నెత్తురొడుతున్న రోడ్లు
ముంబై సెంట్రల్, న్యూస్‌లైన్ : మహారాష్ట్ర రాజధాని ముంబై రోడ్డు ప్రమాదాల సంఖ్యలో అగ్ర స్థానంలో ఉంది. 2013 సంవత్సరంలో నగరంలో అత్యధికంగా 8,238 మంది వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందారు. ముంబై జనాభాను బట్టి లక్ష మందిలో 45 మంది వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని వెల్లడైంది. దేశంలోని ఇతర మహానగరాలతో పోలిస్తే ఈ సంఖ్య అత్యధికంగా ఉంది. 2012 సంవత్సరంతో పోలీస్తే గత సంవత్సరం మృతుల సంఖ్య 575కు పెరిగినట్లు ‘ఎన్సీఆర్బీ’ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
లక్షమందిలో 45 మంది మృతి
2011లో జరిగిన జనగణన ప్రకారంగా ముంబైలో కోటి 84 లక్షల మంది నివసిస్తున్నారు. ఈ సంఖ్య దేశ జనాభాతో పోలిస్తే 11.4 శాతం. ప్రతి లక్ష జనాభాలో 45 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నా రు. చెన్నైలో లక్ష మందిలో 44 మంది చనిపోతున్న ట్లు తెలిసింది. చెన్నై తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో సుమారు 41 మంది ప్రమాదాలకు బలవుతున్నా రు. అతితక్కువగా కోలకత్తాలో మృత్యువాతపడుతున్నారు. ఈ నగరంలో లక్ష మందిలో కేవలం ఆరుగురు మరణిస్తున్నారు.
అన్ని పట్టణాలతో పోలిస్తే కేవలం ముంబైలో మాత్రమే మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. 2013లో ముం బైలో చనిపోయిన వారిలో 13.4 శాతం రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. దేశంలోని 53 మహా నగరాల్లో రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న సంఖ్య లో ముంబై అగ్ర స్థానం లో ఉంది. రాష్ట్రంలో 2013 లో మొత్తం 62,770 మంది ప్రమాదాల్లో చనిపోయారు. ప్రధాన నగరాలు పుణేలో 4,141, అహమ్మద్‌నగర్‌లో 1,665, ఔరంగాబాద్‌లో 761, నాసిక్‌లో 1,070 మంది మృత్యువాతపడ్డారు.
ముంబైలో 2013లో ప్రమాదాల్లో చనిపోయిన వారి సంఖ్య 7.5 శాతానికి పెరిగింది. 2012లో 7,663 మంది చనిపోయారు. వారిలో ఎక్కువ శాతం 45 నుంచి 49 సంవత్సరాల వయస్సు గల వారున్నారని సర్వేలో తేలింది.