసం రెండు, మూడుసార్లు ఫీడ్ కంపెనీలు ధరలు పెంచేవి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీడ్ తయారీ, అమ్మకాలను సైతం అప్సడా చట్టం పరిధిలోకి తీసుకురావడంతో ఇష్టానుసారంగా ధరల పెంపునకు కళ్లెం పడింది. ప్రభుత్వ అనుమతి లేకుండా 2022 మే 19న టన్నుకు రూ.256 చొప్పున పెంచేందుకు కంపెనీలు ప్రయత్నించాయి. అంతర్జాతీయ ఒడిదుడుకులతో ఆశించిన ధర లేక సతమతమవుతున్న అప్పటి తరుణంలో రైతులపై పైసా భారం మోపడానికి వీల్లేదని ప్రభుత్వం తేల్చిచెప్పడంతో కంపెనీలు పెంపు ప్రతిపాదనలను పూర్తిగా వెనక్కి తీసుకున్నాయి. అదే రీతిలో 2022 అక్టోబర్ 13న టన్నుకు రూ.260 చొప్పున పెంచాయి. ప్రభుత్వ ఆదేశాలతో పెంచిన నాలుగు రోజులకే కంపెనీలు వెనక్కి తీసుకున్నాయి. ఇలా రెండేళ్లలో మూడుసార్లు పెంచిన ధరలను వెనక్కి తీసుకోవడంతో సగటున కిలోకు రూ.8.60 చొప్పున మేత ఖర్చుల భారం రైతులకు తగ్గింది. సీఎం జగన్ ఆదేశాలతో.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అప్సడా ఆధ్వర్యంలో సీపీఎఫ్ కంపెనీ ప్రెసిడెంట్ సహా ఇతర ఉన్నతాధికారులను పిలిపించి సమావేశం నిర్వహించాం. ధరల పెంపు ప్రతిపాదనను ఉపసంహరింప చేసుకునేలా ఆదేశాలిచ్చాం. ప్రభుత్వాదేశాలతో సీపీఎఫ్తో సహా ఇతర కంపెనీలు కూడా ధరల పెంపు ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నాయి. – వడ్డి రఘురాం, కో–వైస్ చైర్మన్, అప్సడా -
'యాపిల్' రీసైక్లింగ్ లో టన్ను బంగారం!
కంచి పట్టు చీరలు పాతవైనా వాటికో విలువ ఉంటుంది. ఎందుకంటే వాటి నేతకు వినియోగించే బంగారం, వెండి, కాపర్ వంటి వస్తువులు తిరిగి పనికొస్తాయి. అలాగే యాపిల్ ఐ ఫోన్లు బ్రాండ్ ఇమేజ్ మాత్రమే కాదు.. పాతపడిపోయినా అందులో వినియోగించే వస్తువులవల్ల కూడ దానికో విలువ ఉంటుందన్నమాట. ఇటీవల యాపిల్ కంపెనీ పాత ఫోన్లు రీసైకిల్ చేసి ఏకంగా ఓ టన్ను బంగారాన్ని సేకరించిందట. అంతేకాదు దాంతోపాటు ఫోన్లో వినియోగించే అల్యూమినియం, రాగి, స్టీల్ వంటి పదార్థాలను కూడ మిలియన్ల కొద్దీ టన్నులు సంపాదించిందట. యాపిల్ డివైజ్ లను రీ సైకిల్ చేయడం ద్వారా ఒక సంవత్సరంలో కంపెనీ ఓ టన్నుకు పైగా బంగారాన్ని సేకరించిందట. దాంతోపాటు 10.4 మిలియన్ కిలోల స్టీల్, రెండు మిలియన్ కిలోల అల్యూమినియం, 1.4 మిలియన్ కిలోల రాగిని కూడ సేకరించింది. ఒక్క బ్రాండ్ నేమ్ కే కాదు... ఫోన్ లో వినియోగించే వస్తువులు కూడ విలువైనవి కావడంతోనే యాపిల్ ఫోన్ కు అంత క్రేజ్ ఉందన్నమాట. పూర్తిగా పారేసే బదులు అవసరం లేని, పనికిరాని వస్తువులు పాత సామాన్ల వాళ్ళకి అమ్మేస్తుంటాం. అలానే యాపిల్ కంపెనీకూడ పనికిరాని ఐఫోన్లు, ఐ ప్యాడ్లు, మ్యాక్ కంప్యూటర్ల నుంచి 2015 సంవత్సరంలో సుమారు 28 మిలియన్ల యూరోలు ఖరీదైన మెటల్ ను సేకరించి సొమ్ము చేసుకుందట. మంచి బ్రాండ్ ఎలక్ట్రానిక్ వస్తువులు త్వరగా పాడవకుండా ఉండేందుకు వాటిలో కొద్దిపాటి బంగారాన్ని కూడ వినియోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో యాపిల్ కంపెనీ రీ సైక్లింగ్ కార్యక్రమంలో భాగంగా పనికిరాని, పాత యాపిల్ వస్తువులను వినియోగదారులకు డబ్బు చెల్లించి కొనుగోలు చేసి కర్మాగారంలో శుద్ధి చేస్తుంది. ఇందులో లక్షల ఖరీదైన ఉక్కు, అల్యూమినియం, రాగిని సేకరించింది. తమ కంపెనీ ఎలక్ట్రానిక్ వస్తువులు తయారీలో నాణ్యతకోసం ఖరీదైన, విలువైన వస్తువులను వాడతామని యాపిల్ కంపెనీ సంవత్సరాంతపు రీసైక్లింగ్ నివేదికలో వెల్లడించింది. అంతేకాక ఇలా రీ సైకిల్ చేయడంవల్ల ఆయా పరికరాల్లోని పునరుత్పాదక శక్తి వినియోగంతోపాటు.. ప్రకృతికి, మనుషులకు ఎటువంటి నష్టం కలగకుండా ఉంటుందని తెలిపింది. తమ కంపెనీ వస్తువులద్వారా చైనా సరఫరాదారులతో పాటు ప్రపంచవ్యాప్తంగా అందరికీ పరిశుభ్రతను పాటించే అవకాశం ఉంటుందని యాపిల్ తన నివేదికలో తెలిపింది. -
టీమిండియాను ఆదుకున్న రాయుడు
అంబటి రాయుడు సెంచరీ హాఫ్ సెంచరీతో అండగా నిలిచిన బిన్నీ జింబాబ్వే లక్ష్యం 256 హారారే: జింబాబ్వే పర్యటనలో తెలుగుతేజం అంబటి రాయుడు అదరగొట్టాడు. ఇతర టాపార్డర్ బ్యాట్స్‌మెన్ విఫలమైనా రాయుడు (124 నాటౌట్) సెంచరీతో కదంతొక్కి, బిన్నీతో కలసి టీమిండియాను ఆదుకున్నాడు. స్టువర్ట్ బిన్ని (77) హాఫ్ సెంచరీతో రాణించి రాయుడికి అండగా నిలిచాడు. జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత్ 256 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రాయుడు, బిన్నీతో పాటు కెప్టెన్ రహానె (34) రాణించాడు. ఓ దశలో టీమిండియా 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ మురళీ విజయ్ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ రహానె, అంబటి రాయుడు జట్టును ఆదుకునేందుకు ప్రయత్నించారు. జట్టు స్కోరు 60 పరుగుల వద్ద రహానె అవుటవడంతో టీమిండియా కష్టాల్లోపడింది. మనోజ్ తివారి (2), రాబిన్ ఊతప్ప (0), కేదార్ జాదవ్ (5) వెంటవెంటనే అవుటయ్యారు. ఈ దశలో మరో వికెట్ పడుంటే పరిస్థితి దారుణంగా ఉండేది. అయితే రాయుడు బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. రాయుడుకు స్టువర్ట్ బిన్నీ మద్దతుగా నిలిచాడు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జట్టు స్కోరును 200 దాటించారు. ఈ క్రమంలో రాయుడు 117 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్‌తో సెంచరీ చేశాడు. వన్డేల్లో రాయుడికిది రెండో సెంచరీ. రాయుడు, బిన్నీ ఆరో వికెట్‌కు 160 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. చివర్లో బిన్నీ వెనుదిరిగినా, రాయుడు అజేయంగా నిలిచి జట్టు స్కోరును 250 మార్క్ దాటించాడు.