breaking news
Tota Chandra Shekhar
-
చంద్రబాబు చీకటి పాలన వద్దేవద్దు
వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి తోట చంద్రశేఖర్ జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ : చంద్రబాబు చీకటి పాలనను ప్రజలెవరూ కోరుకోవద్దని వైఎస్సార్ సీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ తోట చంద్రశేఖర్ హితవు పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జంగారెడ్డిగూడెంలో షర్మిల నిర్వహించిన రోడ్‌షోలో భాగంగా జేపీ సెంటర్లో ప్రజల ను ఉద్దేశించి మాట్లాడారు. చంద్రబాబు పాలనను గుర్తుచేస్తే ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలు చెందుతున్నారన్నారు. ప్రస్తుతం చంద్రబాబు స్వయంగా నడవలేక సినిమా యూక్టర్ను, మతతత్వ నాయకుడిని ఊతకర్రలుగా చేసుకుని ప్రచారం సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఉచిత వాగ్దానాలను నమ్మి ఓటేస్తే మళ్లీ చీకటి రోజులు వస్తాయని అన్నారు. మరో 20 రోజుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడనున్నామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు జగన్మోహన్రెడ్డి 3వేల కిలోమీటర్లు తిరిగి ఓదార్పు యాత్ర చేశారని, ప్రపంచ చరిత్రలోనే లేనివిధంగా షర్మిల 3వేల కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారని గుర్తు చేశారు. వీరిద్దరూ ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రతి పల్లెలో పేదల గడపలు తొక్కి వారి గుండెచప్పుడు విన్నారన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించి ఐదేళ్లపాటు సేవచేసే భాగ్యాన్ని కల్పించాలని ఆయన కోరారు. భారీ మెజార్టీతో గెలిపించాలి : ఘంటా మురళీ రాజశేఖరరెడ్డి రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ అన్నారు. ప్రజలు బాగా ఆలోచించి పార్టీ ఎంపీ అభ్యర్థి తోట చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి దేవీప్రియలకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. -
బాబు చేతిలో మోసపోవద్దు
ఏలూరు (ఆర్ఆర్ పేట), న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేతిలో మరోసారి మోసపోవద్దని, ఆయనవి ఆచరణ సాధ్యం కాని హామీలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త తోట చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని అన్నారు. ఏలూరులోని పలు డివిజన్లలో శుక్రవారం వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయని చంద్రబాబు ఇప్పుడు అధికారమిస్తే చేస్తాననడం హాస్యాస్పదమన్నారు. హై టెక్ మంత్రాన్ని జపిస్తూ రైతులను పట్టిం చుకోకుండా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుం దన్నారు.మరలా తనకు అధికారమిస్తే ఇంటింటికీ ఉద్యోగం, రూపాయికే టిఫిన్, ఐదు రూపాయలకే భోజనం అందిస్తానని ఆచరణ సాధ్యంకాని హామీలను గుప్పిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. చంద్ర బాబు మాయమాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని చెప్పారు. చిరస్థాయిగా నిలిచిన వైఎస్సార్ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వారు చెప్పారు. ఆయన మరణానంతరం కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను నిలిపివేసి ప్రజాకంటకంగా మారిందని విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ అధికార పక్షంతో కుమ్మైక్కై రాష్ట్ర విభజనకు సహకరించిందని ఆరోపించారు. సీమాంధ్ర అభివృద్ధి తనతోనే సాధ్యమంటున్న చంద్రబాబు మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని ఎద్దేవా చేశారు. సీమాంధ్రుల అభిప్రాయాలకు ఏమాత్రం విలువనివ్వని చంద్రబాబుకు మరోసారి అధికారం అప్పగిస్తే ఈ రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేయడానికి కూడా వెనకాడబోరన్నారు. రెండుకళ్ల సిద్ధాంతంతో అటు తెలంగాణ ప్రజలను, ఇటు సీ మాంధ్రులను మోసం చేసేందుకు చం ద్రబాబు తెగించారని చెప్పారు. రాష్ట్ర విభజనలో పాలుపంచుకున్న బీజేపీతో తెలుగుదేశం పొత్తుపెట్టుకోవాలనుకోవడం అనైతికమన్నారు. వీరి కూటమిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఏలూరు రెండో డివిజన్ అభ్యర్థి గుత్తుల బాలా త్రిపుర సుందరి, 16వ డివిజన్ అభ్యర్థి దాసరి రమేష్, 14వ డివిజన్ అభ్యర్థి అబ్బిరెడ్డి వెంకటలక్ష్మి, నాయకులు దాసరి వరలక్ష్మి, ఉదయేశ్వరరావు, బుద్దాల రాము, ఆలా గణేష్, రంగ ముత్యాలు, బత్తిన మస్తాన్ రావు, కోలా భాస్కరరావు, బుద్దాల గోవిందరావు, ఆళ్ల రాంబాబు తదితరులు వారి వెంట ఉన్నారు.