న్యాయాధికారులను తొలగించిన గవర్నర్
ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ ఆర్.పి.రజ్ఖోవా ఇద్దరు న్యాయాధికారులను తొలగించారు. ఆ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ రాంజీ థామస్, అదనపు అడ్వకేట్ జనరల్ ఆర్ హెచ్.నబంను విధుల నుంచి తప్పించారు.
రాష్ట్రంలో పలు అంశాలకు సంబంధించి సీజ్ చేసిన పత్రాలను ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన అనంతరం ఈ ఇద్దరు అధికారులను గవర్నర్ విధుల నుంచి తప్పించడం గమనార్హం.