పెళ్లిచూపుల్లో...
మోడ్రన్ టచ్‌తో సాగే ట్రెడిషనల్ లవ్‌స్టోరీగా తెరకెక్కనున్న చిత్రం ‘పెళ్లి చూపులు’. ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ విజయ్ దేవరకొండ హీరోగా, రీతూ వర్మ కథానాయికగా రూపొందనున్న ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తరుణ్‌భాస్కర్ దర్శకత్వంలో రాజ్ కందుకూరి, బిగ్‌బెన్ సినిమాస్ కలసి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అశోక్ కుమార్ స్విచ్చాన్ చేయగా, నిర్మాత డి.సురేశ్‌బాబు క్లాప్ ఇచ్చారు. నిర్మాతలు మాట్లాడుతూ-‘‘ఫ్రెష్ సబ్జెక్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం.
మొత్తం 42 రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి మిగిల్చేలా ఈ చిత్రాన్ని రూపొందించనున్నామని అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌సాగర్.