Torturer
-
Noor Inayat Khan: స్పై ప్రిన్సెస్
కలం పట్టి కవితలు రాసిన అమ్మాయి రణక్షేత్రంలోకి అడుగుపెట్టింది. పియానోతో సుస్వరాలు వినిపించిన అమ్మాయి ఫిరంగి ధ్వనులు వినిపించే చోట పనిచేసింది. నూర్ ఇనాయత్‌ఖాన్ అనేది నామం కాదు నాజీలను వణికించిన శబ్దం. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్–ఇండియా తొలి మహిళా గూఢచారి నూర్ గురించి... నూర్ ఇనాయత్ ఖాన్ అనే పేరు చాలామందికి తెలియకపోవచ్చు. ఆమె గురించి ఈ తరానికి తెలియజేయడానికి నాటక రూపంలో ఒక ప్రయత్నం జరుగుతోంది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటిష్ ఇండియా తరఫున నియామకం అయిన తొలి మహిళా గూఢచారి నూర్ ఇనాయత్ ఖాన్. ఆమె సాహసిక జీవితంపై రూపొందించిన ‘నూర్’ నాటకాన్ని ఈ నెలలో లండన్‌లోని సౌత్‌వార్క్ ప్లే హౌజ్‌లో ప్రదర్శించబోతున్నారు. ‘ఒక వ్యక్తి జీవితంలో ఇన్ని మలుపులు ఉంటాయా అని ఆశ్చర్యపోయేంత జీవితం ఆమెది’ అంటారు ‘నూర్’ నాటక రచయిత్రి అజ్మా దార్. నూర్ వ్యక్తిగత వివరాల విషయానికి వస్తే.... తండ్రి పేరు ఇనాయత్‌ఖాన్. బాంబే ప్రెసిడెన్సీలో జన్మించాడు. పూర్వీకులు టిప్పు సుల్తాన్ వంశస్థులు. ఇనాయత్‌ఖాన్ సూఫీ గురువు. సంగీతకారుడు. ‘ది సూఫీ ఆర్డర్ ఇన్ ది వెస్ట్’ అనే అంతర్జాతీయ సంస్థ ద్వారా సూఫీ భావజాలాన్ని పాశ్చాత్య సమాజానికి పరిచయం చేశాడు. నూర్ తల్లి అమెరికన్. రే బేకర్ అనే ఆమె పేరు పెళ్లి తరువాత అమీనా బేగంగా మారింది. చిన్న వయసులోనే రచయిత్రిగా తన కెరీర్ మొదలుపెట్టింది నూర్. ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషల్లో కవిత్వంతోబాటు, పిల్లల కథల పుస్తకాలను ప్రచురించింది. బుద్దిస్ట్ జాతక కథల స్ఫూర్తితో ‘ట్వంటీ జాతక టేల్స్’ అనే పుస్తకాన్ని రాసింది. పిల్లల పత్రికలకు రెగ్యులర్‌గా రచనలు చేస్తుండేది. ఫ్రెంచ్ రేడియో కోసం రచనలు చేసేది. ‘చైల్డ్ సైకాలజీ’ చదువుకున్న నూర్ సంగీతంలో ప్రావీణ్యం సంపాదించింది. పియానో అద్భుతంగా వాయించేది. రెండో ప్రపంచ యుద్ధం నాటి కల్లోల కాలం అది. ఎటు చూసినా భయం రాజ్యమేలుతున్న ఆ కాలంలో కుటుంబాన్ని తీసుకొని ఇంగ్లాండ్‌కు వెళ్లాడు ఇనాయత్‌ఖాన్. మొదట పోర్ట్ సిటీ సౌత్ హాంప్టన్లో ఒక తత్వవేత్త దగ్గర ఆశ్రయం పొందారు. తండ్రి చనిపోయే నాటికి నూర్ వయసు పదమూడు సంవత్సరాలు. సున్నిత స్వభావి. కొత్త వాళ్ల దగ్గరికి వెళ్లేది కాదు. చాలా తక్కువగా మాట్లాడేది. అలాంటి నూర్లో అనూహ్యంగా మార్పు వచ్చింది. తల్లి తరువాత ఇంటికి తానే పెద్ద. ఒకవిధంగా చెప్పాలంటే చిన్న వయసులోనే తన కుటుంబానికి పెద్ద అండగా నిలబడింది. కుమార్తెలో వచ్చిన మార్పు చూసి తల్లి ఆశ్చర్యపోయేది! నవంబర్, 1940లో ఉమెన్స్ ఆగ్జిలరీ ఎయిర్ ఫోర్స్ (డబ్ల్యూ ఎఎఎఫ్)లో చేరి వైర్లెస్ ఆపరేటర్‌గా శిక్షణ పొందింది. ఆ తరువాత ‘బాంబర్ ట్రైనింగ్ స్కూల్’లో చేరింది. సీక్రెట్ బ్రిటిష్ వరల్డ్ వార్–2 ఆర్గనైజేషన్ స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ (ఎస్వోయి)లో నియామకం అయింది. ప్రత్యేక శిక్షణ తీసుకొని నాజీ ఆక్రమిత ఫ్రాన్స్‌లో అండర్ కవర్ వైర్లెస్ ఆపరేటర్‌గా పనిచేసింది. ఈ విధులు నిర్వహించిన తొలి మహిళగా గుర్తింపు పొందింది. నాజీ ఆక్రమిత ఫ్రాన్స్‌లో వైర్లెస్ ఆపరేటర్‌గా పని చేయడం అంటే చావుకు చాలా సమీపానికి వెళ్లడం. ఒళ్లు జలదరించే ఎన్నో భయానక అనుభవాలు కళ్ల ముందున్నాయి. అయినా భయపడింది లేదు. దురదృష్టకరమైన పరిస్థితులలో నాజీలకు చిక్కి, కాన్సంట్రేషన్ క్యాంపుల్లో చిత్రహింసలకు గురై చనిపోయింది. ధైర్యసాహసాలకు ఇచ్చే జార్జ్ క్రాస్ పురస్కారాన్ని నూర్ మరణానంతరం బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. శాంతివచనాలు వినపడే ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి, రచయిత్రిగా గుర్తింపు పొందిన అమ్మాయి రణక్షేత్రంలో ఎందుకు పనిచేయాలనుకుంది? రెండో ప్రపంచయుద్ధకాలంలో గూఢచారిగా ఆమె పాత్ర, ప్రాధాన్యత ఏమిటి? ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంది? ఎన్ని కష్టాలు పడింది? ఏ పరిస్థితులలో నాజీలకు చిక్కింది? ఎంత దారుణమైన చిత్రహింసలకు గురైంది?... ఇలాంటి సందేహాలకు ‘స్పై ప్రిన్సెన్స్–ది లైఫ్ ఆఫ్ నూర్ ఇనాయత్ ఖాన్’లాంటి రచనలు సవివరంగా సమాధానాలు ఇచ్చాయి. ఈ క్రమంలో తాజా నాటకం ‘నూర్’ అనేది మరో ముందడుగుగా చెప్పుకోవచ్చు. శాంతివచనాలు వినపడే ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి, రచయిత్రిగా గుర్తింపు పొందిన అమ్మాయి రణక్షేత్రంలో ఎందుకు పనిచేయాలనుకుంది? రెండో ప్రపంచయుద్ధకాలంలో గూఢచారిగా ఆమె పాత్ర, ప్రాధాన్యత ఏమిటి? ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంది? ఎన్ని కష్టాలు పడింది? ఏ పరిస్థితులలో నాజీలకు చిక్కింది? ఎంత దారుణమైన చిత్రహింసలకు గురైంది? -
‘రాడ్లతో కొట్టారు.. మురికి నీరు తాగించారు’
న్యూఢిల్లీ: తమను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన దుండగులు.. రాడ్లతో కొట్టారని, మురికినీరు తాగించారని పాకిస్తాన్‌లోని ఇండియన్ ఎంబసీ ఉద్యోగులు ఇద్దరు తమ అనుభవాలను మీడియాకు వెల్లడించారు. సోమవారం ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. ఉదయం నుంచి కనిపించకుండా పోయి వీరు రాత్రికి ఎంబసీ సమీపంలోని పెట్రోల్ స్టేషన్ వద్ద పడి వున్నారు. ఈ క్రమంలో సదరు ఉద్యోగులు మాట్లాడుతూ.. ‘గుర్తుతెలియని దుండగులు 15-16 మంది మమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కళ్లకు గంతలు కట్టారు. ఎంబసీ నుంచి పది నిమిషాల పాటు ప్రయాణించిన తర్వాత ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ మమ్మల్ని తీవ్రంగా వేధింపులకు గురిచేశారు. రాడ్లు, కర్రలతో విపరీతంగా కొట్టారు. మురికినీరు తాగిపించారు. వారంతా ముఖాలకు మాస్కులు ధరించి ఉన్నారు. వాళ్ల చేతిలో నరకం అనుభవించాం. ఏదో అంశం గురించి ఒప్పుకోవాలంటూ మమ్మల్ని చితకబాదారు' అని తెలిపారు. ఉదయం 8.30 గంటలకు కనిపించకుండా పోయిన ఈ ఇద్దరు ఉద్యోగులు దాదాపు 12 గంటల తర్వాత ఎంబసీకి సమీపంలోని పెట్రోల్ స్టేషన్ వద్ద పడివుండగా గుర్తించి కార్యాలయానికి తీసుకొచ్చారు. వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా.. మెడ, ముఖం, తొడల మీద గాయాలున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రాణాలకు ప్రమాదం కలిగించే దెబ్బలు లేవన్నారు. (పాక్‌లో భారత అధికారులు మిస్సింగ్) అయితే దీని గురించి పాక్ మరోలా ప్రచారం చేస్తుంది. నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తిని ఎంబసీ అధికారులు తమ వాహనంతో ఢీకొట్టడంతో వారిని అరెస్ట్ చేసినట్లు పాకిస్తాన్ మీడియా పేర్కొన్నది. కాగా తమ సిబ్బందిని ఆక్సిడెంట్ చేసినట్లు ఒప్పుకోమని తీవ్రంగా కొట్టి వీడియోలు తీశారని ఇండియన్ ఎంబసీ అధికారులు తెలిపారు. తమ ఉద్యోగులు కనిపించకుండా పోయారని న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషనర్‌ను పిలిచి తీవ్రంగా నిరసన తెలిపారు. దాంతో పాకిస్తాన్ అధికారులు దీనిపై స్పందించి చర్యలు తీసుకొని వారిని విడిచిపెట్టేలా చేయడం గమనార్హం. ఆక్సిడెంట్ చేసిన కారులో పాకిస్తాన్‌కు చెందిన కొంత నగదు లభించిందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అయితే అవన్నీ నిరాధారమైన ఆరోపణలే అంటూ పాకిస్తాన్‌లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయం ఖండించింది. గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలతో గత నెల 31న ఇద్దర పాకిస్తాన్ ఎంబసీ ఉద్యోగులను దేశం విడిచి వెళ్లిపోవాలని భారత అధికారులు ఆదేశించింన సంగతి తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా పాక్ కుట్రపన్ని తమ ఇద్దరు సిబ్బందిని కిడ్నాప్ చేసినట్లు భారత విదేశాంగ శాఖ భావిస్తున్నది. -
కట్టుకున్నోడే కాలయముడు
నాంపల్లి (మునుగోడు): అవును ఆ తమ్ముడి అనుమానమే నిజమైంది. మూడేళ్లు అక్క ఆచూకీ కోసం ఆ సోదరుడు ఓ డిటెక్టివ్‌లా చేసిన పరిశోధన ఆఖరికి పోలీసుల సహకారంతో ఫలించింది. కట్టుకున్నోడే మూడేళ్లు చిత్రహింసలు పెట్టి.. ఆపై చిదిమేసి బావిలో పడవేసినట్టు ఆధారాలు లభ్యమయ్యాయి. నల్లగొండ జిల్లాలో సంచలనంగా మారిన ఓ హత్య కేసు మిస్టరీ తొమ్మిదేళ్ల అనంతరం వీడింది. వివరాల్లోకి వెళితే.. నార్కట్‌పల్లి మండలం మాండ్ర గ్రామానికి చెందిన జంగయ్యకు ప్రియాంక (26.. అదృశ్యమైన నాటి వయసు), ఉపేందర్ సంతానం. బతుకుదెరువు నిమిత్తం జంగయ్య భార్య, బిడ్డలతో కలసి 2006లో హైదరాబాద్‌లోని ఎల్బీనగర్కు వలస వెళ్లాడు. అక్కడే కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. ఈ క్రమంలో ప్రియాంకకు అక్కడే క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న మర్రిగూడ మండలం వెంకెపల్లి గ్రామానికి చెందిన మోరా హనుమంతు పరిచయమయ్యాడు. అది కాస్తా ప్రేమకు దారితీసింది. పెద్దలకు తెలియకుండా వివాహం హనుమంతు.. తన మాయమాటలతో ప్రియాంకను ప్రేమలోకి దింపి 2006లోనే వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి ప్రియాంకతో వారి కుటుంబ సభ్యులకు తెలియకుండా హైదరాబాద్‌లోనే మకాం పెట్టాడు. వీరి దాంపత్యానికి ఓ కుమారుడు, కుమార్తె జన్మించారు. కుమార్తె తనకు జన్మించలేదంటూ.. కొత్త జీవితం ప్రారంభించిన ప్రియాంక ఆనందం ఎంతో కాలం నిలవలేదు. అప్పటివరకు ఎంతో అన్యోన్యంగా సాగిన వారి కాపురంలో అనుమానం చిచ్చురేపింది. కుమార్తె తనకు జన్మించలేదంటూ హనుమంతు భార్యను చిత్రహింసలు పెట్టడం ప్రారంభించాడు. కుమార్తెను సాకలేనంటూ.. మరొకరికి ఇచ్చేద్దామని ఒత్తిడితెచ్చాడు. దీంతో అతడితో వేగలేకపోయిన ప్రియాంక అతడి ఒత్తిడికి తలొగ్గి కన్నపేగును హైదరాబాద్‌లోనే ఒకరికి దత్తత ఇచ్చేసింది. మూడేళ్లు నరకమే.. ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చిన ప్రియాంక జీవితం మూడేళ్ల పాటు నరకప్రాయంగానే సాగింది. భర్త ఎన్ని చిత్రహింసలు పెట్టినా కుమారుడి కోసం బతుకు బండిని సాగించింది. అయినా, అతడిలో మానవత్వం లేకుండా పోయింది. గ్రామంలో వ్యవసాయ పనులు చూసుకుంటున్నానని చెబుతూ పెద్దలు కుదిర్చిన మరో యువతితో వివాహం చేసుకుని రెండు నావలపై ప్రయాణం సాగించాడు. ప్రియాంక బాగోగులు చూడకుండా స్వగ్రామంలో ఎక్కువ కాలం గడుపుతుండేవాడు. దీంతో ప్రియాంక నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీనిని హనుమంతు తట్టుకోలేకపోయాడు. పథకం ప్రకారం.. ప్రియాంక తన సంతోషానికి అడ్డు తగులుతోందని, ఆమెను ఎలాగైనా అంతమొందించాలని హనుమంతు నిర్ణయించుకున్నాడు. అదను కోసం వేచి చూడటం ప్రారంభించాడు. 2009 చివరలో హనుమంతు రెండోభార్య, అతడి తల్లిదండ్రులు ఓ శుభకార్యం కోసం ఊరెళ్లారు. ఇదే అదనుగా భావించిన హనుమంతు, ప్రియాంక వద్దకు వచ్చి మాయమాటలు చెప్పాడు. వ్యవసాయ పనులు చక్కబెట్టొద్దామంటూ కారులో మర్రిగూడ మండలం వెంకెపల్లికి తీసుకొచ్చాడు. అదే రోజు రాత్రి ఆమెతో గొడవపడి ప్లాస్టిక్ వైరుతో గొంతునులిమి అంతమొందించాడు. ఆపై గోనెసంచిలో మూటకట్టి కారు డిక్కీలో వేసుకుని, రాంరెడ్డిపల్లి శివారుకు తీసుకెళ్లి ఓ పడావుబావిలో పడవేశాడు. అనంతరం ప్రియాంకకు పుట్టిన కుమారుడిని కొండమల్లేపల్లికి చెందిన తన సమీప బంధువుకు ఇచ్చేసి అప్పటినుంచి రెండోభార్య, పిల్లలతో దర్జాగా జీవనం సాగిస్తున్నాడు. ఫేస్బుక్ ఆధారంగా.. 2006 నుంచి కానరాకుండా పోయిన సోదరి ప్రియాంక కోసం ఉపేందర్ అన్వేషణ ప్రారంభించాడు. 2016లో ప్రియాంక, హనుమంతు, ఓ బాలుడితో దిగిన ఫొటో ఫేస్బుక్లో కనిపించడంతో పరిశోధన ప్రారంభించాడు. ఎట్టకేలకు తన సోదరితో ఉన్న వ్యక్తి మోరా హనుమంతుగా తెలుసుకుని వివరాలు సేకరించాడు. ఇటీవల మర్రిగూడ మండలం వెంకెపల్లికి చేరుకుని సోదరి ప్రియాంక గురించి ఆరా తీశాడు. స్థానికులు, ఘోరం జరిగిపోయి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేయడంతో తట్టుకోలేకపోయాడు. ఎల్బీనగర్ పోలీసులను ఆశ్రయించి.. తన సోదరి హత్యకు గురైందనే అనుమానంతో ఉపేందర్ వెంటనే ఎల్బీనగర్ పోలీసులను ఆశ్రయించి తన పరిశోధనలో వెలుగు చూసిన వాస్తవాలను బయటపెట్టాడు. అనంతరం అక్కడి పోలీసులు కేసును స్థానిక పోలీసులకు పురమాయించడంతో నాంపల్లి సీఐ ప్రభాకర్‌రెడ్డి రంగంలోకి దిగారు. హనుమంతును రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. తమదైన పద్ధతిలో విచారణ సాగించగా హత్యోదంతం తీరును హనుమంతు వివరించాడు. ఎముకల వెలికితీత మోర హనుమంతు వెల్లడించిన సమాచారం మేరకు పోలీసులు శనివారం రాంరెడ్డిపల్లి శివారులోని పడావుబావిలో ఎముకలు సేకరించారు. తొమ్మిదేళ్ల క్రితం మృతదేహాన్ని మూటగట్టిన గోనెసంచి అవశేషాలు, నాడు హనుమంతు ప్రియాంక మృతదేహంతో పాటు పడవేసిన కారు మ్యాట్‌ను, పుర్రె, ఎముకలు, కేశాలు, ప్లాస్టిక్ చెప్పులు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఎముకలు, కేశాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించనున్నట్టు సీఐ ప్రభాకర్‌రెడ్డి మీడియాకు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. -
ఎన్నారై టార్చర్ : రోజుకు మూడు కాల్స్
మీ అమ్మాయిని ఎన్నారైకి ఇచ్చి చేస్తున్నారా? అయితే ఆలోచించండి. ఢిల్లీలోని మన ‘విదేశీ వ్యవహారాల మంత్రిత్వ’ శాఖకు (ఎంఈఏ) ప్రతి 8 గంటలకు ఒకసారి వినిపిస్తున్న ‘ఆక్రందన’ల్లో మీ అమ్మాయిదీ ఒకటి కాకుండా జాగ్రత్త పడండి. నా భర్త నన్నొదిలేశాడు. నా భర్త నా పాస్‌పోర్ట్ దాచేశాడు. నా భర్త నన్ను హింసిస్తున్నాడు. నా భర్త డబ్బు తెమ్మంటున్నాడు. నా భర్త నా బిడ్డను తీసేసుకున్నాడు. నా భర్త నన్ను వెళ్లగొట్టాడు. ఇవన్నీ.. సహాయం కోసం ఎన్నారై భార్యల నుంచి ఎంఈఏ కి అందిన, నేటికీ అందుతున్న ఫిర్యాదులు! 2015 జనవరి 1 నుంచి 2017 నవంబర్ 30 వరకు.. 