Town panchayats
-
21 నగర పంచాయతీలకు మున్సిపాలిటీ హోదా
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని 21 నగర పంచాయతీల స్థాయిని మున్సిపాలిటీగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపారు. ఈ జాబితాలో బడంగ్పేట్, పెద్ద అంబర్పేట్, నర్సంపేట, సత్తుపల్లి, గజ్వేల్, వేములవాడ, కల్వకుర్తి, ఇబ్రహీంపట్నం, హుజూర్నగర్, జమ్మికుంట, నాగర్‌కర్నూల్, పరకాల, హుజూరాబాద్, మధిర, హుస్నాబాద్, బాదేపల్లి, అచ్చంపేట, ఐజా, దేవరకొండ, కొల్లాపూర్, అందోల్–జోగిపేట్‌లు ఉన్నాయి. -
పది పంచాయతీలకు మున్సిపాల్టీ హోదా
బెంగళూరు : రాష్ట్రంలోని 10 పట్టణ పంచాయతీలను పురసభలుగా, తొమ్మిది పురసభలను నగర సభలుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి శుక్రవారం సాయంత్రం అధికారిక ప్రకటనను వెలువరించింది. కొత్త పురసభలు: కల్బుర్గి జిల్లాలోని అఫ్జల్‌పుర, జీవర్గి, చించోళి, యాదగిరి జిల్లాలోని గురుమిట్కళ్, బాగల్కోటె జిల్లా హునగుంద, బెళగావి జిల్లాలోని కుడచి, హుక్కేరి, సదలగ, మండ్య జిల్లా పాండవపుర, మైసూరు జిల్లా టి.నరసీపుర కొత్త నగర సభలు: హాసన్ జిల్లా అరసికెరె, చిత్రదుర్గ జిల్లా హిరియూరు, బెంగళూరు గ్రామాంతర జిల్లా హొసకోటె, రామనగర జిల్లా కనకపుర, బాగల్కోటె జిల్లా ముథోళ్, చిక్కబళ్లాపుర జిల్లా శిడ్లఘట్ట, బళ్లారి జిల్లా సిరిగుప్ప, యాదగిరి జిల్లా సురపుర, దక్షిణ కన్నడ జిల్లా ఉళ్లాల.