టాయోటా కార్ల భారీ రీకాల్ | Toyota adds 543,000 vehicles to Takata air bag recalls in United States | Sakshi
Sakshi News home page

టాయోటా కార్ల భారీ రీకాల్

Published Fri, Jan 13 2017 2:33 PM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM

టాయోటా కార్ల భారీ రీకాల్

టాయోటా కార్ల భారీ రీకాల్

టోక్యో : ప్రముఖ కార్ల కంపెనీ టయోటా మోటార్ కార్పొరేషన్ భారీ ఎత్తున కార్లను రీకాల్ చేయనుంది. ఎయిర్ బ్యాగ్ లో సాంకేతిక లోపం కారణంగా ఇటీవల భారీ ఎత్తున కార్లను  వెనక్కి తీసుకుంటున్న సంస్థ మరోసారి పెద్ద ఎత్తున రీకాల్ చేపట్టింది. సుమారు  5 లక్షలకు పైగా వెహికల్స్ ను వెనక్కి  తీసుకోనుంది.

జపాన్ టకట కార్పొరేషన్ చేసిన లోపభూయిష్ట ఎయిర్ బ్యాగ్స్ కారణంగా అమెరికాలో  5,43,000 వాహనాలను రీకాల్ చేయనున్నట్టు  కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.  2006-2012 మధ్య తయారు చేసిన వివిధ మోడల్ కార్లలో  సెడాన్ మరియు స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలున్నట్టు  చెప్పింది. అలాగే  2008-2009 సియోన్ ఎక్స్ బి , 2009 - 2012 కరోలా,  కరోలా మ్యాట్రిక్స్ ,  యారిస్,సియన్నా , లెక్సస్ ఇతర వాహనాలు ఉన్నట్టు ప్రకటించింది. కాగా ఎయిర్  బ్యాగుల తయారీలో ఉపయోగించిన అమ్మోనియం నైట్రేట్ రసాయనం మూలంగా గతంలో అనేక పేలుళ్లు  చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో 16  మంది చనిపోగా, 180 మందికి పైగా గాయపడ్డారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement