tornadoe
-
స్టన్నింగ్ టోర్నడో: వీడియో వైరల్
భోపాల్:ఒకవైపు దేశంలోని పలుప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో కూడా బలమైన గాలులు, వర్షాలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. అయితే సిధి జిల్లాలోని భూమాద్, దేవ్రిడ్యామ్వద్ద అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. డ్యామ్‌లోని నీళ్లు ఒక్కసారిగా పైకి పొంగి,ఆకాశానికి సుడులు తిరుగుతూ ఎగిసింది. భీకరమైన గాలులు సుడులు తిరుగుతూ టోర్నడోగా మారి ఆకాశాన్ని తాకినంత పనిచేసింది. ఈ టోర్నడో పరిసర ప్రాంతాల ప్రజలను దిగ్ర్భాంతికి గురిచేసింది. రాష్ట్ర రాజధాని భోపాల్‌కు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధి జిల్లాలోని దేవ్రి డ్యామ్ వద్ద సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. దీన్ని చూసేందుకు స్థానికులు ఆ ప్రాంతానికి ఎగబడ్డారు. ఇపుడు ఈ వీడియో వైరల్ అయింది. చదవండి : స్వీట్ అడలిన్ అద్భుత ఫోటో షూట్..విషయం తెలిస్తే కన్నీళ్లే! హర్ష్ గోయెంకా ఫన్నీ వీడియో, లక్కీ ఫెలో అంటున్న నెటిజన్లు Fascinating! Waterspouts were seen on Devri dam in Seedhi district Water from the Dam was raised up in the sky videos were shot by the locals @ndtv @ndtvindia pic.twitter.com/UHXnmOiQPA — Anurag Dwary (@Anurag_Dwary) September 1, 2021 -
అమెరికాను కుదిపేస్తున్న టోర్నడో
డాలస్: బలమైన గాలులు, వరదలతో అమెరికా దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. టెక్సాస్, మిస్సిసిపి, లూసియానా, అర్కాన్సాస్ రాష్ట్రాల్లో భారీ వర్షంతోపాటు బలమైన టోర్నడోలు ఏర్పడటంతో భారీ సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలడంతో పలు ప్రాంతాల్లో లక్షలాది ఇళ్లు అంధకారంలో చిక్కుకున్నాయి. టెక్సాస్ రాష్ట్రం లుఫ్కిన్ పట్టణంలో ప్రయాణిస్తున్న కారుపై చెట్టు కూలడంతో అందులో ఉన్న ఇద్దరు చిన్నారులు(3, 8 ఏళ్లు) మృతి చెందారు. ముందు సీట్లో కూర్చున్న వారి తల్లిదండ్రులు సురక్షితంగా బయటపడ్డారు. టెక్సాస్ సమీపంలోని ఫ్రాంక్లిన్ నగరంలో టోర్నడోల తాకిడికి పలు నివాసాలు ధ్వంసం కాగా ఇద్దరు గాయాలపాలయ్యారు. మగ్నోలియా రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది. స్కార్క్విల్లే లోని మిస్సిసిపి స్టేట్ యూనివర్సిటీకి చెందిన 21వేల మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. టోర్నడోలు ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. -
టోర్నడో ధాటికి అమెరికాలో 9 మంది మృతి
అమెరికాలో టోర్నడో విరుచుకుపడటంతో తొమ్మిది మంది మరణించారు. ఒక్క ఆర్కాన్సాస్ రాష్ట్రంలోనే 8 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ మైక్ బీబ్ ప్రతినిధి మాట్ డీకాంపిల్ తెలిపారు. ఓక్లహామాలో కూడా టోర్నడో రావడంతో ఒక వ్యక్తి మరణించారు. ఆర్కాన్సాస్‌లోని లిటిల్ రాక్ ప్రాంతంలో వచ్చిన టోర్నడో చాలాసేపు అక్కడే ఉండిపోయింది. తర్వాత ఈశాన్యంగా దాదాపు 48 కిలోమీటర్లు పయనించింది. దీని ప్రభావంతో భవనాలు, వాహనాలు బాగా దారుణంగా దెబ్బతిన్నాయి. నెబ్రాస్కా, లోవా, మిస్సోరి ప్రాంతాలను కూడా టోర్నడో తాకింది. పశ్చిమాన న్యూ మెక్సికో, తూర్పున టెన్నెస్సీ లాంటి రాష్ట్రాలపై దీని ప్రభావం అంతగా ఉండబోదని అధికారులు అంటున్నారు. కాన్సాస్, మిస్సోరి, మిస్సిసిప్పి, నెబ్రస్కా, లోవా, టెక్సాస్, లూసియానా ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఓక్లహామాలో సుమారు 900 మంది వరకు ఉండే క్వాపా అనే ప్రాంతం దారుణంగా దెబ్బతిందని అక్కడి ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ డైరెక్టర్ జో డాన్ మోర్గాన్ తెలిపారు. టోర్నడో సంబంధిత గాయాలతో ఆరుగురికి తాము చికిత్స అందించినట్లు బాప్టిస్ట్ రీజనల్ హెల్త్ సెంటర్ తెలిపింది.