1,064 రోజులలో ఇలా ఆ శాఖకు 3,328 ఫిర్యాదుల కాల్స్ అందాయి. అంటే రోజుకు సగటున మూడు కన్నా ఎక్కువ కాల్స్. ప్రతి ఎనిమిది గంటలకు ఒక కాల్! ఇదికాదు అసలు విషయం. కాల్ చేసినవాళ్లలో ఎక్కువమంది ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల ఎన్నారైల భార్యలేనట. ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్’ ఈ వివరాలను వెల్లడించింది. వాషింగ్టన్లో భారతీయ రాయబారిగా వివిధ హోదాలలో 16 ఏళ్లు పనిచేసిన ఆర్తీరావ్ కూడా.. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో వరకట్న దురాచారం బలంగా ఉండటం ఇందుకు ప్రధాన కారణం అని అభిప్రాయపడుతున్నారు. అబ్బాయి విదేశాలనుంచి వస్తాడు. అక్కడేదో మంచి ఉద్యోగం చేస్తున్నాడంటాడు. తల్లిదండ్రుల్ని వెంటేసుకుని వెళ్లి అమ్మాయిని సెలక్ట్ చేసుకుంటాడు. అమ్మాయి తల్లిదండ్రులకు ఆశ చూపి పెళ్లి చేసుకుంటాడు. తనతో పాటు విదేశానికి తీసుకెళతాడు. అక్కడ టార్చర్ మొదలుపెడతాడు. ఇదండీ.. ట్రెండ్! అందరూ అలా ఉంటారా? ఉండకపోవచ్చు. మన కర్మకాలితే అలాంటి వాడు మనమ్మాయినే వెతుక్కుంటూ రావచ్చు. సందేహించడం తప్పుకాదు. ఏదో ఒక ఉద్యోగంలే, ఎవరో ఒకరులే అని సర్దుకుపోవడం తప్పు. -
రక్కసులకే రక్షాకవచం!
సాక్షి ప్రతినిధి, కాకినాడ :సామర్లకోట మండలం అచ్చంపేట జంక్షన్ సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ అంధుల ఆశ్రమ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ కేవీ రావు, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ చిత్రహింసలకు గురిచేసి వారం రోజులు గడి చాయి. ప్రిన్సిపాల్, కరస్పాండెంట్లు విద్యార్థులైన పాముల సురేంద్రవర్మ, పులస సాయి, కూర్తి జాన్సన్‌లను చితకబాదిన దారుణాన్ని ‘సాక్షి’ మీడియా కళ్లకు కట్టినట్టు ప్రసారం చేయడంతో మానవ హక్కుల కమిషన్, బాలల హక్కుల పరిరక్షణ వేదిక వంటి సంస్థలు స్పందించాయి. ఘటన వెలుగు చూడగానే ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు స్పందించిన తీరు చూసి బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తారన్న అభిప్రాయం కలిగింది. తీరా వారం గడిచేసరికి అధికారపార్టీ నేతలు, పోలీసులు, వైద్యులు...ఇలా ఎవరి స్థాయిలో వారు కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. నిందితులైన కరస్పాండెంట్ కేవీ రావు, ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌లపై నమోదు చేసిన సెక్షన్లు పోలీసులు నిందితుల కొమ్ము కాస్తున్నారనే విషయాన్ని ఆదిలోనే స్పష్టం చేశాయి. వారిపై ఐపీసీ 324 సెక్షన్ ప్రకారం కేసు నమోదుచేసి, కాకినాడ నాలుగో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఆ సమయంలో రికార్డును పరిశీలించిన న్యాయమూర్తి రామలింగారెడ్డి పోలీసులు నమోదుచేసిన