హోలీ ఆయిచే..
హోలీ పండగ వచ్చిందంటే చాలు వారం ముందు నుంచే గ్రామాల్లో గిరిజన మహిళలు ఆటపాటలతో సందడి చేస్తుంటారు. తండాల్లో పండగను ఘనంగా జరపుకోవడానికి పట్టణానికి వచ్చి సంప్రదాయపాటలు, నృత్యాలు చేస్తూ ప్రజలను ఆకట్టుకొని డబ్బులను వసూలు చేస్తారు.
వాటితె రంగులను, సంప్రదాయ బట్టలు, అలంకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు. శనివారం మన్యంకొండ వద్ద గిరిజనులు ప్రదర్శనలు నిర్వహిస్తూ ఇలా అలరించారు.