town planning authority
-
నిజాంపేట్‌లో అపార్ట్మెంట్లకు ఏమైంది!
సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాలపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. సదరు నిర్మాణాలు పూర్తయినా కూడా వాటిని వదిలిపెట్టడం లేదు. ఇటీవల నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కమిషనర్ గోపి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమంగా నిర్మించిన 103 భవనాలను గుర్తించి సీజ్ చేశారు. గ్రామ పంచాయతీ పరిపాలనలో ఉన్నప్పుడు అనుమతులతో జీ ప్లస్–4 అంతస్తులు నిర్మించారు. నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్ మూడు గ్రామాలు కలిపి కార్పొరేషన్‌గా గత సంవత్సరం ఏర్పాటైంది. అంతకు ముందు వచ్చే నుంచే విచ్చలవిడిగా నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కమిషనర్ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపడంతో యజమానులు, కాంట్రాక్టర్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. కార్పొరేషన్ ఏర్పడిన నాటి నుంచి బిల్డర్లు నిర్మాణాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఇక్కడ కమిషనర్‌గా పనిచేసిన ముకుందరెడ్డి గత ఏడాది నవంబరు 1న అక్రమ నిర్మాణాల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని సబ్ రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. ఈ ఏడాది మే 16న ప్రస్తుత కమిషనర్ గోపి సుమారు 1000కి పైగా అక్రమ నిర్మాణాలను రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ లేఖ రాశారు. కరోనా ప్రభావం, ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో రిజిస్ట్రేషన్ నిలిపివేయడం పనులు నిలిచాయి. యథాతథంగా పనుల నిర్వహణ.. కార్పొరేషన్ అధికారులు ఇటీవల సీజ్ చేసిన భవనాల్లో యథాతథంగా పనులు కొనసాగుతున్నాయి. సీజ్ చేసిన తర్వాత అధికారులు తమ పని పూర్తయినట్లుగా వ్యవహరిస్తుండటంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్నారు. పనులు జరుగుతున్న విషయం తెలిసినా అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నారు. ప్రాథమిక దశలోనే నిర్మాణాలను అడ్డుకుంటే ఎవరికీ నష్టం జరగదని, నిర్మాణం పూర్తయిన తర్వాత సీజ్ చేస్తే ఎలా అని పలువురు ఆరోపిస్తున్నారు. ఏమాత్రం ఉపేక్షించం.. సీజ్ చేసిన అక్రమ భవన నిర్మాణదారులకు నోటీసులు జారీ చేశాం. అనుమతులకు సంబంధించిన పత్రాలను తమకు ఇవ్వాలని కోరాం. అన్నీ పరిశీలించిన తర్వాతే అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదు. ఇప్పటికే 103 భవనాలను సీజ్ చేశాం. – గోపి, కమిషనర్, నిజాంపేట్ కార్పొరేషన్ -
కోడెల అక్రమ నిర్మాణంపై చర్యలు
సాక్షి, గుంటూరు: అధికారం అండతో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామకృష్ణ, కుమార్తె పూనాటి విజయలక్ష్మి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. శివరామ్ తన షోరూమ్‌లో టీఆర్ లేకుండా బైక్‌ల విక్రయించి ప్రభుత్వానికి రూ.లక్షల్లో టోకరా వేశాడు. తన తండ్రి అక్రమంగా తెచ్చిపెట్టిన అసెంబ్లీ ఫర్నిచర్‌ను షోరూమ్‌లో ఉపయోగించుకున్నాడు. కే–ట్యాక్స్‌లు, ఉద్యోగాల పేరుతో అనేక మంది నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడ్డాడు. ఈ వ్యవహారాలన్నింటిలో ఇప్పటికే శివరామ్‌పై అనేక కేసులు నమోదయ్యాయి. ఈయనగారి అక్రమాలు నరసరావుపేట, సత్తెనపల్లిలోనే కాకుండా రాష్ట్రం మొత్తం విస్తరించిన విషయం తెలిసిందే. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని గుంటూరు నగరంలో అక్రమంగా జీ ప్లస్–2 భవంతి నిర్మాణం చేపట్టారు. ఈ భవన నిర్మాణానికి కార్పొరేషన్ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. ఈ వ్యవహారంపై ఈ నెల 20న ‘సాక్షి’ దినపత్రికలో ‘యథేచ్ఛగా అక్రమ నిర్మాణం!’ శీర్షికతో కథనం ప్రచురితం అయింది. ఈ నేపథ్యంలో గుంటూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు కోడెల శివరామ్ నిర్మిస్తున్న అక్రమ నిర్మాణంపై చర్యలకు దిగారు. గుంటూరు నగరంలోని భాగ్యనగర్ కాలనీ ఎనిమిదో లైన్‌కు శివారులోని ఎక్స్టెన్షన్ ఏరియాలో సర్వే నెంబర్ 281/ఏ, 296/ఏ లలో 997 గజాలు, 291/ఏ, 296/డీ లలో 1019 గజాల స్థలం కోడెల శివరామ్‌కు ఉంది. ఈ స్థలంలో సుమారు ఎనిమిది నెలల క్రితం శివరామ్ జీ ప్లస్–2 భవనం నిర్మాణం చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో తన తండ్రి స్పీకర్ కావడంతో భవనం నిర్మాణానికి కార్పొరేషన్ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. స్పీకర్ తనయుడి భవంతి కావడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం చూసీచూడనట్టు వదిలేశారు. నోటీసు జారీ... అక్రమ కట్టడం వ్యవహారంపై సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో టౌన్ ప్లానింగ్ అధికారుల్లో చలనం వచ్చింది. కోడెల కుమారుడి అక్రమ నిర్మాణానికి నోటీసు జారీ చేశారు. కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనానికి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 452(1), 428, 461(1), ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ చట్టం 2014 115(1)(2), 116(1) కింద అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అక్రమ కట్టడంపై వివరణ ఇవ్వాలని కోరారు. బీపీఎస్ దరఖాస్తు తిరస్కరణ.. అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని బీపీఎస్‌లో పెట్టి క్రమబద్ధీకరించేందుకు కోడెల శివరామ్ ప్రయత్నించారు. ఏ విధంగా ఆ భవనం బీపీఎస్ కిందకు వస్తుందో సరైన స్పష్టత ఇవ్వకపోవడంతో బీపీఎస్ దరఖాస్తును టౌన్ ప్లానింగ్ అధికారులు తిరస్కరించారు. కోడెల శివరామ్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కోసం 2018 సెప్టెంబర్ 3వ తేదీ దరఖాస్తు చేసుకున్నారు. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేసేందుకు సర్వే చేయడం కోసం కార్పొరేషన్ రెవెన్యూ విభాగం సిబ్బంది అంతకు ముందు వరకూ ఆ స్థలం వ్యవసాయ భూమి కింద ఉండేది. కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేయడానికి ఆ స్థలం పరిశీలించేందుకు గత ఏడాది సెప్టెంబర్‌లో వెళ్లగా అక్కడ భవన నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. కోడెల శివరామ్ మాత్రం గత ఏడాది ఆగస్టు నెలకు ముందే భవన నిర్మాణం ప్రారంభం అయిందని ఆగస్టు నెలాఖరికి శ్లాబ్ పూర్తయిందని బీపీఎస్‌కు దరఖాస్తు చేశారు. అక్రమ కట్టడాన్ని కూల్చివేస్తారనే భయంతో భవనాన్ని క్రమబద్ధీకరించుకోవడం కోసం అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. టౌన్ ప్లానింగ్‌లోని కొందరు అధికారులు సైతం ఆయనకు సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే డీటీసీపీ (డైరెక్టర్ ఆఫ్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాధికారులకు సమాచారం వెళ్లడంతో టౌన్ ప్లానింగ్ అధికారులపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినట్టు సమాచారం. కోడెల కుమారుడితో అంటకాగి అక్రమ నిర్మాణాన్ని క్రమబద్ధీకరించడం కోసం ఏ టౌన్ ప్లానింగ్ అధికారి ప్రయత్నించినా వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. -
మార్టిగేజ్ ల్యాండ్ మాయం?