సెక్షన్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సుమోటోగా కేసును ఐపీసీ 325 సెక్షన్‌కు మార్చి, నిందితులకు రిమాండ్‌కు విధించారు. ఇది జరిగిన వారం రోజుల తరువాత గ్రీన్‌ఫీల్డ్ చైర్మన్, టీడీపీ నాయకుడు బెజవాడ వీరవెంకట సత్యనారాయణపై తాపీగా బుధవారం కేసు నమోదుచేశారు. మాట వినకుంటే కొట్టయినా దారికి తెచ్చుకోవాలన్న చైర్మన్ సూచననే అమలు చేశామని ఎ-1, ఎ-2 నిందితులు కరస్పాండెంట్, ప్రిన్సిపాల్‌ల సమాచారం మేరకే బెజవాడపై కేసు నమోదుచేశారు. అయితే ప్రధాన నిందితులపై బెయిల్‌కు అనుకూలమైన సెక్షన్ కింద కేసు నమోదు చేసినందుకు న్యాయమూర్తి తప్పుపట్టి సెక్షన్ మార్చినా పోలీసుల తీరు అణుమాత్రం మారలేదు. మూడో నిందితుడు బెజవాడపై కూడా నిస్సంకోచంగా 324 సెక్షన్ కిందే నమోదు చేశారు. బెజవాడను నాలుగో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచగా అసహనం వ్యక్తంచేసిన న్యాయమూర్తి ‘324 సెక్షన్‌కు మీరే బెయిల్ ఇచ్చుకునే అవకాశం ఉంది గనుక స్టేషన్ బెయిల్ ఇచ్చుకోం’డని వెనక్కి పంపించడం గమనార్హం. పోలీసులు బెజవాడకు స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి సాగనంపేశారు. దీనంతటి వెనుక అధికారపార్టీ పెద్దల హస్తం ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతటి దురంతంపై ఎంఎల్సీయే లేదు.. ప్రభుత్వ వైద్యులు కూడా ఈ కేసును బలహీనపరిచే రీతిలోనే వ్యవహరించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరస్పాండెంట్, ప్రిన్సిపాల్‌ల కర్కశత్వానికి రక్తపు గాయాలైన ముగ్గురు అంధ విద్యార్థులను కలెక్టర్ ఆదేశాల మేరకు కాకినాడ జీజీహెచ్‌లో చేర్చి ఐదురోజులు చికిత్స చేశారు. తేలో, జెర్రో కుట్టినా, స్వల్ప కొట్లాటల్లో గాయపడ్డా మెడికో లీగల్ కేసులు (ఎంఎల్సీ) నమోదు చేసే జీజీహెచ్ వైద్యులు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించిన ఈ ఘటనపై ఎంఎల్సీ నమోదు చేయకపోవడం ఆ విమర్శలకు బలం చేకూరుస్తోంది. కేవలం యాక్సిడెంట్ రిజిస్టర్(ఏఆర్)లో మాత్రమే నమోదు చేసి బాధిత విద్యార్థులకు చికిత్స చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. గాయాల తీవ్రతను ధృవీకరించే ‘ఊండ్ సర్టిఫికెట్’లో కూడా స్వల్ప గాయాలుగానే తేల్చేసినట్టు సమాచారం. బాధిత విద్యార్థులకు అయిన రక్తపు గాయాల కంటే మానసికంగా వారు అనుభవించిన వేదనను మానవతా కోణంలో చూడకపోవడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. కాగా ఎంఎల్సీ నమోదు చేయని విషయమై జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.వెంకటబుద్ధను సంప్రదించగా ఈ కేసును తాను పూర్తిగా పరిశీలించలేదన్నారు. అయితే ఏఆర్‌గా నమోదు చేసినా తరువాత ఎంఎల్సీగా మార్చుకునే అవకాశం ఉందన్నారు.