Topless
-
రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ.. ఏకంగా టాప్‌లెస్‌తో!
బిగ్ బాస్ బ్యూటీ సోనాలి రౌత్ బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ది ఎక్స్పోజ్తో 2014లో సినిమాల్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్- 8లో పాల్గొంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తోంది. ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ టచ్‌లో ఉంటోంది. ప్రస్తుతం సోనాలి షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఎప్పుడు బోల్డ్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న బ్యూటీ ఈ సారి టాప్ లెస్తో ఉన్న వీడియోను పంచుకుంది. అంతే కాకుండా వీడియోకు క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఐ యామ్ ఫీలింగ్ గుడ్ అంటూ పోస్ట్ చేసింది. అయితే ఈ వీడియో చూసిన ఆమె అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సోనాలి రౌత్ అభిమానులు ఈ వీడియోను ఇష్టపడుతున్నారు మరియు నటిని ప్రశంసిస్తున్నారు. ఓ అభిమాని జార్జియస్ బ్యూటీ అని కామెంట్ చేయగా.. మరొకరు ' అద్భుతమైన మచ్చలేని అందాల రాణి అంటూ పోస్ట్ చేశారు. సోనాలి రౌత్ పెద్దగా సినిమాల్లో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియా స్టార్‌గా గుర్తింపును దక్కించుకుంది. View this post on Instagram A post shared by Sonali Raut (@isonaliraut) -
ఆమె పోరాడింది.. టాప్‌లెస్ సమానత్వం సాధించింది
జర్మనీ రాజధాని నగరం బెర్లిన్‌లోని బహిరంగ ప్రదేశాల్లోని స్విమ్మింగ్ పూల్స్‌లో ఇకపై ఆడామగా తేడా లేకుండా టాప్‌లెస్‌గా ఈత కొట్టొచ్చు. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేశారు అధికారులు. దీనికి ఓ మహిళ చేసిన పోరాటమే కారణం. తాజాగా నగరంలోని ఓ స్విమ్మింగ్ పూల్ వద్ద టాప్‌లెస్‌గా సన్‌బాత్ చేసింది ఒకావిడ. అది గమనించిన నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆమెను బలవంతంగా బయటకు పంపించేశారు. దీంతో ఆమె సెనేట్ ఆంబుడ్స్పర్సన్ ఆఫీస్‌ను సంప్రదించింది. మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లను చూడాలని.. టాప్‌లెస్‌గా ఈతకు అనుమతించాలని పోరాటానికి దిగింది. ఆమె డిమాండ్‌కు అధికారులు దిగొచ్చారు. వివక్షకు పుల్‌స్టాప్ పెడుతున్నట్లు బెర్లిన్ అధికారులు ప్రకటించారు. బెర్లిన్‌లో స్మిమ్మింగ్ పూల్స్ నిర్వాహణ చూసుకునే బెర్లినర్ బేడర్బెట్రీబే.. తమ నిబంధనలను సవరిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశాయి. అయితే ఆ మహిళ వివరాలను మాత్రం బయటకు వెల్లడించలేదు. జర్మనీ సాధారణంగా న్యూడిటీ విషయంలో పెద్దగా పట్టింపులు లేని దేశం. కాకపోతే పూర్తి నగ్నత్వాన్ని మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ప్రోత్సహించదు. -
