పోలీస్‌స్టేషన్‌కు నూతన భవనం
శంకుస్థాపనకు ఏర్పాట్లు
తోటపల్లిగూడూరు : తోటపల్లిగూడూరు పోలీస్‌స్టేషన్‌కు నూతన భవనం నిర్మాణానికి అనంతపురంలో సెంబ్‌కార్ఫ్ గాయత్రి పవర్ కాంప్లెక్స్ (ఎన్సీసీ) యాజమాన్యం రూ.75 లక్షలను కేటాయించింది. 16 ఏళ్ల కిందట నిర్మించిన పాత పోలీస్‌స్టేషన్ భవన సముదాయం శిథిలావస్థకు చేరుకుంది. ఈ భవనంలో కొన్నేళ్ల నుంచి సిబ్బంది ఇబ్బందులు నడుమ విధులను నిర్వర్తిస్తున్నారు. పోలీస్ అధికారుల కోరిక మేరకు సెంబ్‌కార్ఫ్ గాయత్రి పవర్ కాంప్లెక్స్ యాజమాన్యం నూతన భవనాన్ని నిర్మించేందుకు ముందుకువచ్చింది. రూ.75 లక్షలను మంజూరు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. దీంతో అధికారులు ఎన్సీసీ కేటాయించిన ఈ నిధులతో నూతన పోలీస్‌స్టేషన్ భవనం, పోలీస్ క్వార్టర్స్‌ను నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మూడు రోజుల కిందట స్టేషన్‌ను ఖాళీ చేసిన పోలీస్ సిబ్బంది తోటపల్లిగూడూరు వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయం నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం పాత పోలీస్‌స్టేషన్ భవనాన్ని కూల్చి వేసిన అధికారులు నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు.