Toronto Film Festival
-
టొరంటో చిత్రోత్సవంలో జెర్సీ
నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా గతేడాది విడుదలైన చిత్రం ‘జెర్సీ’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన సంగతి తెలిసిందే. తెలుగులో పలు ప్రశంసలు దక్కించుకున్న ఈ చిత్రబృందం మరో తీపి కబురు అందుకుంది. ఈ ఏడాది ఆగస్టు 9 నుండి 15 వరకు జరిగే భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ‘జెర్సీ’ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ‘‘మన దేశ స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15న కెనడాలో మా చిత్రం ప్రదర్శితం కానుండటం ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాత నాగవంశీ. ఇదిలా ఉంటే ‘జెర్సీ’ హిందీలో రీమేక్ అవుతోంది. షాహిద్ కపూర్ హీరోగా ఈ రీమేక్‌ని గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్నారు. -
ఇండియా నుంచి ఈ ఇద్దరూ..
ప్రియాంకా చోప్రా గత ఏడాది సందడి చేసిన వేడుకల్లో టొరొంటో చలన చిత్రోత్సవాలు ఒకటి. ఆమె నటించిన ‘ది స్కై ఈజ్ పింక్’ ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. దాంతో ఈ వేడుకకు హాజరై, ఎర్ర తివాచీపై ‘క్యాట్ వాక్’ చేసి, కనువిందు చేశారు. ఈసారి ప్రియాంక ఈ చిత్రోత్సవాలకు ‘బ్రాండ్ అంబాసిడర్’. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకలకు 50 మంది సినీ ప్రముఖులు బ్రాండ్ అంబాసిడర్లుగా ఆహ్వానంగా అందుకున్నారు. భారతీయ చిత్రపరిశ్రమ నుంచి ప్రియాంకా చోప్రా, దర్శకుడు అనురాగ్ కశ్యప్‌లు బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక కావడం విశేషం. సెప్టెంబర్ 10 నుంచి 19 వరకూ... కరోనా వల్ల ఆస్కార్ అవార్డు వేడుక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌కి వాయిదా పడింది. మేలో ఫ్రాన్స్‌లో జరగాల్సిన కాన్స్ చలన చిత్రోత్సవాలు జరగలేదు. అయితే టొరొంటో చలన చిత్రోత్సవాలు మాత్రం ప్రతి ఏడాదిలానే సెప్టెంబర్‌లో 10 నుంచి 19 వరకూ జరగనున్నాయి. ఈ వేడుకలు డిజిటల్లో స్క్రీనింగ్ అవుతాయి. ‘‘ఇవి 45వ టొరొంటో చలన చిత్రోత్సవాలు. ఇన్నేళ్ల టొరొంటో ఫిల్మ్ ఫెస్టివల్ చరిత్రలో డిజిటల్లో ప్రసారం కాబోతున్న తొలి వేడుక ఇదే’’ అని చిత్రోత్సవాల ప్రతినిధులు పేర్కొన్నారు. వేడుకల్లో భాగంగా 50 చిత్రాలను థియేటర్లలో ప్రదర్శించాలనుకుంటున్నామని, సామాజిక దూరాన్ని పాటించే దిశగా సీట్ల ఏర్పాటు ఉంటుందని, అయితే ప్రభుత్వం అనుమతిస్తేనే ఇది సాధ్యపడుతుందని కూడా తెలిపారు. -
అలలై... రంగుల కలలై!
ప్రపంచం నలుమూలల నుంచి కెనాడాలోని ప్రముఖ నగరం టోరంటోలో రెక్కలు కట్టుకొని వాలిన ప్రేక్షకులు చిన్నబోయిన రోజు ఇది. కాదా మరి! సెప్టెంబర్ 6 - సెప్టెంబర్ 16 కు మధ్య ఎన్నెన్ని గొప్ప సినిమాలు చూశారు! ఇక రేపు అవార్ట్ల హడావిడి తప్ప సినిమాలేవీ! 72 దేశాల నుంచి వచ్చిన 372 చిత్రాలను ఈ టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. అవి సినిమాలు మాత్రమే కాదు... రకరకాల భావోద్వేగాలతో ప్రపంచాన్ని ఒకటి చేసిన వెండితెర మాధ్యమాలు. సినిమాలతో పాటు ప్రేక్షకు లకు లభించిన మరో బహుమతి... ఫెస్టివల్‌కు వచ్చిన 4000 మంది ప్రసిద్ధ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్. సినిమా ప్రదర్శన తరువాత... వారితో మాట్లాడడం అంటే... సినిమాకు సంబంధించి ఒకే సమయంలో పది నాణ్యమైన పుస్తకాలు చదివినట్లే. ఆ అదృష్టాన్ని చాలామంది వినియోగించుకొని ఆనందపడిపోయారు. ది బ్రైట్ డే, గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్, ఇష్క్‌జాదే, మిస్ లవ్లీ, ముంబాయిస్ కింగ్స్... మొదలైన మన దేశానికి సంబంధించిన చిత్రాలను ఈ ఫెస్టివల్లో ప్రదర్శించారు. డేవిడ్ ఒ. రసెల్ ‘సిల్వర్ లైనింగ్స్ ప్లేబుక్’ ‘పీపుల్స్ ఛాయిస్ అవార్డ్’ అందుకుంది.