
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని 21 నగర పంచాయతీల స్థాయిని మున్సిపాలిటీగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపారు. ఈ జాబితాలో బడంగ్‌పేట్, పెద్ద అంబర్‌పేట్, నర్సంపేట, సత్తుపల్లి, గజ్వేల్, వేములవాడ, కల్వకుర్తి, ఇబ్రహీంపట్నం, హుజూర్‌నగర్, జమ్మికుంట, నాగర్‌కర్నూల్, పరకాల, హుజూరాబాద్, మధిర, హుస్నాబాద్, బాదేపల్లి, అచ్చంపేట, ఐజా, దేవరకొండ, కొల్లాపూర్, అందోల్–జోగిపేట్‌లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment