ఐటీ కుబేరుల్లోని భారతీయులు వీరే!
ప్రపంచ కుబేరుల జాబితాను ఫోర్బ్స్ శనివారం విడుదల చేసింది. గత కొద్ది సంవత్సరాల నుంచి మొదటి స్థానంలో ఉంటున్న మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తిరిగి తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఫోర్బ్స్ జాబితాలో టాప్ తొమ్మిది భారతీయ ఐటీ బిలియనీర్లు వీళ్లే..
1. అజీమ్ ప్రేమ్ జీ
ఆస్తులు: 15 బిలియన్ డాలర్లు
ప్రపంచ ర్యాంకు: 55
విప్రో కంపెనీ స్థాపించిన ప్రేమ్ జీ భారతదేశంలో మూడో అతిపెద్ద సాఫ్ట్ వేర్ దిగ్గజంగా ఎదిగారు. అంతేకాకుండా స్నాప్ డీల్, మింత్రా, పాలసీ బజార్, సీయానోజెన్ వంటి కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టారు.
2. శివ్ నాడార్
ఆస్తులు:11.1 బిలియన్ డాలర్లు
ప్రపంచ ర్యాంకు: 88
హెచ్ సీఎల్ సంస్థను స్థాపించిన శివ్ నాడార్ భారత సాఫ్ట్ వేర్ దిగ్గజాల్లో నాలుగో స్థానంలో ఉన్నారు. శివ నాడార్ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సాయం చేస్తున్నారు.
3. నారాయణ మూర్తి
ఆస్తులు: 1.9 బిలియన్ డాలర్లు
ప్రపంచర్యాంకు:959
ఇన్ఫోసిస్ కంపెనీ సహవ్యవస్థాపకుడిగా ఉన్న నారాయణ మూర్తి భారత సాఫ్ట్ వేర్ కంపెనీల్లో రెండో పెద్ద కంపెనీగా ఇన్ఫీని నిలిపారు. 1981 నుంచి 2002 వరకు సీఈవోగా 2002 నుంచి 2011 వరకు చైర్మన్ గా పనిచేశారు. కాటమారన్ పేరుతో ప్రారంభించిన ప్రైవేట్ ఇన్వెస్ట్ మెంట్ వెంచర్ తో ఏభీ, హెక్టార్ బేవరేజెస్, ఇన్నోవిటీ, కవర్ ఫాక్స్ లలో పెట్టుబడులు పెట్టారు. అమెజాన్ ఇండియాలో అతిపెద్ద అమ్మకం దారుగా ఉన్న క్లౌడ్ టెయిల్ కూడా నారాయణస్వామిదే.
4. క్రిస్ గోపాలక్రిష్ణన్
ఆస్తులు: 1.6 బిలియన్ డాలర్లు
ప్రపంచర్యాంకు:1121
ఇన్ఫోసిస్ లో సహవ్యవస్థాపకుడిగా ఉన్న క్రిస్ 2007 నుంచి 2011 వరకు సంస్థ సీఈవో గా పనిచేశారు. బెంగళూరులో రూ.225 కోట్లతో సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్ ని నిర్మించారు.
5. నందన్ నిలేకని
ఆస్తులు: 1.6 బిలియన్ డాలర్లు
ప్రపంచ ర్యాంకు:1121
ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడిగా ఉన్న నందన్ 2002 నుంచి 2007 వరకు సీఈవో గా పనిచేశారు. కంపెనీ చేపట్టిన యూఐఎఐ కు 2014 వరకు చైర్మన్ గా ఉన్నారు. ప్రస్తుతం ఏక్ స్టెప్ చైర్మన్ గా సేవలందిస్తున్నారు. టీమ్ ఇండస్, ఫోర్టిగో, మబుల్, జగ్గర్ నాట్, లెట్స్ వెంచర్, పవర్ 2 ఎస్ఎమ్ఈ, సిస్టం యాంటిక్స్ తదితర కంపెనీలకు వెన్నుదన్నుగా నిలిచారు.
6. బిన్నీ బన్సల్
ఆస్తులు: 1.2 బిలియన్ డాలర్లు
ప్రపంచ ర్యాంకు:1476
భారతదేశపు అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ను స్థాపించిన వారిలో బిన్నీ బన్సల్ కూడా ఒకరు. 2016 జనవరిలో ఆయన సంస్థ సీఈవో గా పగ్గాలు చేపట్టారు.
7. సచిన్ బన్సల్
ఆస్తులు: 1.2 బిలియన్ డాలర్లు
ప్రపంచ ర్యాంకు: 1476
సచిన్ బన్సల్ ఫ్లిప్ కార్ట్ ను స్థాపించిన సహవ్యవస్థాపకుల్లో ఈయన కూడా ఒకరు. 2016 జనవరి వరకు కంపెనీ సీఈవో గా పనిచేశారు. అథర్ ఎనర్జీ, ఇన్ షార్ట్స్, ట్రాక్సన్, టినీస్టెప్ తదితర కంపెనీలను ప్రోత్సహించారు.
8. కే దినేశ్
ఆస్తులు: 1.2 బిలియన్ డాలర్లు
ప్రపంచ ర్యాంకు:1476
ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడిగా ఉన్న దినేశ్ 1981 నుంచి 2011 వరకు బోర్డు మెంబర్లలో ఒకరిగా పనిచేశారు. 2011లో డిజైన్ గ్రూప్ నుంచి పదవీవిరమణ చేశారు.
9. ఎస్ డీ షీబూలాల్
ఆస్తులు: 1.1 బిలియన్ డాలర్లు
ప్రపంచర్యాంకు: 1577
ఇన్ఫోసిస్ సహవ్యవస్థపకులైన ఎస్ డీ షిబూలాల్ 2011 నుంచి 2014 వరకు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు. యాక్సిలర్ వెంచర్స్ పేరుతో క్రిస్ గోపాలన్ తో ఇంక్యూబేటర్ సెంటర్ ను ప్రారంభించారు.