టాప్‌లెస్‌గా నటించడానికి సై
సినీ పరిశ్రమలో అద్భుత నటన ప్రదర్శించినప్పటికీ మార్కెట్ డల్ కావడంతో ఇలియానా, రాధికా ఆప్టే, విద్యాబాలన్ వంటి భామలు అందాలను ఆరబోసి మార్కెట్‌ను తిరిగి పొందగలిగారు. వారిలో ముఖ్యంగా రాధికా ఆప్టే ‘పార్సెట్’ వంటి కొన్ని చిత్రాలలో టాప్‌లెస్‌గా నటించి కలకలం రేపుతోంది. ఈ విధంగా నటించడానికి కోలీవుడ్ నటీమణుల్లో ఎవరికైనా ధైర్యం ఉందా అని పరిశీలిస్తే నేనున్నానంటూ ఇప్పటి వరకు ఎవరూ ముందుకు రాలేదు. ఇన్నాళ్లకు ఓ బ్యూటీ విచ్చలవిడిగా అందాల ఆరాబోతకు, టాప్‌లెస్‌గా నటించడానికి సై అంటూ ముందుకు వచ్చింది. తమిళంలో వర్ణజాలం నుంచి ఇప్పటి వరకు సుమారు 50 చిత్రాల్లో నటించింది సుజా వరూణి. వీటిలో చాలా వరకు అతిథి పాత్రలు, ఐటమ్ సాంగ్సే అధికం. దీంతో విరక్తి చెందిన సుజా ఇకపై ఐటమ్ సాంగ్స్‌కు చిందులు వేయబోనని ఖరాఖండిగా తేల్చి చెప్పేసింది. ఈ విషయం గురించి అమ్మడు మాట్లాడుతూ.. తన కోసం వచ్చే దర్శకుల వద్ద ఓపెన్ హార్ట్‌గా కథలు వింటానన్నారు. చిన్న పాత్రే అయినప్పటికీ ప్రాధాన్యత ఉంటేనే అంగీకరిస్తానని తెలిపారు. అధికంగా రెమ్యునరేషన్ ఇస్తానని తెలిపినప్పటికీ ప్రాధాన్యత లేని పాత్రల్లో నటించనని చెప్పారు. విద్యాబాలన్, కంగనా రనౌత్, రాధికా ఆప్టే వంటి తారలు నటించే హీరోయిన్ ఓరియంటెట్ చిత్రాల్లో నటించాలని ఉందని తెలిపింది. కథ ప్రాముఖ్యతను బట్టి టాప్‌లెస్‌గా కూడా నటించడానికి తాను సిద్ధమని, అంతటి ధైర్యం తనకు ఉందని తెలిపింది. అదే సమయంలో అనవసరమైన సన్నివేశాల కోసం అందాలను ఆరబోయనని తేల్చి చెప్పగలిగే ధైర్యం కూడా తనకు ఉందని తెలిపింది. ఇరవుక్కు ఆయిరం కన్గల్, శత్రు, ఆన్దేవదై వంటి చిత్రాలలో నటిస్తున్నట్టు సుజా వరూణి వెల్లడించింది. -
కరెన్సీ కష్టాలపై యువతి నగ్నంగా నిరసన
-
మహిళనైతే దాచుకోవాలా?
స్వీడన్‌లోని ఓ పాఠశాల విద్యార్థిని తన మహిళావాదాన్ని వినూత్నంగా చాటుకుంది. తన తోటి విద్యార్థులతో కలిసి దిగిన ఫోటోలో టాప్‌లెస్‌గా కనిపించింది. ఆ ఫోటో కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. స్వీడన్ దక్షిణ ప్రాంతంలోని వాగ్జో పట్టణంలో హై స్కూల్ విద్యార్థిని హన్నా బొలాండర్(19) ఇటీవల తన తరగతిలోని మిగతా విద్యార్థులతో కలిసి ఫోటోలకు పోజిచ్చింది. అయితే అందరిలా కాకుండా తాను మహిళనైనంత మాత్రాన శరీరాన్నంతా కప్పిఉంచుకోవాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నిస్తూ.. టాప్‌లెస్‌గా