32 మందిని రక్షించి..మృత్యుఒడిలోకి..
ఎస్సార్పీ-3 ప్రమాదంలో మైనింగ్ సర్దార్ మృతి
♦ గనిలో నీటి ప్రవాహమే కారణం
♦ మృతుడిది స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తాటికొండ
♦ ఓవర్‌మన్ నిర్లక్ష్య వైఖరిపై కార్మికుల ఆగ్రహం
శ్రీరాంపూర్(ఆదిలాబాద్) : ఏరియాలోని ఎస్సార్పీ-3 గనిలో మై నింగ్ సర్దార్ పెసరు సత్యనారాయణ(51) మృతి చెందాడు. గనిలో నీటి ప్రవాహం ధాటికి ఈ ఘటన జరిగింది. తోటి కార్మికుల కథనం ప్రకారం... సోమవారం ఉదయం షిఫ్టులో గని భూగ ర్భం లోని 16వ లెవల్ వద్ద స్టవింగ్ కోసం బారి కేడ్ కట్టి సింకేజ్ టెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ అండర్ మేనేజర్ శంకర్, ఓవర్‌మన్ తిరుపతి ఉన్నారు. దాని కింది పని స్థలం 9 డిప్, 14వ లెవల్ వద్ద మైనింగ్ సర్దార్ పెసరు సత్యనారాయణ విధి నిర్వహణలో ఉండగా ఫిల్లింగ్ కార్మికు లు పనిచేస్తున్నారు.
పై స్థలంలో సింకేజ్ టెస్ట్ జరుగుతోంది కాబట్టి కింద పని చేపట్టవద్దని ఓవర్‌మన్ తిరుపతిని అక్క డ పనిచేసే కార్మికులు కోరినా అతను విని పించుకోకుండా పనిపెట్టించాడు. అక్కడ సు మారు 20 మంది కోల్ఫిల్లర్లు, 4 కోల్కట్టర్లు, 8 మంది టింబర్‌మన్లు ఉన్నారు. స్టవింగ్ కోసం కట్టిన బారికెడ్ల గోడకు చిన్న గేట్ వాల్ ఉంటుంది. అందులో యాష్(బూడిద) నిండిపోగా మిగిలిన నీరు వాల్వ్ నుంచి వెళ్లిపోవాలి. అరుుతే వాల్వ్ మూసుకు పోవడంతో నీటి ఉధృతి పెరిగి ఒక్క సారిగా గోడ బద్ధలైంది.
కార్మిక సంఘాల ఆందోళన
విషయం తెలియగానే కార్మిక సంఘాల నాయకులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని గనిపైకి తీసుకువచ్చిన తరువాత బాధిత కుటుంబానికి న్యాయం చేయూలని, సంఘటనకు బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులతో కలిసి ఆందోళనకు దిగారు. సీనియర్ కార్మికులు, మైనింగ్ సిబ్బంది చెప్పినా ఓవర్‌మన్ తిరుపతి పట్టిం చుకోకుండా తమతో బలవంతంగా పనులు చేరుుస్తున్నాడని, అతడి నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు వాపోయూరు.
32 మంది ప్రాణా లు కాపాడిన సత్యనారాయణకు రూ.25 లక్ష ల ఎక్స్‌గ్రేషియూ చెల్లించి, ప్రమాదానికి కారణమైన అధికారుల పై చర్య తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. అప్పటి వర కు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించా రు. ఎట్టకేలకు సీజీఎం వెంకటేశ్వర్రావు వచ్చి బాధ్యులపై చర్య తీసుకుంటామ ని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. టీబీజీకేఎస్, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, టీఎన్టీయూసీ, టీడీపీ, ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయూస్ అసోసియేషన్ నా యకులు పానుగంటి సత్తయ్య, సమ్మిరెడ్డి, మహిపాల్‌రెడ్డి, కాశీరావు, వి.సీతారామ య్య, పేరం రమేశ్, మంతెన మల్లేశ్, మోతె రాఘవరెడ్డి, జక్కుల రాజేశం, బి.సత్యాజీ, కెన్నడీ తదితరులు పాల్గొన్నారు.
మృత్యువు వెంటాడినా..
ఆ శబ్ధం విన్న సత్యనారాయణ తన ప్రాణాలు కాపాడుకోవడానికంటే ముందు తన కింద పనిచేస్తున్న కార్మికులను రక్షించాలనే తలంపుతో బాగో.. బాగో.. అంటూ అరిచాడు. దీంతో అక్కడ ఉన్నవారంతా పరుగెత్తుకుంటూ దూరంగా వెళ్లారు. అప్పటికే బూడిద నీరు వేగంగా వచ్చి సత్యనారాయణను కమ్మేసింది. డీ్ప్ ఏరియా కావడంతో ప్రవాహంలో కింద ఉన్న టబ్బుల వరకు కొట్టుకుపోయాడు. బూడిదనీరు, ప్రవాహానికి కొ ట్టుకొచ్చిన రాడ్లు, రేల్స్ అతడిపై పడ్డా రుు. కొద్ది సేపటికి కార్మికులు అధికారులకు సమాచారం అందించారు. శిథిలాల నుంచి సత్యనారాయణను బయటికి తీ సేసరికే చనిపోయూడు.
ఒంటిపై తీవ్ర గాయలున్నాయి. మృతదేహాన్ని చూసిన తోటి కార్మికులు కన్నీటి పర్యం తమయ్యూరు. సంఘటన స్థలాన్ని గని మేనేజర్ రమేశ్, సేఫ్టీ అధికారి రవికుమార్, డీఎం శ్రీధర్ సందర్శించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఎస్‌ఓటూ జీ ఎం.సత్యనారాయణ, ఏజీఎం ఫణి, డీజీ ఎం(పర్సనల్) శర్మ అక్కడికి చేరుకున్నారు. నస్పూర్ కాలనీలో నివాసం ఉండే సత్యనారాయణకు భార్య రాజేశ్వ రి, పిల్లలు అభినయ్, అలేఖ్య ఉన్నారు. వారి స్వగ్రామం వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తాటికొండ.