గ్యాస్ సిలిండర్ పేలి మూడు పూరిళ్లు దగ్ధం
మహిళకు గాయాలు
రూ.5లక్షల ఆస్తి నష్టం
రేగొండ : గ్యాస్ సిలిండర్ పేలి మూడు పూరిళ్లు దగ్ధమైన సంఘటన మండలంలోని మడ్తపల్లి గ్రామంలో శనివారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెం దిన కొయ్యడ బిక్షపతి ఇంట్లో శనివారం ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి మంటలు లేచాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న వృద్ధురాలు కొయ్యడ నర్సమ్మకు మంటలం టుకొని గాయపడింది.
అలాగే పక్కనే ఉన్న కొయ్యడ గట్టయ్య, కొయ్యడ నర్సయ్య పూరిళ్లు కూడా అంటుకొని పూర్తిగా దగ్ధమయ్యాయి. మూడు ఇళ్లలో విలువైన సామ గ్రి, వస్తువులు దగ్ధమయ్యాయని బాధితులు ఆవేదన వ్య క్తం చేశారు. సుమారు రూ.5 లక్షల వరకు ఆస్తి నష్టం వా టిల్లిందని వాపోయారు. కాగా బాధితుల ఫిర్యాదు మేర కు రెవెన్యూ అధికారులు, పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి పంచనామ నిర్వహించారు. బాధిత కుటుం బాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.