పోజిచ్చింది. దీనిపై హన్నా మాట్లాడుతూ.. పురుషులు తమ శరీరాన్ని వీలైనంత వరకు బయటకు కనిపించేలా చూపిస్తున్నప్పుడు మహిళలు మాత్రం దాచుకోవాల్సిన అవసరం ఏముంది. ఇది కూడా లింగ వివక్షతే. స్త్రీ, పురుష సమానత్వంపై అవగాహన కలిగించేందుకే ఈ చర్యకు పూనుకున్నాను' అంటూ వివరించింది. సోషల్ మీడియాలో కొందరు మహిళావాదులు వివక్షపై హన్నా చేస్తున్న వాదనలో నిజం ఉందని వాదిస్తుంటే మరికొందరు మాత్రం ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తన తల్లిదండ్రులు ఈ విషయం గూర్చి తెలుసుకొని మొదట కొంత షాక్‌కు గురైనా తరువాత తనను సపోర్ట్ చేశారని చెబుతోంది హన్నా... -
మహిళా పోలీసు టాప్‌లెస్ సెల్ఫీ
ఓ మహిళా పోలీసు అధికారి టాప్ లెస్ గా దిగిన ఫోటో ఆమె ఉద్యోగానికే ఎసరు తెచ్చింది. మెక్సికోలోని ఎస్కోబెడోలో పెట్రోలింగ్ చేస్తున్న కారులో నిదియా గార్సియా ఆనే మహిళ పోలీసు టాప్ లెస్ సెల్ఫీ తీసుకుంది. తన యూనిఫాం ను కిందికు దించి రొమ్ము భాగం కనబడేలా సెల్ఫీ దిగింది. అంతేకాకుండా ఆ ఫోటోను తన ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. దీంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. యూనిఫాంలో ఉండటమే కాకుండా ఆయుధాలను కూడా పక్కనే ఉంచి ఇలా చేసినందుకు అధికారులు అమెను సస్పెండ్ చేశారు. అంతే కాకుండా నిదియా సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న ఇతర సిబ్బంది కూడా పక్కనే ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తుకు ఆదేశించారు. అలా చేసినందుకు తనను తానే అసహ్యించుకుంటున్నానని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన నిదియా తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. తన ఇద్దరు కూతుళ్లు, భర్త, తల్లిదండ్రులు, సోదరులకు చెడ్డ పేరు తీసుకు వచ్చానని వాపోయింది. -
ఆ స్వేచ్ఛ ఎందుకు లేదు?
న్యూయార్క్: అన్నింటా మగవాళ్లతో సమాన హక్కులు కోరుతున్న మహిళలు ఆదివారం నాడు చిత్రమైన డిమాండ్‌తో ముందుకొచ్చారు. నెక్కరు తప్ప బొడ్డు పైభాగం నుంచి తల వరకు ఎలాంటి అచ్చాదన లేకుండా మగవాడు వీధుల్లో తిరుగుతున్నప్పుడు తాము మాత్రం ‘నిపుల్స్ ఫ్రీ’గా ఎలాంటి అచ్చాదన లేకుండా ఎందుకు తిరగకూడదని సవాల్ చేశారు. చేయడమే కాదు, బొడ్డు పైభాగం నుంచి తల వరకు ఎలాంటి ఆహార్యం లేకుండా వీధుల్లోకి వచ్చి ప్రదర్శన జరిపారు. పలు వీధులు తిరుగుతూ తమ కొత్త హక్కుల గురించి ఉపన్యాసాలు ఇచ్చారు. ఇందులో పిల్లల నుంచి బామ్మల వరకు పాల్గొనగా, పురుషులు కూడా వారికి మద్దతుగా నెక్కరు తప్ప ఏమీ లేకుండా వారి వెంట వీధుల్లో నడిచారు. ‘మీ స్వేచ్ఛకు మేము అడ్డు కాదు’ అంటూ నినాదాలు కూడా ఇచ్చారు. ఇలాంటి ప్రదర్శనలు ఒక్క అమెరికా నగరాల్లో కాకుండా ప్రపంచవ్యాప్తంగా 60 నగరాల్లో జరిగాయి. న్యూయార్క్ సిటీలో మాత్రం మరింత ఆకర్షణగా జరిగాయి. ఎక్కడ తిరిగినా ఫర్వాలేదుగానీ ‘టైమ్ స్క్వేర్’కు మాత్రం రావద్దంటూ స్థానిక మేయర్ ఇచ్చిన ఉత్తర్వులను కూడా ధిక్కరించారు. 1992 నుంచే ‘టాప్‌లెస్’గా న్యూయార్క్ నగరంలో మహిళలు తిరిగేందుకు స్వేచ్ఛ ఉంది. అయితే ఇప్పుడు ఓ ఉద్యమంగా నిర్వహించడం మాత్రం తమకు నచ్చలేదని న్యూయార్క్ మేయర్ బిల్ దే బాసియో, పోలీసు కమిషనర్ బిల్ బ్రాటన్ వ్యాఖ్యానించారు. ఈ టాప్‌లెస్ మహిళలు ఆఖరికి వాషింఘ్టన్ డీసీలో దేశాధ్యక్ష భవనాన్ని కూడా వదిలిపెట్టారు. అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఉన్న కారణంగా భావప్రకటనా స్వేచ్ఛ కింద మచ్చుకు లిబర్టీ విగ్రహంలా టాప్‌లెస్‌గా నిలబడి ఫొటోలకు ఫోజిచ్చారు. అంతర్జాతీయ మహిళల సమానత్వం 95వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ‘టాప్‌లెస్’ నిరసనకు హాలీవుడ్ తార, మోడల్ రాచెల్ జెస్సీ పిలుపునిచ్చారు. ‘గో టాప్‌లెస్’, ‘నిపుల్ ఫ్రీ’ పేరిట ఆమె ఇచ్చిన పిలుపుకు ప్రపంచంలోని 60 నగరాల్లో మహిళలు స్పందించారు. కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. న్యూయార్క్ సిటీతోపాటు మన్‌హట్టన్, ఎడెన్‌బర్గ్ లాంటి అమెరికా నగరాల్లోనే ఎక్కువ స్పందన లభించింది. ప్రపంచవ్యాప్తంగా మగవాళ్లతోపాటు తమకు టాప్‌లెస్ హక్కులు ఉండాలని రాచెల్ జెస్సీ డిమాండ్ చేశారు. మగవాళ్లతో పోలిస్తే తాము అన్ని రంగాల్లో అణచివేతకు గురవుతున్నామని, మొదట తాము తమ శరీర భాగాలకు స్వేచ్ఛను కలిగించాలని కోరుకుంటున్నామని, అలా చేయడం వల్ల మెదడు కూడా స్వేచ్ఛగా ఫీలవుతుందని ఆమె అన్నారు. -
నగ్నంగా ఫోజిచ్చిన డేవిడ్ బెక్ హమ్!
లాస్ ఎంజెలెస్: 'టాప్ లెస్' మహిళా మోడల్స్, సినీ తారలతో మాజీ పుట్ బాల్ స్టార్ డేవిడ్ బెక్ హమ్ పోటికి దిగారు. నగ్నంగా ఫోటో షూట్ లతో సంచలనం రేపుతున్న మోడల్స్, సినీ తారలకు ధీటుగా ఫుట్ బాల్ క్రీడాకారుడు డేవిడ్ బెక్ హమ్ ఇటీవల నగ్నంగా ఫోటో షూట్ చేయడం సంచలనం రేపుతోంది. అమెరికాలోని హల్లో మ్యాగజైన్ ప్రచారం కోసం ఒంటి నిండా టాటూలను పొడిపించుకుని ఫోటోషూట్ లో పాల్గొన్నారు. లోదుస్తుల ప్రచారం కోసం హెచ్ ఎం చేపట్టిన పోటోషూట్ లో ఎనర్జీ ఉందని బెక్ హమ్ వ్యాఖ్యానించారు. హెచ్ ఫోటో షూట్ ను తాను ఎంజాయ్ చేశానని.. ప్రజలకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాని బెక్ అన్నారు.Follow @sakshinews