Tourism Corporation
-
Pranay Patel-Wildlife photographer: క్లికింగ్
పదమూడు సంవత్సరాల వయసులోనే కెమెరాతో స్నేహం మొదలుపెట్టిన ప్రణయ్‌కి, ఇప్పుడు ఆ కెమెరానే ప్రాణం. అరణ్యానికి సంబంధించిన అద్భుతదృశ్యాలను అమితంగా ఇష్టపడే ప్రణయ్ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ఇంకా ఎన్నో అద్భుతాలు సాధించడానికి ఉత్సాహంగా ఉన్నాడు..... పదమూడు సంవత్సరాల వయసులో కెమెరాతో అనుబంధం పెంచుకున్నాడు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ప్రణయ్ పటేల్. అది ఆ వయసుకు మాత్రమే పరిమితమైన ఉత్సాహమై ఉంటే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా ప్రణయ్ అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకునేవాడు కాదు. దేశవిదేశాల్లో అరణ్యానికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన దృశ్యాలను ఫొటోలలో బంధించాడు. ఈ చిత్రాలు జాతీయ,అంతర్జాతీయ క్యాలెండర్లను అలంకరించాయి. అడవిలో ఫొటోగ్రఫీ అనేది అంతా వీజీ కాదు. ‘మేము రెడీ. ఇక మీరు ఫొటో తీసుకోవచ్చు’ అన్నట్లుగా ఉండదు అక్కడ. ఏ క్షణంలో ఏ అద్భుతం ఆవిష్కారం అవుతుందో తెలియదు. ఒళ్లంతా కెమెరా కన్నులై ఉండాలి. అడవి నాడి తెలిసిన ప్రణయ్‌కి ఈ విషయం తెలియనిదేమీ కాదు. అందుకే అడవిలోని అద్భుతదృశ్యాలను సమర్థవంతంగా పట్టుకోగలిగాడు. ‘లొకేషన్లోకి ప్రవేశించిన వెంటనే బ్యాక్‌ప్యాక్ ఓపెన్ చేసి కెమెరా సెట్ చేసుకోవాలి. బోర్ కొట్టవచ్చు. అలసటగా అనిపించవచ్చు. అయితే మన లక్ష్యం...అద్భుత దృశ్యం అనే విషయాన్ని మరవకూడదు. ఓపికతో కూడిన నిరీక్షణ నన్ను ఎప్పుడూ నిరాశ పరచలేదు’ అంటాడు ప్రణయ్. ప్రణయ్ ఫొటోలతో రూపుదిద్దుకున్న ‘ది వండర్ఫుల్ వైల్డ్‌లైఫ్ ఆఫ్ గుజరాత్’ ‘ది బేర్స్ ఆఫ్ కమ్చట్క–రష్యా’ ‘ది వైల్డ్ ఎర్త్ ఆఫ్ ఆఫ్రికా’... మొదలైన క్యాలెండర్లకు ఎంతో పేరు వచ్చింది. గుజరాత్ టూరిజం కార్పొరేషన్ అధికారిక ఫొటోగ్రాఫర్‌గా చిన్న వయసులోనే నియమించబడ్డాడు. ‘ఫొటోగ్రాఫర్‌కు దృశ్యజ్ఞానమే కాదు శబ్దజ్ఞానం కూడా ఉండాలి’ అంటున్న ప్రణయ్ శబ్దాల ద్వారా కూడా దృశ్యాలను ఊహించగలడు. వాటిని అందంగా ఛాయాచిత్రాలలోకి తీసుకురాగలడు. తన వెబ్సైట్ ద్వారా ఎంతో మంది ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లకు స్ఫూర్తిని, ఉత్సాహాన్ని ఇస్తున్న ప్రణయ్ అమెరికాతో సహా ఎన్నో దేశాల్లో జరిగిన ఫొటోఎగ్జిబిషన్లలో పాల్గొన్నాడు. ‘వర్తమానం నుంచే కాదు గతం నుంచి కూడా ఎన్నో అద్భుత విషయాలను నేర్చుకోవచ్చు’ అంటున్న ప్రణయ్ అలనాటి బ్లాక్ అండ్ వైట్ ఫొటోలలోని అద్భుతాలను ఆసక్తిగా విశ్లేషిస్తుంటాడు. ‘ప్రతి ఫొటో ఒక కొత్త విషయాన్ని మనకు పరిచయం చేస్తుంది’ అంటాడు ప్రణయ్. స్కూల్‌బ్యాగ్ మోసుకెళ్లాల్సిన వయసులో కెమెరా బ్యాగు మోసుకెళుతున్న ప్రణయ్‌కి వెక్కిరింపులు ఎదురయ్యాయి. ‘ఇక నీకు చదువు ఏం వస్తుంది!’ అని ముఖం మీదే అన్నవాళ్లు కూడా ఉన్నారు. అయితే ఆ మాటలు విని తాను ఎప్పుడూ బాధపడలేదు. వెనక్కి తగ్గలేదు. కెమెరాతో స్నేహం వీడలేదు. దేశవిదేశాలలో ప్రణయ్ చేసిన ఫొటోగ్రఫీ టూర్లు వంద దాటాయి. ‘ప్రతి టూర్‌కు సంబంధించిన అనుభవాలను ఒక పుస్తకంగా రాసుకోవచ్చు’ అని మురిసిపోతుంటాడు ప్రణయ్. ‘కెమెరా పట్టుకోగానే అద్భుతాలు చోటుచేసుకోవు. పర్ఫెక్ట్ షాట్ కోసం రోజులే కాదు సంవత్సరం పాటు ఎదురుచూసిన సందర్భాలు కూడా ఉన్నాయి’ అంటాడు ప్రణయ్. ఫొటోగ్రఫీ గురించి ఓనమాలు తెలియని వారే కాదు, ఆ విద్యలో కొమ్ములు తిరిగిన ఫొటోగ్రాఫర్లు కూడా ప్రణయ్‌ని ప్రశంసలతో ముంచెత్తున్నారు. 25 సంవత్సరాల ప్రణయ్ పటేల్ భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. దేశవిదేశాల్లో అరణ్యానికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన దృశ్యాలను ఫొటోలలో బంధించాడు ప్రణయ్. ఈ చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ క్యాలెండర్లను అలంకరించాయి. -
Special Train: విజయవాడ టు గుజరాత్..
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) దేశవ్యాప్తంగా తక్కువ ఖర్చుతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు అనేక ప్యాకేజీలను యాత్రికుల కోసం అందుబాటులోకి తీసుకొస్తోంది. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండేలా ‘వైబ్రెంట్ గుజరాత్’ పేరుతో విజయవాడ నుంచి ప్రత్యేక టూరిజం రైలు నడపనున్నట్లు ఐఆర్సీటీసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ కిషోర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ యాత్రికుల ప్రత్యేక రైలు 2022 జనవరి 21వ తేదీ మధ్యాహ్నం విజయవాడ నుంచి బయలుదేరి 31వ తేదీ సాయంత్రం తిరిగి విజయవాడ చేరుతుంది. ఈ రైలుకు ఏలూరు, రాజమండ్రి, తుని, విశాఖపట్నం స్టేషన్లలో బోర్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనం, ద్వారకాదీష్ టెంపుల్‌తో పాటు సమీపంలోని ప్రముఖ దేవాలయాల దర్శనం, నాగేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం, శబరిమతి ఆశ్రమం, అక్షరథామ్ టెంపుల్, స్టాట్యూ ఆఫ్ యూనిటీ తదితర చారిత్రక ప్రాంతాలను చూపిస్తారు. యాత్రికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ రైలులో ప్రత్యేక ఐసోలేషన్ కోచ్‌తో పాటు ప్యాంట్రీకారు, సెక్యూరిటీ, గైడ్లు అందుబాటులో ఉంటారు. అసక్తి గల వారు విజయవాడ స్టేషన్‌లోని ఐఆర్‌సీఈసీ కార్యాలయంలో నేరుగా, లేదా 82879 32312, 97013 60675 సెల్ నంబర్లలో, https://www. irctctourism. com/ వెబ్సైట్ సంప్రదించి టికెట్లు బుక్ చేసుకోవాలి. -
