Toyota Motor Corp
-
భారత్‌లో టయోటా మూడవ ప్లాంట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ టయోటా మోటార్.. భారత్‌లో మూడవ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఏటా 80,000–1,20,000 యూనిట్ల సామర్థ్యంతో ఈ కేంద్రాన్ని స్థాపించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో నూతన కేంద్రంలో తయారీ సామర్థ్యాన్ని 2,00,000 యూనిట్లకు చేరుస్తారు. కర్నాటకలోని బీదడి వద్ద ఉన్న టయోటాకు చెందిన రెండు ప్లాంట్లు ఏటా 4,00,000 యూనిట్లు తయారు చేయగలవు. ఈ ప్లాంట్లకు సమీపంలోనే మూడవ కేంద్రం నెలకొల్పాలన్నది కంపెనీ ప్రణాళిక. భారత విపణి కోసం కొత్త ఎస్‌యూవీని అభివృద్ధి చేసే పనిలో కంపెనీ ఇప్పటికే నిమగ్నమైంది. 2026లో ఇది ఇక్కడి రోడ్లపై పరుగు తీయనుంది. కొత్త ఫ్యాక్టరీలో ఈ ఎస్‌యూవీని తయారు చేయనుండడం విశేషం. మధ్యస్థాయి అర్బన్ క్రూజర్ హైరైడర్‌కు మలీ్టపర్పస్ వెహికిల్ ఇన్నోవా హైక్రాస్కు మధ్య ఈ మోడల్ ఉండనుంది. 340–డి కోడ్ పేరుతో రానున్న ఈ ఎస్యూవీ మోడల్ కింద ఏటా 60,000 యూనిట్లను ఉత్పత్తి చేయాలన్నది కంపెనీ ఆలోచన. ఇందుకోసం సరఫరాదార్లను టయోటా సన్నద్ధం చేస్తోంది. భారత్‌లో మినీ ల్యాండ్ క్రూజర్‌ను సైతం పరిచయం చేయాలని సంస్థ భావిస్తోంది. టయోటా మోటార్, సుజుకీ మోటార్ కార్పొరేషన్‌తో అంతర్జాతీయంగా భాగస్వామ్యం ఉన్న సంగతి తెలిసిందే. భారత్‌లో టయోటా ప్లాంట్ల సామర్థ్యంలో 40 శాతం మారుతీ సుజుకీ వినియోగించుకుంటోంది. భారత్‌లో 2030 నాటికి ఏటా 5,00,000 యూనిట్ల తయారీ సామర్థ్యం కలిగి ఉండాలని టయోటా భావిస్తోంది. -
టాయోటా కార్ల భారీ రీకాల్
టోక్యో : ప్రముఖ కార్ల కంపెనీ టయోటా మోటార్ కార్పొరేషన్ భారీ ఎత్తున కార్లను రీకాల్ చేయనుంది. ఎయిర్ బ్యాగ్ లో సాంకేతిక లోపం కారణంగా ఇటీవల భారీ ఎత్తున కార్లను వెనక్కి తీసుకుంటున్న సంస్థ మరోసారి పెద్ద ఎత్తున రీకాల్ చేపట్టింది. సుమారు 5 లక్షలకు పైగా వెహికల్స్ ను వెనక్కి తీసుకోనుంది. జపాన్ టకట కార్పొరేషన్ చేసిన లోపభూయిష్ట ఎయిర్ బ్యాగ్స్ కారణంగా అమెరికాలో 5,43,000 వాహనాలను రీకాల్ చేయనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 2006-2012 మధ్య తయారు చేసిన వివిధ మోడల్ కార్లలో సెడాన్ మరియు స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలున్నట్టు చెప్పింది. అలాగే 2008-2009 సియోన్ ఎక్స్ బి , 2009 - 2012 కరోలా, కరోలా మ్యాట్రిక్స్ , యారిస్,సియన్నా , లెక్సస్ ఇతర వాహనాలు ఉన్నట్టు ప్రకటించింది. కాగా ఎయిర్ బ్యాగుల తయారీలో ఉపయోగించిన అమ్మోనియం నైట్రేట్ రసాయనం మూలంగా గతంలో అనేక పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో 16 మంది చనిపోగా, 180 మందికి పైగా గాయపడ్డారు. -
నాలుగు లక్షల టయోటా కార్లు రీకాల్
టోక్యో: జపాన్ లో ప్రముఖ కార్ల కంపెనీ టయోటాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. దాదాపు నాలుగు లక్షల కార్లను వెనక్కి తీసుకుంటున్నట్టు జపనీస్ వాహన తయారీదారు టయోటా మోటార్ కార్పొరేషన్ బుధవారం ప్రకటించింది. కొన్ని సాంకేతిక లోపాల కారణంగా జపాన్ సహా, కొన్ని విదేశీ మోడళ్లకు చెందిన సుమారు 3లక్షల తొంభై వేల కార్లను రీకాల్ చేస్తున్నట్టు వెల్లడించింది. దేశీయ మార్కెట్లో విడుదల చేసిన లగ్జరీ సెడాన్ మోడల్, మార్క్ X సెడాన్ మోడళ్ల సుమారు 3,26, 000 వాహనాలను టయోటా రీకాల్ చేసింది. డిసెంబర్ 2003, 2007 అక్టోబర్ మధ్య కాలంలో ఉత్పత్తి చేసిన ఈ కార్లను వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించింది. దీంతోపాటుగా యూరోప్ , ఓషియానియా, ఆసియా తదితర ప్రాంతాలలో కూడా IS250, GS300 మోడళ్ల మరో 64 వేల వాహనాలను వెనక్కి పిలిపించింది . ఇంధనం సరఫరా చేసే ఫ్యూయల్ ప్రెజర్ సెన్సార్ ఎటాచ్ మెంట్ లో లోపం కారణంగా లీకేజ్ సమస్యలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. స్లీరియో ఆంప్లిఫైయర్ లో లోపాలకారణంగా క్రౌన్ , క్రౌన్ మెజెస్టా మోడళ్లకు చెందిన దాదాపు 17 వేల కార్లను రీకాల్ చేసింది. స్టీరియో యాంప్లిఫైయర్ సిస్టమ్ లో తలెత్తిన ఎలక్ట్రికల్ లోపాల కారణంగా జనవరి 2008 మరియు జూలై 2013 మధ్య తయారైనకార్లను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపింది. -
టోక్యో ఆటోషో సందడి...
టోక్యో ఆటో షో ప్రివ్యూలో సందడి చేస్తున్న కొత్త కార్లు, బైక్‌లు ఇవి. డిసెంబర్ 1 దాకా జరిగే ఈ షోలో 23 నుంచి సందర్శకులను అనుమతిస్తారు. టయోటా ఐ రోడ్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారు ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్-1 కారు హోండా హోల్డ్ వింగ్ ఎఫ్6సి బైక్‌పై టయోటా మోటార్స్ ప్రెసిడెంట్ అకియో టయోడా, పక్కన హోండా ప్రెసిటెండ్ తకనొబు మీడియా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రివ్యూలో వివిధ వాహనాలు