సాక్షి, సిరిసిల్లటౌన్:మున్సిపల్ ఆస్తులకు రక్షణ కరువైంది. కొందరు మధ్యవర్థుల అడ్డగోలు వ్యవహారం.. అధికారుల గుడ్డినమ్మకం ఇందుకు కారణమైంది. రూ.25 లక్షల విలువ చేసే మార్టిగేట్ స్థలం వివాదంలో చిక్కింది. టౌన్ ప్లానింగ్ వైఫల్యంతో.. మున్సిపల్‌కు చెందిన ఆస్తుల రక్షణలో టౌన్‌ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలకు ఈసంఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. సాయినగర్‌లో 729/ఏ, 729/బి తదితర సర్వే నంబర్లలో 2000, 2001 ప్రాంతంలో పలువురు తమ స్థలాలను ప్లాట్లుగా మార్చుతూ అనుమతులు పొందారు. ఈప్రాంతం అభివృద్ధి కోసం మున్సిపల్‌కు 31 గుంటలు కేటాయించినట్లు సమాచారం. మున్సిపల్ స్థలాలకు రక్షించే చర్యలో భాగంగా సదరు సర్వే నంబర్లలోని లేఅవుట్ భూమి 31 గుంటలు ఉండగా మున్సిపల్ కేవలం 16 గుంటలకే ప్రహరీ నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం నర్సరీ నిర్వహిస్తున్నారు. ఇదే స్థలాన్ని ఆనుకుని మిగతా 15 గుంటలకు ప్రహరీ నిర్మించకపోవడంలో ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చిన్నలోటు.. పెద్దతప్పు.. సాయినగర్ ప్రాంతంలోని రెండు వేర్వేరు వెంచర్ల ద్వారా మున్సిపల్‌కు 31 గుంటల స్థలం సంక్రమించింది. ఇందులో ఒక వెంచర్‌ను ముగ్గురి తరఫున ప్లాట్ నంబరు 21 పేరుతో మున్సిపల్ ఫీజు కింద కమిషనర్ పేరిట మార్టిగేజ్ చేశారు. ప్లాటింగ్ అనుమతిలో డీటీసీపీ నుంచి అనుమతి వచ్చినపుడు సదరు ప్లాటు నంబరు 25గా మారిం ది. హద్దులు మాత్రం వెనకాల మున్సిపల్ నర్సరీ, ముందు భాగంలో రోడ్డు వంటివి ప్లాన్‌లో నిర్ధారణ చేసినట్లు మిగతా ఇద్దరు బాధితులు తెలిపారు. అయినా మూడోవ్యక్తి కమిషనర్ పేరిట మార్టిగేజ్ చేసిన స్థలాన్ని విక్రయించడం..ఇటీవలే ఆ ప్లాటులో టౌన్‌ప్లానింగ్ నుంచి ఇంటి నిర్మాణానికి అనుమతి రావడం వివాదానికి తెరలేపింది. అడ్డదారులు పట్టిస్తున్న గుడ్డినమ్మకం.. మధ్యవర్థులపై అధికారులకు ఉన్న గుడ్డినమ్మకం అడ్డదారులకు తావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. ఇంటి నిర్మాణ అనుమతి మంజూరులో స్థానిక మున్సిపల్ ప్లానర్స్తోపాటు మరికొందరు మధ్యవర్థిత్వం నెరుపుతున్నట్లు సమాచారం. ఈవిషయంలో ఓ ప్లానర్ అ«ధికారులు, ప్లాటు విక్రయదారులకు మధ్యవర్థిత్వం నెరిపి విచారణ లేకుండా ఇంటి నిర్మాణానికి అనుమతి మంజూరు చేయించినట్లు చర్చసాగుతోంది. సాయినగర్‌లోని మున్సిపల్ మార్టిగేజ్ ల్యాండ్‌ను ఇతరులకు అమ్మిన వ్యక్తి ప్రముఖుడు కావడంతో ఎలాంటి వి చారణ లేకుండానే ఇంటిపర్మిషన్ ఇచ్చినట్లు విమర్శలున్నాయి. ప్రస్తుతం సదరు మార్టిగేజ్ ల్యాండ్ విడుదల కోసం ఇద్దరు బాధితులు దరఖాస్తు చేసుకుని న్యాయం కావాలని కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం మార్టిగేజ్ ల్యాండ్ విక్రయంపై మాకు ఫిర్యాదు రాలేదు. ఈవిషయంలో విచారణ చేపట్టి చర్యలు చేపడతాం. మున్సిపల్‌కు సంబం««ధించిన స్థలాలను ఆక్రమించినా..దుర్వినియోగం చేసినా కఠినంగా వ్యవహరిస్తాం. – రమణాచారి, మున్సిపల్ కమిషనర్ -
రూ.లక్ష ఇవ్వాల్సిందే
కడప కార్పొరేషన్: ఆయన వామపక్షాలకు చెందిన ఓ పార్టీలో సాధారణ కార్యకర్తగా ఉండేవాడు.. ఏదేదో చేయడంతో ఆ పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది. కేవలం ఐదేళ్లలోనే యువసేనను ఏర్పాటు చేసుకునే స్థాయికి ఆ నాయకుడు ఎదిగాడు. అనంతర ఆయన చేరనిపార్టీలేదు.. చేయని వివాదం లేదు.. కొన్నాళ్లకు సినీనటుడు స్థాపించిన పార్టీలోకి చేరిపోయాడు. ఆ పార్టీ మరో పార్టీలో విలీనం కావడంతో తాను కూడా అక్కడికి చేరిపోయాడు.. అప్పటి మంత్రి అనుచరులే తన కారును కాల్చివేశారని ఆరోపణలు చేసి పత్రిలకెక్కాడు. ఈ వివాదాలవల్లే ఆ పార్టీలో అధికారప్రతినిధి పదవి సంపాదించాడు. గత ఎన్నికల్లో కార్పోరేటర్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఓడిపోక తప్పలేదు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీలో చేరి, నెలతిరక్కుండానే అక్కడా ఇమడలేక ఇటీవల కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని ఆశ్రయించాడు. ఆయన పార్టీలు మారడం ఎవ రికీ అభ్యంతరం లేకపోయినా ఆ కారణంతో చేసిన అక్రమ వసూళ్లు వివాదంగా మారుతున్నాయి. తాను అడిగిన సొమ్మును ఇవ్వలేదని ఓ ఇంజినీర్‌ను ఏకంగా తుపాకీతో బెదిరించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం కడప కార్పొరేషన్లో చర్చనీయాంశమైంది. బెదిరింపులు ఇలా... నేను పార్టీ మారాను.. మా నాయకుడు రేపు కడపకు వస్తున్నారు.. మీ తరుపున లక్ష రూపాయలు ఇవ్వాలి..అంత లేదంటే కనీసం యాభై వేలైనా ఇవ్వాలి.. అంతకు ఏమాత్రం తగ్గినా మీ స్థాయికి బాగుండదు... ఇలాంటి మాటలు చెప్పే కడప నగరపాలక సంస్థలో ఇంజినీర్లు, టౌన్‌ప్లానింగ్ అధికారులనుంచి సుమారు లక్షన్నర రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఐదువేలో, పదివేలో అంటే ఇవ్వగలంగానీ లక్షరూపాయలంటే ఎక్కడినుంచి తేవాలి.. అంత ఇవ్వలేను అని ఎదురుతిరిగిన ఇంజినీరుపై కార్పొరేషన్లోనే తుపాకీ చూపెట్టి బెదిరించినట్లు తెలుస్తోంది. కాగా అదే ఇంజినీరుపై మంత్రి పల్లె రఘునాథరెడ్డి లెటర్‌హెడ్‌లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కడప నగరపాలక సంస్థలో అధికారులనుంచి చేసిన వసూళ్ల పట్ల మేయర్ సీరియస్‌గా స్పందించినట్లు తెలిసింది. ఎవరెవరైతే డబ్బు ఇచ్చారో వారికి సంబంధించిన వర్క్‌లను తానే తనిఖీ చేస్తానని, ఆ తర్వాతే వారికి బిల్లులు చేస్తామని తెగేసి చెప్పినట్లు సమాచారం. * మీ డివిజనల్ స్థాయి అధికారిని ఇక్కడికి నేనే రప్పించాను.. మీకు భవిష్యత్తులో ఏ సాయం కావాలన్నా నాకు చెప్పండి. చేయిస్తా. ప్రస్తుతం నేను ఉంటున్న పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది అంటూ ఉద్యోగుల నుంచి సుమారు రెండున్నర లక్షల వరకూ రాబట్టినట్లు తెలుస్తోంది. * గతంలో రెవెన్యూ మంత్రిగా ఉన్న రఘువీరారెడ్డి కడపకు వచ్చినప్పుడు కూడా అధికారులనుంచి ఇదేరీతిలో వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. అమర్ హాస్పిటల్ వద్ద ఇళ్లస్థలాలు ఇప్పిస్తానని చెప్పి సుమారు 40 మంది వద్ద రెండు లక్షల చొప్పున వసూలు చేసినట్లు సమాచారం. ఆయన ఉంటున్న ఇంటిపై కూడా గతంలో వివాదం ఏర్పడింది. తమ ఇళ్లు ఆక్రమించుకుని బాడుగ చెల్లించడం లేదని, గట్టిగా అడిగితే తుపాకీ చూపించి బెదిరించాడని ఆలంఖాన్‌పల్లెకు చెందిన బాధితులు విలేకరుల సమావేశం నిర్వహించి వాపోయారు. ఇన్ని చేస్తున్నా.. తుపాకీ ై లెసైన్సును దుర్వినియోగం చేస్తున్నా ఈయనపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.