తెలంగాణ యువతుల సాహస యాత్ర
హైదరాబాద్: ఎర్రటి ఎండలు, చలిగాలులు, నిర్జన ప్రదేశాలు, సంక్లిష్టమైన వాతావరణ పరిస్థితుల మధ్య తెలంగాణ యువతులు ‘రోడ్ టు మెకాంగ్ ఎక్స్‌పెడిషన్’ను విజయవంతంగా పూర్తిచేశారు. రెండు నెలల కాలంలో ఆరు దేశాల్లో 17 వేల కిలో మీటర్ల దూరాన్ని మోటార్ బైక్‌పై చుట్టేసి వచ్చారు. ఆదివారం నగరానికి చేరుకున్న ఆ సాహస యువ తులు జయభారతి, ప్రియా బహదూర్, శిల్పా బాలకృష్టన్, ఏఎస్డీ శాంతిలకు పర్యాటకశాఖ అధికారులు, విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇక్కడి పర్యాటక భవన్లో వారిని టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్, ఇండియా టూరిజం అధికారి శంకర్‌రెడ్డి సత్కరించారు. ఆరు దేశాల్లో సాగిన యాత్ర టీమ్ లీడర్ జయభారతి మాట్లాడుతూ, మన దేశంలోని 15 రాష్ట్రాల గుండా సాగిన తమ మోటార్ బైక్ ప్రయాణం మయ న్మార్, థాయ్‌లాండ్, లావోస్, వియత్నాం, కాంబోడియా, బంగ్లాదేశ్‌ల మీదుగా తిరిగి భారత్ చేరుకున్నట్లు చెప్పారు. ప్రతి ప్రాంతంలోనూ భాష, సంస్కృతితో సంబంధం లేకుండా తమను ఆదరంగా అక్కున చేర్చుకున్నారన్నారు. రాష్ట్ర సంస్కృతి, భారతదేశ పర్యాటకం గురించి అందరూ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారన్నారు. శాంతి మాట్లాడుతూ, అన్ని చోట్లా తమ శక్తి మేరకు ఇండియా టూరిజం, తెలంగాణ టూరిజంను ప్రచారం చేశామన్నారు. కార్యక్రమంలో సభ్యు లు శిల్ప, ప్రియ తమ అనుభవాలను పంచుకున్నారు. -
ఇక ఖరీదైన రైళ్లలో పెళ్లిళ్లు
న్యూఢిల్లీ: వినూత్నంగా, విలాసవంతంగా వివాహం చేసుకోవాలనుకునే జంటలకు శుభవార్త. భారతీయ రైల్వేకు చెందిన క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ తమ లగ్జరీ రైళ్లను పెళ్లి వేడకులకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ కార్పొరేషన్ ప్రపంచ పర్యాటకుల కోసం లగ్జరీ, సెమీ లగ్జరీ రైళ్లను ఇప్పటికే నడుపుతున్న విషయం తెల్సిందే. వీటిలో అత్యంత ఖరీదైన మహారాజా ఎక్స్‌ప్రెస్ 8 రోజుల ప్యాకేజీపైనా ఢీల్లీ, ఆగ్ర, రంథంబోర్, జైపూర్, బికనూర్, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్, బెలాసినార్ల కోటలు, చారిత్రక కట్టడాల సందర్శన కోసం పర్యాటకుల కోసం నడుపుతోంది. ఇప్పుడు పెళ్లిళ్ల కోసం మహారాజా ఎక్స్‌ప్రెస్‌తోపాటు ప్యాలెస్ ఆన్ వీల్స్, డెక్కన్ ఒడిస్సీ, గోల్డెన్ చారియట్, రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్ రైళ్లను కేటాయించాలని కార్పొరేషన్ నిర్వహించింది. పెళ్లిళ్లకు, వేడికలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు రైలు డెకరేషన్‌ను మార్చేందుకు, అతిథులకు పసందైన విందు భోజనాలతోపాటు వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేసేందుకు నిపుణులైన ఈవెంట్ మేనేజర్లు ఉంటారని కార్పొరేషన్ సీనియర్ అధికారులు తెలిపారు. రైళ్లలో విహరిస్తూనే పెళ్లి చేసుకోవచ్చని, వధూవరుల హానిమూన్‌కోసం ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఉంటాయని వారు చెప్పారు. ఎన్నిరోజుల బస, ఉపయోగించుకునే వసతులు, ప్యాకేజీల ఆధారంగా రేట్లు ఉంటాయని వారు అన్నారు. విలాసవంతమైన రైళ్లలో ‘స్పా’ లాంటి సౌకర్యాలు కూడా ఉంటాయని, భారతీయులు, ప్రవాస భారతీయలకే కాకుండా విదేశీ జంటల వివాహాలకు కూడా తాము రైళ్లను కేటాయిస్తామని వారు చెప్పారు. తాము వినూత్నంగా త్వరలోనే ప్రారంభించనున్న ఈ స్కీమ్ విజయవంతమవుతుందన్న విశ్వాసంతో ఉన్నామని వారు చెప్పారు. -
‘ఈ-కేటరింగ్’ షురూ
ప్రారంభించిన ఐఆర్సీటీసీ కోల్‌కతా: ముందస్తు ఆర్డర్లపై ప్రయాణికులకు రైల్వేస్టేషన్లలోనే వారికి కావల్సిన ఆహారాన్ని అందజేసేందుకు ఇండియన్ రైల్వేస్ కేటరింగ్, టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) సోమవారం ఓ పథకాన్ని ప్రారంభించింది. ‘ఈ-కేటరింగ్’ పేరిట దీన్ని పైలట్ ప్రాజెక్టుగా తొలిదశలో దేశవ్యాప్తంగా ఎంపికచేసిన 45 ప్రధాన రైల్వేస్టేషన్లలో అమలు చేయనున్నారు. దీనికోసం ప్రయాణికులకు కావల్సిన ఆహారాన్ని అందించేందుకు భోజన సరఫరా సంస్థలతో ఐఆర్సీటీసీ ఒప్పందం కుదుర్చుకుంది. దీన్ని ‘స్టేషన్ ఆధారిత ఈ-కేటరింగ్’గా వ్యవహరిస్తారు. దీనికోసం ప్రయాణికులు ఆన్లైన్లోనే www.ecatering.irctc.co.in ద్వారా బుక్‌చేసుకోవచ్చు. లేదా 0120-2383892-99/1800-1034-139 (టోల్ ఫ్రీ) నెంబర్లకు ఫోన్‌చేసి ఆర్డర్ చేయవచ్చు. లేదా 139 నెంబరుకు సంక్షిప్త సందేశం పంపి భోజన సదుపాయాన్ని పొందవచ్చు. అయితే సంస్థలు ఈ ఆహారాన్ని ప్రయాణికులకు సంబంధిత స్టేషన్లలో రైలు ఆగినప్పుడు ప్రయాణికుని బెర్త్ వద్దకు వచ్చి అందజేస్తాయి. చెల్లింపులను నేరుగానే కాకుండా, ఆన్‌లైన్‌లోనూ చేయొచ్చు. ఈ-కేటరింగ్ ఈస్ట్‌జోన్ పరిధిలోని హౌరా, సీల్దా, విశాఖపట్నం తదితర స్టేషన్లలో అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ, చెన్నయ్, బెంగళూరు, సికింద్రాబాద్, తిరుపతి, విజయవాడ తదితర ప్రధాన స్టేషన్లలో కూడా సరఫరా చేయనున్నారు. -
దేశాన్ని చుట్టేద్దామా !
ఉత్తరాన ఢిల్లీ, జైపూర్, బృందావనం దక్షిణాన రామేశ్వరం, కన్యాకుమారి ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలు 5 శాతం రాయితీ, బీమా కవరేజీ శీతాకాలం చివర్లో ప్రకృతి అందాలు ఆస్వాదించాలనుందా.. అరుుతే గోల్డెన్ ట్రయూంగిల్ ప్యాకేజీలు మీ కోసమే. ఇండియన్ రైల్వేస్ అండ్ క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) వీటిని ప్రకటించింది. ఈ పర్యటనల్లో టికెట్ చార్జీపై ఐదు శాతం రాయితీ, ప్రమాద బీమా కూడా కల్పిస్తోంది. - సాక్షి, హన్మకొండ ఉత్తర భారత దేశ యూత్ర ఇలా.. ఉత్తర భారతదేశ గోల్డెన్ ట్రయాంగిల్ ప్యాకేజీ లో ఢిల్లీ, ఆగ్రా, బృందావనం, మధుర, జైపూర్ ఉన్నాయి. ఈ యాత్ర 7 రాత్రులు, 8 పగళ్లుగా ఉంటుంది. డిసెంబర్ 20న ఈ ప్రత్యేక రైలు హైదరాబాద్ నుంచి రాత్రి 10:30 గంటలకు బ యల్దేరి కాజీపేట, బల్లార్షా, నాగ్‌పూర్, ఇటా ర్సీ, భోపాల్ మీదుగా రెండోరోజు తెల్లవారుజామున 4:05 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్ చేరుతుంది. మూడోరోజు ఢిల్లీలో పర్యాటక ప్రాంతాలైన ఇండియాగేట్, కుతుబ్మీనార్, పార్లమెంట్, రాజ్‌ఘాట్, అక్షర్ధామ్, లోటస్ టెంపుల్ సందర్శన ఉంటుంది. రాత్రి జైపూర్ ప్రయాణం ఉంటుంది. నాలుగోరోజు జైపూర్ లో అంబర్ఫోర్ట్, జంతర్‌మంతర్, హవామహల్, సిటీ ప్యాలెస్ చూపిస్తారు. రాత్రి బస అక్కడే. ఐదో రోజు ఫతేపూర్, సిక్రీల మీదుగా ఆగ్రాలో తాజ్‌మహల్ సందర్శన ఉంటుంది. ఆరో రోజు మధుర, బృందావనం, ద్వారకాదీశ్లను పర్యటకులు సందర్శించవచ్చు. ఏడో రో జు మధ్యాహ్నం 1:00 గంటకు మధురై రైల్వేస్టే షన్ నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణం. ఈ ప్యాకేజీకి సంబంధించి ఏసీ ప్రయాణంలో ఒక్కో వ్యక్తికి రూ.20,755, ఇద్దరికి రూ. 16,892, ముగ్గురికి రూ.15,897లను టికెట్‌గా నిర్ణయించారు. పిల్లలకు టికెట్ రూ. 10,486. రామేశ్వరం యాత్ర విశేషాలు దక్షిణ భారతదేశ గోల్డెన్ ట్రయాంగిల్ టూర్లో భాగంగా రామేశ్వరం, కన్యాకుమారి, మధురై, నాగర్‌కోయిల్‌లో పర్యటించవచ్చు. 2015 జనవరి 28, మార్చి 4 తేదీల్లో ఈ యాత్ర ఉం టుంది. ఈ రెండు రోజుల్లో సాయంత్రం 5:55 గంటలకు కాచిగూడ నుంచి రైలు బయల్దేరి త ర్వాతి రోజు రాత్రి 7:45 గంటలకు రామేశ్వరం చేరుతుంది. మూడోరోజు రామేశ్వరంలోని అగ్నితీర్థం, రామనాథస్వామిగుడి, ధనుష్కోటి బీచ్, పంచముఖి హన్మాన్, రామ్కుంఢ్, పంబర్ వంతెనలను సందర్శిస్తారు. అదేరోజు రాత్రి కన్యాకుమారికి ప్రయాణవుతారు. నాలుగోరోజు కన్యాకుమారిలో సూర్యోదయం సందర్శనతో పర్యటన మొదలవుతుంది. పద్మనాభపురం ప్యాలెస్, వివేకానందరాక్ మెమోరియల్, ఇతర పర్యాటక ప్రాంతాల సందర్శన ఉంటుంది. ఐదోరోజు మధుర మీనాక్షి దర్శనమయ్యూక హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం. ఈ ప్యాకేజీలో స్లీపర్‌క్లాస్ ప్రయాణానికి ఒకరికి రూ.10,078, ఇద్దరికి రూ. 8,530, ముగ్గురికి రూ. 8,219. త్రీటైర్ ఏసీకి సంబంధించి ఒకరికి రూ.16,767, ఇద్దరికి రూ.14,626, ముగ్గురికి రూ.12,699లుగా చార్జీ వసూలు చేస్తారు.