సైబర్ నేరాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌దే అగ్రస్థానం
దేశంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశం మొత్తమ్మీద చూసుకున్నా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో అన్ని రాష్ట్రాల కంటే అగ్రస్థానంలో ఉంది. దాని తర్వాత వరుసగా కర్ణాటక, మహారాష్ట్ర నిలిచాయి. ఈ మూడు రాష్ట్రాల నుంచి వచ్చే ఐటీ ఆదాయం దేశం మొత్తమ్మీద వచ్చే ఐటీ ఆదాయంలో 70 శాతం ఉండటం ఇందులో మరో విశేషం.
నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో అందించిన గణాంకాల ప్రకారం.. 2012తో పోలిస్తే, 2013లో 51 శాతం వరకు సైబర్ నేరాలు పెరిగాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 48 శాతం, మహారాష్ట్రలో 44.6 శాతం, కర్ణాటకలో 24.5 శాతం పెరుగుదల ఉంది. ఈ మూడు రాష్ట్రాల తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలిచింది. ఇక్కడైతే ఏకంగా గత ఏడాది కాలంలో 81.5 శాతం సైబర్ నేరాలు పెరిగాయి. 349 కేసులతో కేరళ ఐదో స్థానంలో ఉంది.